TOP NEWS

TOP NEWS: ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. ఖమ్మం జిల్లా చంద్రగొండు మండలం తంగారం వద్ద వాగులో పడ్డ స్కూల్ బస్సు 14 మంది చిన్నారుల మృతి. మరో 30 మందికి తీవ్రగాయాలు. శ్రీలంకపై బంగ్లాదేశ్ సంచలన విజయం. నేడే ఉప ఎన్నికల కౌంటింగ్. .

20 March, 2012

ఖమ్మం జిల్లాలో ఘోర ప్రమాదం..!


ఖమ్మం జిల్లాలో ఘోర ప్రమాదం..!



 అమ్మ ఒడి విడిచి బడిలో చేరేలోపే మృత్యువు కబలించింది. ఆడుతూ పాడుతూ కేరింతలు కొడుతున్న చిన్నారుల ఆనందం తాగుబోతు డ్రైవర్ నిర్లక్ష్యంతో ఆవిరైపోయింది. ఇంట్లో చేరి బొమ్మలతో ఆడుకోవాలనుకున్న పసిమొగ్గల ఆలోచనలు జలరక్కసి కోరల్లో చిక్కి మునిగిపోయాయి. ఒక్కరా ఇద్దరా 14 మంది బోసి నవ్వుల చిన్నారులు ప్రాణం విడిచారు. మరో 30 మంది చిన్నారులు తీవ్రంగా గాయాలపాలయ్యారు.
       ఖమ్మం జిల్లాలోని రేగోండపాలేం వాగులో పడి చనిపోయిన పసిపిల్లల కుటుంబసభ్యుల ఆర్తనాదాలతో ప్రభుత్వ ఆసుపత్రి బోరుమంది. బంధువులు, అధికారులు ప్రజాప్రతినిధుల ఓదార్పుతో చెలించిపోయింది. జిల్లా  అంతటా ఎల్వీ రెడ్డి స్కూల్ యాజమాన్యానికి వ్యతిరేఖంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అయినయి. విద్యార్ధి సంఘాలు స్కూల్ బంద్ కు పిలుపునిచ్చినయి. చనిపోయినవారంత పసిపిల్లలే కావడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నరు. తమ బిడ్డల చావుకు కారణమైన స్కూల్   యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్   చేస్తున్నరు. ఇక ప్రమాదం పట్ల సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో పాటు పలువురు రాజకీయ నాయకులు విచారం వ్యక్తం చేసిన్రు. కుటుంబసభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపింరు.

మారని కథ..అభిమానుల వ్యథ..!


మారని కథ..అభిమానుల వ్యథ..!

       ఆడిగెలవరా బాబు అంటే.. పక్కోడు ఓడితే ఆడతాం అంటూ కూర్చునే స్థితికి దిగజారింది టీంఇండియా. అజారుద్దీన్ వేసినా దారిపై గంగూలీ మాంచి రోడ్డెసిస్తే.. తేరగా వరల్డ్ కప్ తీసుకున్న ధోని..ఇప్పుడు గెలిపియ్యవయ్యా అంటే మాత్రం పక్క టీం ఢమాల్ కావాలని పూజలు చేస్తున్నాడు. ఏం లాభం మంత్రాలకు చింతకాయలు రాలుతాయా.. ఇదీ అంతే. జీవితం అన్నాక కాస్తా మంచి ఆలోచనలు పెద్ద,చిన్నవాళ్లను గౌరవించే సంస్కారం ఉండాలి. లేకపోతే వరల్డ్ కప్ తీసుకువచ్చిన సింగ్ నేతృత్వంలోనే టీంఇండియా అథ:పాతాలానికి చేరుకోవడం మాత్రం ఖాయం.  ఇప్పటికే చాలా మారాల్సిన ధోని మాత్రం ఇంకా తన మార్క్ పాలిటిక్స్ కొనసాగిస్తునే ఉన్నాడు. ఇంకా నీరో చక్రవర్తిలా నియంత రాజ్యంగా మార్చలనుకుంటున్నాడు. అందులో భాగంగానే తన దిక్కుమాలిన రాజకీయాలతో వీరేంద్ర సెహ్వాగ్ ను ఇంట్లో కూర్చోబెట్టాడు. అంతేనా పైనా కూల్ గా కనిపించే ధోని ఆ మధ్య యువరాజ్ గేమ్ తోను ఆడుకున్నాడు. పాపం యువీకి ఆరోగ్య సమస్యతో టీంకు దూరమయ్యాడు గానీ ఖచ్చితంగా ధోనీ.. యువీని కూడ తన పాలిట్రిక్స్ తో ఇంట్లో కూర్చోబెట్టేవాడే కావచ్చు. ధోని ఎల్లో ఆలోచనలకు మంచి ఆటగాళ్లు చాలా మంది బలైపోయారన్న సంగతి వరల్డ్ కప్ విన్ లో పడి కొట్టుకుపోవడంతో అందరు ధోనిని యోధునిగా.. వీరునిగా కొలుస్తున్నారు. కొలిచినా తప్పేం లేదు. అయితే వచ్చిన ఇబ్బంది అల్లా మల్లెపువ్వుల నుంచి మకరందం ఆశించే తేనే పురుగుల్లా.. టీంఇండియా నుంచి నిత్యం గెలుపు కోసం ఆశించే అభిమానుల నుంచే. ఎందుకంటే ఇండియా ఓడిపోతే అన్నం ముట్టని వీరాభిమానులున్నారు. ఇక పల్లెటూర్లలో అయితే ఏకంగా తిట్టుకొని..కొట్టుకుంటున్న సందర్భాలు ఉన్నాయి. అందుకే ఒక్కరిని నిందించ దలుచుకోలేదు. ఎందుకంటే ఎవ్వరిని ఏమన్నా నాగుపాముల్లాగా బుసలు కొట్టే అభిమానులు.. వాళ్ల ఆవేశమంత ఎదురుగా ఉన్నవాళ్ల మీద కక్కెస్తున్నారు. అందుకే ఆరు ఓటములు.. మూడు పనికి రానీ విజయాలతో ఇండియా పనికి రానీ జట్టుగా మారినా ఎవ్వరిని ఏమనవద్దు. ఇలాగే ఉండాలా అంటే ఇదే విజయానికి సూత్రమని బల్లగుద్ది వాదించేవారున్నారు. కాదని వారిస్తే అసలు మీకు క్రికెట్ తెలియదని ప్రకటించే ప్రముఖులున్నారు. ఏం చేస్తే యథా అభిమాని..తధా టీంఇండియా.  

19 March, 2012

మరోసారి రెచ్చిపోయిన పూనం పాండే.


మరోసారి రెచ్చిపోయిన పూనం పాండే. 

క్రికెట్ అంటే పడి చచ్చిపోయేవాళ్లు ఎందరున్న పూనం పాండే తీరే వేరు. ఇండియా వరల్డ్ కప్ గెలిస్తే బట్టలు విప్పి టీంఇండియా ప్లేయర్లతో రోమాన్స్ చేస్తానన్న పూనం.. పాకిస్థాన్ పై కోహ్లీ సెంచరీ చేసాక అతడిపై మనసు పారేసుకుంది. నీ కోసమేనంటూ చిట్టిపొట్టి దుస్తులతో క్రికెటర్ల మనసును లాగించేసే ఫోటోనొకటి ట్వీట్ చేసి మరోసారి హల్చల్ చేసింది. పూనం టీంఇడియా కోసం చేస్తుందా..? లేక తన బాలీవుడ్ అవకాశాల కోసం ఇలా ప్రచారం చేసుకుంటుందా తేల్చుకోలేక సతమతమవుతున్నరు. ఏదీ ఏమైనా పబ్బ్ ల పార్టీలు..మందుల చిందుల కోసం కోచింగ్ క్యాంపు గోడలు దూకే శ్రీశాంత్ లాంటి వాళ్లకు ఇదో ఎంటర్ టైన్ మెంట్ అనే చెప్పాలి. 

16 March, 2012

సచిన్ వంద..మ్యాచ్ గోవిందా..!

సచిన్ వంద..మ్యాచ్ గోవిందా..!


ఎన్నాళ్లుగానో ఎదిరి చూసిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సెంచరీల సెంచరీ అయితే  అయ్యింది కానీ..పసికూన బంగ్లాదేశ్ చేతిలో  టీంఇండియా చిత్తుగా ఓడిపోయింది. సెంచరీ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదిరి  చూసిన సచిన్... 147 బంతుల్లో 12 ఫోర్లు 1 సిక్స్ తో  14 పరుగులు సాధించాడు. అయితే ఏం లాభం  ఎప్పటిలాగే తన శతకం కోసం అమూల్యమైన 33 బాల్స్ ను హృదా చేసాడు.  ఈ 33 బంతుల్లో బాల్ కు ఒక పరుగు వస్తే జట్టు స్కోరు 322 పరుగులు అయ్యేది. ఇక సచిన్ 44 వ ఓవర్ వరకు ఉన్నాడు కాబట్టి..లాస్ట్ మూవ్ మెంట్ లో బాల్ కు రెండు పరుగులు వచ్చినా 355 పరుగుల భారీ స్కోర్ అయ్యేది కానీ ఏం చేస్తాం అక్కడ ఆడేది సచిన్.. ఆపై వంద కోసం వంద కోట్ల మంది ఎదిరి చూపులు.. దేశం పరువు గంగలో కలిసిపోతే మనకెందుకు.. ప్రపంచం ముందు కంట్రీ పరాజీతం అయితే లెక్కెందుకు.. మనకు కావాల్సింది సచిన్ సెంచరీ అనుకునే పిచ్చి అభిమానులు ఉన్నప్పుడు దేశం ఎప్పుడు బాగుపడుతుంది. ఒక్క క్రికెటే కాదు దేంట్లోనైనా ఇదే పిచ్చి అభిమానం.. వెర్రి ఆలోచన విధానం. మారమంటే పిచ్చివాదనలు.. గత చరిత్రల ఉదహరణలు.. తాము అభిమానించిన వ్యక్తే నిజమైన  దేశాభిమాని అనే పనికిమాలినవాదనలు. ఇలాంటి సెంటిమెంటల్ ఫూల్స్ ఉన్నంత వరకు చచ్చినా  దేశం బాగు పడదు. పోనీ పోతే పోనీ అనుకుంటారా.. సచిన్ లాంటి వ్యక్తిగత ఆలోచనపరుల ఆలోచనలకు మద్దతు పలుకుతారా..? అది మీ చాయిస్..
ఇంకో మాట.. మీరు ఇలానే అభిమానించండి... కొడుకు అర్జున్ తో        కూడా కలిసి దేశాన్ని బ్రష్టుపట్టిస్తాడు. అప్పుడు కూడా ఏ నెథర్లాండో.. కెనాడానో చూసుకొని యేడాదికో రెండెడ్లకో సెంచరీ చేసి వెర్రి అభిమానులతో వాహ్ వా అనిపించుకుంటాడు.. క్రికెట్ ఇండియాను పిక్కుతిని మాంసం లేని బొక్కలు బొమ్మను చేసి.. ఇండియా హకీ లాగా ఇండియన్ క్రికెట్ ను మార్చి తన రక్షసానందాన్ని అనుభవిస్తూ పత్రికల్లో ఆర్టికల్స్ రాస్తూ..  టీవీల్లో కామెంట్రీ చేస్తూ తన పిశాచనాందాన్ని పొందుతాడు.
బెస్ట్ ఆఫ్ లక్ సచిన్..

11 March, 2012

అతి అరుదైన సంపద అటవిపాలు..


అతి అరుదైన సంపద అటవిపాలు..





అక్కడి రాళ్లు ఓ చరిత్రకు పురుడు పోసినయి. ఆ కొండలు ఘనమైన వారసత్వ 

సంపదను 

కడుపులో దాచుకున్నయి. ప్రపంచంలో ఎత్తైన హుస్సెన్ సాగర్ బుద్ధుడికి తనువునిచ్చిన 

శిలలు.. వాటితో పురుడు పోసుకున్న అపురూపమైన శివుని ప్రతిమలు, లింగాలు నేడు 

రాళ్లు రప్పలు, చెట్ల పొదల మాటున అనాధలుగా మిగిలినయి. అద్భతమైన పర్యాటక 

క్షేత్రంగా అభివృద్ధి చెందే అన్ని అవకాశాలు ఉన్నా..పాలకుల నిర్లక్ష్యంతో 

బోసిపోతున్నాయి. అధికారులు ఇప్పటికైనా రాయగిరి కొండల చరిత్రపై అధ్యయనం చేసి 

అక్కడి సంపదను రక్షించాలి.. పురావస్తు శాఖ అధికారులు పరిశోధన చేసి ఆలయానికి 

సంబంధించిన ప్రతి విషయాన్ని అక్షరికరించాలి. పాలకులు నిద్రమత్తును వీడి అరుదైనా 

విగ్రహాలకు ఆలయాన్ని నిర్మించి భవిష్యత్ తరాలకు అందించాలి.

22 February, 2012

తలపున కృష్ణమ్మ పారిన తలరాత మారడం లేదు.


తలపున కృష్ణమ్మ పారిన తలరాత మారడం లేదు.


      తలపున కృష్ణమ్మ పారుతున్న చెంబెడు నీళ్లు రావు.  కోట్ల రూపాయలతో సర్కారు ‌ప్రాజెక్టులు కట్టిన చుక్క నీళ్లు అందవు. గుక్కెడు నీటి కోసం కిలోమీటర్లు నడవకుంటే గొంతు తడవని పరిస్థితి. పదుల మీటర్లు బోర్లు వేసి.. భగీరథ ప్రయత్నం చేసిన తీరని నీటి కష్టాలు. పాలకుల నిర్లక్ష్యం.. కాలం మిగిల్చిన కరువుతో అల్లాడుతున్న నల్లగొండ జిల్లా గిరిజనుల తాగు సాగు నీటి వేతలు అన్ని ఇన్ని కావు. పథకాల పేర ఊదరగొట్టే పాలకులు గిరిజనులను పట్టించుకున్న పాపానపోవడంతో నానా అవస్థలు పడుతున్నరు. ఓట్లప్పుడు ఇంటింటికి నల్లా కనెక్షన్లు ఇస్తాం, తాగునీటి కష్టాలు తీరుస్తాం. ప్రాజెక్టులను కట్టి సాగు బాధలు ఉండవని అరచేతిలో స్వర్గం చూపించే నాయకులు.. ఇప్పుడు మాత్రం తాండాల దిక్కు చూసే ప్రయత్నం కూడ చేయడం లేదని గిరిజన మహిళలు ఆవేదన వ్యక్తంచేస్తున్నరు. నీళ్ల కోసం.. తమ పిల్లల చదువులు ఆగమైపోతున్నయని వారు దిగులుపుడుతున్నరు.  ఇప్పటికైనా  సర్కారు స్పందించి కష్టాలు తీర్చాలని వేడుకుంటున్నారు.  

21 February, 2012

గూడు చెదిరింది.. గుండె పగిలింది.


గూడు చెదిరింది..  గుండె పగిలింది.


      గూడు నిచ్చె గుడిసెలు కాలీ బూడిదైపోయినయి.నీడ కరువయ్యింది. కండ్ల ముందే కాలీపోయిన గూడును చూసి గుండెలు కూలీపోయినయి. పిల్లల పెండ్లి కోసం దాచిన డబ్బులు..అందరు కలిసి పోగేసుకున్న చిట్టీల మూటలు కాగితాల్లా కాలిపోయినయి. అంతేకాదు ప్రాణానికి ప్రాణంల పెంచుకున్న పిసిపాపలు.. కనిపెంచిన పెద్దవాళ్లు గుడిసెల్లో పడి అగ్నికి ఆహుతవుతుంటే బోరున విలపించడం మినహా ఎం చేయగలరు.. వంద గుడిసెలు ఒక్కసారిగా అంటుకోవడంతో ఏం చేయాలో తెలియక లబోదిబోమంటు ఏడుస్తున్నరు. మా బతుకులెట్లరా.. దేవుడా అంటూ ఏడుస్తున్నరు.
  చుట్టపు చూపుగా వచ్చిన మంత్రి సబిత ఇంద్రారెడ్డి ఆదుకుంటమని చెప్పి జారుకున్నరు. దీంతో ఎలా బతకాలో.. ఏం చేయాలో తెలియక విలవిల్లాడుతున్నరు ఈ పేద జనం. సర్కారు ఆదుకుంటుందన్న ఆశలేదని.. ఎవరైనా దాతలు స్పందించి ఆదుకోవాలని వేడుకుంటున్నరు రంగారెడ్డి జిల్లా మేడ్చెల్ మండలం గుండ్లపోచం పల్లిలో అగ్నిప్రమాదంలో గుడిసెలను కోల్పోయిన జనం.  

14 February, 2012

ఆదివాసులంటే అంత అలుసా..?


ఆదివాసులంటే అంత అలుసా..?






      మేడారం జాతరపై సర్కారుకు ఏం హక్కుంది? అసలు సమ్మక్క-సారలమ్మ జాతరకు ప్రభుత్వం ఏం చేసిందని? ఇంకా ఎన్నాళ్లు ఆదివాసులు పాలకుల పాదల కింద నలిగిపోవాలి? వంద కోట్ల బడ్జెట్ కేటాయిస్తే అన్ని హక్కులు పొడుచుకు వస్తాయా? అధికారం ఉంది కదా అని అన్నిట్ని గుప్పిట్లో పెట్టుకోవడం సమంజసమేనా? మేడారం జాతరకు సర్కారుకు సంబంధం ఎక్కడిది? సర్కారు సహాయం కావాలని ఆదివాసులు పాలకులను ఏనాడైనా అడిగారా? మాకు ఆదాయం కావాలని ఎవరితోనైనా చర్చలు జరిపారా? మరి ఎందుకు సర్కారు పెత్తనం చేస్తుంది. ఎందుకు మేడారం జాతర పూజారులను అడుక్కునే వారిగా మిగిల్చుతుంది? హుండీ ఆదాయం కోసం ఎందుకు దేబికరించే స్థితికి దిగజార్చింది? షాపుల టెండర్ల ద్వారా వచ్చిన కోట్లాది రూపాయలను ఏం చేస్తున్నారు? ఎందుకు ఆదివాసీ ఆత్మబంధులు ఇలవేల్పు గద్దెలపై పోలీసు బూట్లను ప్రవేశపెడుతుంది? ఎందుకు ఆదివాసీల గుండెలపై తుపాకులను ఎక్కుపెడుతుంది? ఎందుకు పరమ పవిత్రంగా భావించే సమ్మక్క-సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెల చుట్టు ఇనుపకంచెలు వేసి బంధిస్తుంది. అధికారం ఉన్నది ప్రజల మనోభావాలను చంపడానికేనా..? ప్రజల సెంటిమెంట్ల మీద స్వారీ చేయడానికేనా? ఎన్నని అడగాలి ఆదివాసిలు.. నోరు లేని అమాయకులు..?ఎం చెబుతుంది ఈ మానవత్వం లేని సర్కారు?
     పసుపు, కుంకుమా, ఇన్ని వెదురు బొంగులు..నేలతల్లి తనువుతో కట్టుకున్న గద్దెలు ఇవే మేడారం జాతర..కల్ముషం లేని మనుషులు, ఏ స్వార్థం లేని..ఏ కోరికలు లేని నిజమైన మట్టిమనుషుల జారత. తమను కంటికి రెప్పాల కాపాడుకునే0దుకు మానవ జన్మ ఎత్తిన సమ్మక్క తల్లిని కళ్లలో పోట్టుకని చూసుకోవడం తప్పా అక్కడి వారికి మరే ఆలోచన లేవు. వేసుకున్న పంటలు..పెంచుకున్న పిల్లలు..ఉంటున్న అడవి చల్లగా ఉండాలనే కోరికలు తప్పా మరేమి లేవు. అంతా ప్రేమల జరుపుకునే జాతర ఇంతా వ్యాపారికరణ జరగడం నిజంగా మనసును కలిచివేసేదే. ఓ వైపు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక ట్రాస్ట్ బోర్డ్ ద్వారా వెలిగిపోతుంటే.. కోట్ల రూపాయల ఆదాయం ఉన్న మేడారం జాతర సర్కారు నిధుల కోసం ఎందుకు ఎదురు చూడాలి. టెండర్ల ద్వారా వచ్చిన ఆదాయాన్ని మేడారం ట్రస్ట్ బోర్డుకు ఎందుకు ఇవ్వరు. ఎలాంటి నిర్మాణాలు లేకుండా.. ఆదివాసుల మనోభావాలకు ఆనుగుణంగా ఎందుకు అభివృద్ధిని చేయారు? జాతర వచ్చిందంటే ఆదివాసులను పూజలకు అమ్మవార్ల సేవలకు పరిమితం చేసి కోట్లాది రూపాయలు దండుకోవడం సర్కారుకు న్యాయమవుతుందా..? నిజంగా మాటలు రాకుంటే.. అమాయకంగా ఉంటే మనుషుల్ని ఇంతలా దోచుకుంటారా..ఎంత వరకు సమంజసం ఇది. 
      ఇక జాతర భద్రత పేరుతో సర్కారీ పోలీసులు చేస్తున్న  వెకిలి చేష్టలు ఆదివాసులను కలవరానికి గురిచేస్తున్నాయి. మా జాతరను..సంస్కృతిని మాకు దూరం చేస్తరేమోనని భయందోళనలకు గురిచేస్తుంది. మొన్నటి జాతరలో మావోయిస్టుల నిఘా కోసం కళాబృందాల ముసుగులో పోలీసులు చేసిన దుర్మార్గమైన ప్రయోగం అటవిబిడ్డల కళ్లకు నీళ్లు తెప్పించింది. కళ్లకు అద్దుకునే అమమ్మవారి వాకిట్లో ఖాకీల బూట్ల శబ్ధాలు వాళ్ల గుండెలను కలిచివేసాయి. అంతేకాదు.. ఇక సమ్మక్క జాతరకు వచ్చె భక్తులకు కల్పించాల్సిన ఏర్పాట్లు కల్పించకుండపోవడంపై వారు ఆవేదన చెందుతున్నరు. ఇదీ తల్లులను బదనాం చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆదివాసీలు. అంతేకాదు. రెండెండ్లు అమ్మవార్లను కంటికి రెప్పాలా చూసుకొనే తమకు 33 శాతం కేటాయించి..77 శాతం నిధులను సర్కారు ఖజానాకు తరలించడంపై వారు దిగులుపడుతున్నారు. తమకు 50 శాతం కేటాయించాలని పూజారులు డిమాండ్ చేస్తున్నారు. జాతర చుట్టపక్కల ప్రాంతాల్లో షాపుల కోసం కేటాయించిన భూముల్లో స్వ్కేర్ ఫీట్ కు నాలుగు వేల రూపాయలతో కోట్లాది రూపాయల ఆదాయం..షాపుల టెండర్ల ద్వారా వచ్చినా కోట్లాది రూపాయల ఆదాయాన్ని దక్కించికొని  పలికినా.. తమకు దక్కింది ఏం లేదని వారు బాధపడుతున్నరు.1968 కి ముందు జాతర ఆదాయం అంతా పూజారులకే చెందేది. దీంతో జాతర కు కావాల్సిన అన్ని ఏర్పాట్లను పూజారులు, ఆదివాసి పెద్దలు దగ్గరుండి చూసుకునే వారు. ఎక్కడ అమ్మలకు లోటు జరగకుండ..పద్దతి తప్పకుండ జాతరను జరుపుకునేవారు. కానీ లక్షల మంది జాతరకు వస్తుండటం.. ఆదాయం పరంగా ఉన్నతమైన జాతర కావడంతో సర్కారు మేడారం జాతరను దేవాదయ శాఖ ఆధీనంలోకి తీసుకున్నది. ఇక అప్పటి నుంచి ఆదివాసీలకు కష్టాలు మొదలై ఇప్పటికి వెంటాడుతున్నాయి. జాతర హుండీల ద్వారా వచ్చిన ఆదాయంలో 33 శాతం పూజారులకు కేటాయిస్తున్నది సర్కారు.2008 లో రెండు కోట్ల ఆదాయంరాగా.. 2010లో మూడున్నర కోట్ల ఆదాయం వచ్చినట్టు అంచనా. అమ్మవార్లను పూజించే 300 కుటుంబాలకు ఒక్కొక్కరికి లక్ష కూడ వచ్చిన దఖలాలు లేవు. రెండెళ్ళపాటు వ్యయప్రయాసాలకు ఓర్చి అమ్మవార్లను కంటికి రెప్పాల కాపాడుతున్న పూజారులకు పూట గడిచే పరిస్థితి లేకపోవడం దారుణమైన విషయం.
      సర్కారు ఇప్పటికైనా ఆలోచించాలి.. మేడారం జాతరను ఆదివాసులు జరుపుకునేల ట్రస్ట్ బోర్డుకు అధికారాలను కట్టెబెట్టాలి. ట్రస్ట్ బోర్డుకు సహకరం అందించే ఓ వ్యవస్ధల సర్కారు ఉండాలి. అమ్మవార్ల పూజారుల ఆదేశాలకు అనుగుణంగానే గద్దెల చుట్టు భద్రతను ఏర్పాటు చేయాలి. అందరిని సమానంగా చూసే అమ్మవార్ల దగ్గర వీఐపీ సంస్కృతిని రద్దు చేయాలి. అదివాసులను మేడారం జాతర అప్పుడే కాకుండా వీలుచిక్కినప్పుడల్లా అభివృద్ధి కార్యక్రమాలతో ఆర్ధిక, సామాజిక అభివృద్ధికి తోడ్పడాలి. జాతరపై వస్తున్న ఆదాయంలో 70 శాతం జాతర చారిత్రక పురోగతిపై ఖర్చు చేయాలి. సమ్మక్క-సారలమ్మ చరిత్రకు సంబంధించిన అధ్యయనాన్ని వేగిరం చేయాలి. సమ్మక్క పుట్టుకా..చరిత్రకు సంబంధించిన విషయాలను వెలుగులోకి తీసుకురావాలి. ఆదివాసీ పూజారులకు నెలభత్యం అందించాలి. జాతర దినసరి ఖర్చులకు నెలకు రెండు లక్షల రూపాయలు పూజారులకు అందించాలి. జాతర పరిసరాలు.. ఉనికి కోల్పోకుండ అభివృద్ది కార్యక్రమాలను చేయాలి. రోజురోజుకు తగ్గిపోతున్న అటవిసంపదను కాపాడాలి. జాతర తర్వాత భక్తుల వదిలివెళ్లిన వ్యర్థాలను అతితొందరగా తీసివేయాలి. మేడారం చుట్టుపక్కల ప్రజలకు ప్రతినెల సూపర్ స్పెషాలిటీస్థాయి వైద్య క్యాంపులను ఏర్పాటు చేయాలి. మేడారం జాతర చరిత్రను పుస్తకాల్లో పెట్టాలి. ఆదివాసులకు జాతర నిర్ణయాల్లో పూర్తిభాగస్వామ్యం కల్పించాలి. అప్పుడే సమ్మక్క తల్లి కరుణించేది. సారళమ్మ తల్లి దీవించి రాష్ర్టాన్ని సుభిక్షంగా ఉంచుతుంది. అమ్మను నమ్ముకొని ఉంటున్న ఆదివాసులను ఆగాం చేస్తే సర్కారు పుట్టిమునగక తప్పదు.