పోస్ట్‌లు

నిజమైన నాయకులు ఎలా ఉంటారు ?

చిత్రం
వంద మంది శత్రువులతో నేను ఒంటరిగా పోరాడుతున్నాను అని అర్జునుడు శ్రీకృష్ణుడికి తన వ్యథను చెప్పుకున్నప్పుడు.. శ్రీకృష్ణుడు, అర్జునుడితో ఇలా అన్నాడు... "నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్" ధర్మం కోసం నిజాయితీగా పోరాడితే వందమందిని కూల్చే శక్తి నీకు విశ్వం నుంచి లభిస్తుంది అని చెప్పాడు. అదే పుతిన్ విషయంలో జరిగి ఉండవచ్చని నా భావన. లేదంటే, రష్యా - ఉక్రెయిన్ యుద్ధం ఫిబ్రవరి 24, 2022 ప్రారంభమైంది. అంటే అక్షరాలా 4 సంవత్సరాల, 1 నెల, 24 రోజులు. బహుషా చరిత్రలో జరిగిన సుదీర్ఘ యుద్ధాల్లో ఏదో ఒక స్థానంలో ఈ యుద్ధానికి కూడా చోటు లభించి ఉండవచ్చు. అయినప్పటికి పుతిన్ ఎవ్వరి సహాయం అడగడం లేదు, ఎవ్వరిని నిందించడం లేదు, ఎవ్వరిపై నిందలు మోపలేదు. యూరప్, అమెరికా వంటి శక్తివంతమైన కూటములు, దేశాలు ఉక్రెయిన్ కు సహాయం చేస్తున్నప్పటికి ఎక్కడా చెక్కుచెదరలేదు. పైగా రష్యన్ ఆయిల్ కొనుగోలు చేసే దేశాలపై ఆంక్షలు విధించి అమెరికా చేసిన ఆర్ధిక విధ్వంసాన్ని కూడా చాలా ప్రొఫెషనల్ గా ఎదుర్కొంటున్నాడు పుతిన్. దాదాపు 4 లక్షల మంది సైనికులను కోల్పోయాడు, దాదాపు 300 బిలియన్ డాలర్లు తన సంపదను స్తంభింపచేసినప్పటికి ఎక్కడా వణకలేదు. ప్రపం...

17 సెప్టెంబర్ - తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రసంగ అంశాలు...

చిత్రం
17 సెప్టెంబర్ - తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రసంగ అంశాలు... • ఆనాటి పోరాటాన్ని కళ్లకు కట్టి : యావత్ తెలంగాణ ప్రజలకూ తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. 1948 వ సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ సువిశాల భారతదేశంలో అంతర్భాగంగా మారింది. రాచరిక పరిపాలన నుండి ప్రజాస్వామ్య దశలోకి పరివర్తన చెందింది. అందుకే ఈ సందర్భంగా జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నాం. ఇటీవలనే భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలను దేశంలో ఏ రాష్ట్రం నిర్వహించనంత ఘనంగా, ప్రతి హృదయంలో భారతీయతా భావన ఉప్పొంగేలా 15 రోజులపాటు అద్భుతంగా జరుపుకున్నాం. దానికి కొనసాగింపుగానే జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలనూ నిర్వహించుకుంటున్నాం. స్వతంత్రం రాకముందు భారతదేశ స్వరూపం భిన్నంగా ఉండేది. కొంతభాగం బ్రిటిష్ వారు నేరుగా పరిపాలించే బ్రిటిష్ ఇండియాగా ఉంటే.. మిగతా భాగం సంస్థానాధీశుల పాలనలో ఉండేది. కొన్ని ప్రాంతాలు ఫ్రెంచ్, పోర్చుగీస్ వారి వలస పాలనలో ఉండేవి. ప్రపంచంలో ఏ దేశమైనా పరిణామ క్రమంలో సమగ్ర స్వరూపాన్ని సంతరించుకుంది. మన భారతదేశం కూడా అంత...

రిటైర్ ఉద్యోగుల్లో కొత్త ఆశలు నింపుతున్న టీ-సర్కారు

పదవీ విరమణ చేసిన ఉద్యోగుల బాగోగుల గురించి పట్టించుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం తర్వాతే ఎవరైన అన్నట్టు ఉంటుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా రిటైరైన రోజున సన్మానంతో పాటు అన్ని చెల్లింపులు, గౌరవంగా ప్రభుత్వ వాహనంలో ఉద్యోగిని తన ఇంటి వద్ద దింపేసే ఏర్పాట్లు చేయాలని కసరత్తులు చేస్తున్న సర్కారు, ఇంతకు ముందే రిటైర్ అయిన ఉద్యోగుల సమస్యలపై దృష్టి సారించింది. వారు నిత్యం మీసేవా కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఇంట్లో కూర్చుని సర్కారు తెస్తున్న టీయాప్ లో ఒక ఫోటో దిగి వివరాలు సమర్పిస్తే సరిపోతుంది. ఇక ఆ ఉద్యోగికి ప్రతి నెల బ్యాంకు అకౌంట్లో ఫించను జమ అవుతుంది. ఇప్పటి వరకు ఈ విధానం చైనాలో అమల్లో ఉంది. అయితే ఇక్కడి అవసరాలకు అనుగుణంగా మార్పులు, చేర్పులు చేసి రేపో మాపో అందుబాటులోకి తీసుకురాబోతుంది. ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇంతకన్నా నిదర్శనం ఏం ఉంటుంది. ఆల్ ది బెస్ట్ టీ-సర్కార్

సరికొత్తగా డ్రైవింగ్ లైసెన్స్

చిత్రం
తెలంగాణ ప్రభుత్వం ఆర్టీఏల్లో అవినీతిని అంతం చేసేందుకు పూనుకుంది. డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలంటే సామాన్యులు జడుసుకునేలా చేస్తున్న బ్రోకర్ల చేతివాటానికి కళ్లెం వేయాలని డిసైడ్ అయ్యింది. అందులో భాగంగానే భారీగా సంస్కరణలకు పూనుకుంది. ఆర్టీఏ ఆఫీసుకు వెళ్లకుండానే తతంగాన్ని పూర్తిచేసే సరికొత్తి సెల్ఫీ సిస్టానికి సిద్ధమైంది. లైసెన్స్ తీసుకోవాలంటే రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లి ఫోటో దిగాల్సిన పద్దతికి స్వస్తిపలికింది. టీయాప్ పోలియో యాప్ తో స్వీయ చిత్రంతో దరఖాస్తును పూరించే పద్ధతికి శ్రీకారం చుట్టుంది. ఈ పద్దతి పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నరు. అయితే మరికొందరు మాత్రం ఆర్టీఏ జలగలు సరికొత్త మార్గాలు వెతుకుతరని పెదవి విరుస్తున్నరు.

త్రిపుల్ తలాక్ బిల్లుకు ఓకే చెప్పిన రాజ్యసభ

చిత్రం
త్రిపుల్ తలాక్ బిల్లుకు ఓకే చెప్పిన రాజ్యసభ ముస్లీం కుటుంబాల్లోని అమ్మాయిలకు రక్షణ కల్పించేందుకు మోదీ ప్రభుత్వం గత కొన్నేళ్లుగా చేస్తున్న ప్రయత్నాలకు ఫలితం దక్కింది. 2017 లోనే సుప్రీం కొోర్ట్ త్రిపుల్ తలాక్ రాజ్యంగవిరుద్ధమని స్పష్టం చేసినా.. చట్టబద్దం చేయడంలో మన రాజకీయ వ్యవస్థ తన దౌర్భలత్వాన్ని చాటుకున్నది. సమాజానికి మంచి జరుగుతుందని తెలిసిన ఓటు బ్యాంకు రాజకీయాల కోసం పార్టీలన్నీ జట్లుగా విడిపోయి వికృత రాజకీయాలు చేసాయి. ప్రభుత్వం సైతం ప్రతిపక్షాల ఆరోపణలను, ఆక్షేపణలను, ఆలోచనలను విని చిన్న చిన్న సమస్యలను సరిదిద్దే ప్రయత్నం చేస్తే బావుండేది. కానీ అలా జరగకపోవడం వల్ల సమస్య ఇంత దూరం వచ్చింది. అంతేకాదు లోక్ సభలో ఆమోదం పొందిన బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందడం కోొసం దాదాపు ఆరునెలలకు పైగా సమయం తీసుకుంది. కానీ ఎట్టకేలకు 99 మంది ఆమోదం 84 మంది సభ్యుల వ్యతిరేఖత నడుమ మూజువాణి ఓటుతో త్రిపుల్ తలాక్ బిల్లు చట్టరూపం దాల్చింది. ఈ బిల్లు ఆమోదం పొందడమే ఆలస్యమే ముస్లీం మహిళలు ఆనందం వ్యక్తం చేశారు. స్వీట్లు పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు.
తెలంగాణ ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుంది ? టీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ ఇతరులు   pollcode.com free polls

పీ.వీ కి ఘన నివాళులర్పించిన కేసిఆర్, ప్రధాని

చిత్రం
                    పీ.వీ కి ఘన నివాళులర్పించిన కేసిఆర్, ప్రధాని           ఎన్నికలు సమీపిష్తున్న వేళ.. భారత మాజీ ప్రధాని #పీవీ నరసింహారావు జయంతి ప్రాధాన్యతను సంతరించుకుంది. సోనియా, రాహులు ఇద్దరు పీవీకి కంటితుడుపుగా జయంతి నివాళులర్పిస్తే.. ప్రధాని మాత్రం ట్విట్టర్ ద్వారా పీవీని పొగడ్తలతో ముంచేశారు. పీవీ దేశానికి దిశా నిర్ధేశం చేశాడని, ఈ రోజు దేశ ఎదుగుదలకు పీవీ సంస్కరణలే కారమని, పీవీ లాంటి గొప్ప రాజనీతజ్ఞుడు దేశానికి గర్వకారణమని కీర్తించాడు. దీంతో పీవీ అభిమానులంతా.. మోదీనీ పొగడ్తలతో ముంచేస్తున్నరు.              ఇకపోతే  తెలంగాణ లో కూడా కాంగ్రెస్ పార్టీ పీవీని నిర్లక్ష్యం చేసింది. పీవీకి కనీస మర్యాద ఇవ్వకుండా అవమానిస్తే.. ముఖ్యమంత్రి మాత్రం పీ.వీ.కి ఘన నివాళులర్పించారు.