తెలుగు మహాసభల్లో తెలంగాణ వైతాళికులకు సరైన గుర్తింపు వచ్చేలా ఏర్పాట్లు సాగాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి, అసెంబ్లీలో వైద్యశాఖపై జోరుగా సాగుతున్న ప్రశ్నోత్తరాల సమయం, /

22 జూన్, 2011

జయశంకర్


జయశంకర్ సార్... నీకు జోహర్.

ఆ గొంతుది 60 యేండ్ల తండ్లాట..

విరామం లేని ఉద్యమ ఆలోచనల పాకులాట.

ఏ చెయ్యి తెలంగాణ జెండా పట్టుకుంటదా..

అని ఎదురుచూపు.

ఏ పిడికిలి చెయ్యెత్తి తెలంగాణకు జై కొడతాదా..

అనే ఆరాటం.

పుట్టినకాడికెళ్ళి ... పాణం ఇడిచేదాకా..

తెలంగాణ సాధనే గమ్యంగా..

తెలంగాణ సాధనే లక్ష్యంగా..

జీవితాన్ని అంకితం చేసిన

త్యాగమూర్తి.

ప్రాణం పోయేంత వరకు ..

నమ్మిన సిద్దాంతం కోసం

పోరాడిన వీరుడు..

ఊపిరి ఉన్నంత వరకు..

విలువలతో బతికిన బుద్దిజీవి.

తన పేరులో ఉన్న జయాన్ని..

తన జీవితానికి అంకితం చేసుకున్న

విజేత.

నిబద్దతకు నిలువు గుర్తుగా..

నిజాయితీకి నిలువెత్తు రూపుగా..

మాటకు కట్టుబడ్డ మహామనిషిగా..

మానవత్వాన్ని రాజకీయాలకు ..

జోడించిన మహనుభావుడిగా.

సారును మరిచిపోవడం ఎట్లా .

ఆయన మన కోసం..

మన ఆకాంక్షల కోసం..

మనం వేదనపడుతున్న సమస్య కోసం..

మనం కాలిబూడిదయ్యేందుకు కూడ..

వెనుకాడని ఆశ కోసం.

తను ప్రాణం విడిచేంతవరకు ..

పోరాడిన నిజమైన

ప్రజల మనిషి..

సార్.. గురించి ఎన్నైన చెప్పొచ్చు...

సార్ గురించి... చెప్పడమంటే..

విశ్వం గురించి వివరించడం లాంటిదే..

అందుకే..

ఆయనకు నివాళిగా ..

నిండు మనస్సుతో తెలంగాణ కోసం ..

పోరాడుదాం..

తెలంగాణను సాధిద్దాం.

అప్పుడే ఆ మహానుభావుడికి..

నిజమైన ఆత్మశాంతి.

మీ శ్రీపాద రమణ.

గమనిక.. తెలంగాణలో ప్రతి ఊరిలో సారు విగ్రహాలను ఏర్పాటు చేసేలా ప్రజలను చైతన్యవంతులను చేయాలి.. అది మన భాధ్యత.

1 కామెంట్‌:

  1. gud .. entha manchi manishi... ayana gurinchi nijnga em chesina thappuledu.. elanti manchi manishi gurinchi.. chala chakkaga vivarincharu.. anduku meeku danyavaadalu..hemalatha.hyd.

    రిప్లయితొలగించండి