నాన్నంటే నడిచే దైవం అన్నరు పెద్దలు. అమ్మ జన్మనిస్తే బాపు బతుకునిస్తడంటరు. తప్పటడుగులు వేసే బిడ్డని వేలుపట్టి లోకానికి పరిచయం చేస్తడు బాపు. బిడ్డలే లోకంగా..వాళ్ళ బతుకును తీర్చిదిద్దడమే జీవితంగా బతికే ఫాదర్స్ కు స్పెషల్ డే ఈ రోజు .. అదే గురూ ఈ రోజు ఫాదర్స్ డే..
అమ్మ అప్యాయయత అయితే దానికి ఆకారం నాన్న. అమ్మ అమృతమైతే … దాన్ని నింపుకున్న కలశం నాన్న. అమ్మ వెలిగే దీపమైతే … దాన్ని వెలిగించే వత్తిలాంటి వాడు నాన్న. ఓక్క మాటలో చెప్పాలంటే నాన్న ఓ త్యాగాల గుర్తు.. వేలకట్టలేని మమకారానికి నిలువెత్తు రూపు.
నాన్న కోరికలను తీర్చే గాడ్.. బతుకును గాడిలో పెట్టే గైడ్..ఆదర్శంగా నిలిచే రోల్ మోడల్.. పిల్లలు భాధల్లో ఉంటే ఫ్రెండ్. గారాల పట్టీలకు ఆయనే ట్రెండ్. మొత్తంగా చెప్పాలంటే.. నాన్న ఒక అద్భుతం..అమ్మ ప్రేమ కంటి ముందుదైతే నాన్న ప్రేమ గుండెలోనిది. అమ్మంటే .. మెరిసే మేఘం.. నాన్నంటే నీలాకాశం అన్నాడు ఆనాడు సినీ కవి.నాన్నకున్న ఇంపర్టెన్స్ అలాంటిది మరి..
ఇక ఇప్పటి జనరేషన్ లో నాన్న ని ఓ ఫ్రెండ్ ల ట్రీట్ చేస్తున్నరు పిల్లలు. ఒకప్పుడు నాన్న కనిపిస్తే కంగారుపడి మాట్లాడే పిల్లలు.. నేడు భుజంపై చెయ్యేసి మాట్లాడేంత చనువును పెంచుకున్నరు.ఇష్టా ఇష్టాలను ముందే నాన్నతో చేప్పేస్తున్రు. కెరీర్..లవ్ ..స్పోర్ట్స్..సినిమా..ఎంటర్ టైన్ మెంట్ ఎదైన సరే కూల్ గా డిస్కస్ చేస్తున్రు. నీట్ గా తమ ఫీలింగ్స్ ని ప్రెజెంట్ చేస్తున్రు. ఎంజాయ్ చేయాలంటే అమ్మకు చెప్పి గుట్టుగా బయటికి పరుగులు పెట్టే యూత్.. ఇప్పుడు ట్రెండ్ మార్చింది. నాన్నకు చెప్పె టెన్షన్ లెస్ గా ధూం-ధాం చేస్తున్రు.
ఇక నాన్న గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఆకాశమంతా మమకారానికి అనంతమంత గురుతు.భుజాలపై ఎత్తుకుంటే భుషీ పోసి డ్రెస్సంత తడిపినపుడు. కొత్త డ్రెస్ వేసుకొని పిల్లలు మురిసినపుడు. ఇల్లంత అంగడి చేస్తు చిందులేసినపుడు. గళ్ళీకి ఐస్ క్రీం బండోచ్చినపుడు.. అమ్మతో మారం చేస్తున్నపుడు. ప్రొగ్రెస్ కార్డ్ తో నాన్న నేనే ఫస్ట్ అని అల్లారు ముద్దుగా చెప్పినప్పుడు పొంగి పోయి తనలో తానే ఆనందంతో ఊగిపోయో లోపలి మనిషి నాన్న..అంతేనా..
ఎక్కడ మంచి మనిషి కనిపిస్తే… ఎక్కడ సక్సెస్ ఫుల్ పర్సన్ ఎదురుపడితే అందులో తన బిడ్డను ఊహించుకొని మురిసిపోయి..మైమరిచిపోయో ఆశ జీవి నాన్న. ఎవ్వరు తన బిడ్డను ఒక్కమాట పొగిడిన ఉప్పొంగిపోయో బోలా మనిషి నాన్న.నాన్న గురించి చెప్పడానికి ఎమి లెవ్వంటాడో ఓ కవి.. ఎందుకంటే నాన్న గుండేల నిండ నిండిన భావోద్వేగం కదా.. అందుకే ఆయన గురించి చెప్పడానికి మాటలు రావంటాడు దటీజ్ ఫాదర్...
ఇక నాన్న గొప్పతనం తెలిసిన ప్రతి బిడ్డ ... నాన్న .. నా ఉన్నతి కోసం అనుక్షణం ఆరాటపడ్డావు, నా ఫ్యూచర్ ను తీర్చి దిద్దడానికి నీ అహర్నిశలు శ్రమించావు...నన్నోక పసిగుడ్డులా చూసినవ్.. నాకోసం నువ్ తీసుకొన్న శ్రద్ద , కురిపించిన ప్రేమకు ఎమిచ్చి రుణం తీసుకోవాలి నాన్న అంటు ఆరాటపడతాడు... కానీ సాధ్యం కాదు కదా.... అందుకే నీలాగా ఒక మంచి నాన్నగా ఉండడానికి ప్రయత్నిస్తాను నాన్న అనా సరిపుచ్చుకుంటాడు.
అందుకే నాన్న తీర్చుకోలేని రుణం..విడిచిపెట్టలేని ప్రాణం.
ఈ రోజు ఫాదర్స్ డే ..నాన్నలను దైవంగా పూజించే రోజు. అందుకే నాన్నను ప్రేమించే మీకు హ్యాప్పి ఫాదర్స్ డే.
జూన్ 19 ఫాదర్స్ డే సందర్భంగా ఈ వ్యాసం.
-శ్రీపాద రమణ
Maatru Devo bhava
రిప్లయితొలగించండిPitru Devo Bhava
Acharya Devo Bhava
Athidi Devo Bhava
Prathah Smaraneeyulu ....veelantha pratyaksha daivalu ani mana samskurti eppudo cheppindi neerpindi .........