ఈ బ్రతుకులకి కారకులెవరు ...?
చావుకు అంగుళం దూరం ..
బ్రతుక్కు కనుచుపుమేరలో లేని తీరం..
నరకంతో నడుస్తున్న స్నేహం ..
సంతోషానికి కనరాని దైన్యం ....
అడుగడుగునా కష్టాల మడుగు..
బ్రతుకంతా బయటికెళ్ళ లేని
భయంకర బుడుగు..
దాహం తీర్చే జలమే హాలాహలమై ...
ప్రాణం నిలిపే గంగావతారమే గరలమై...
బ్రతుకులను చీలుస్తూ...
ఆశల్ని కులుస్తూ...
ప్రాణాల్ని రాలుస్తూ ...
ఇంటింటి ఆశల దీపాల్ని ఆర్పుతూ ...
చుక్క చుక్క రక్కసి అయీ విద్వాంస -
విన్యాసం చేస్తున్న ఫ్లోరైడ్ భూతానికి
నల్లగొండ ప్రజలు బలికావాల్సిందేనా...?
యీది ప్రకృతి ప్రసాదించిన గ్రహచారమా...?
ఓటేసి ప్రబుత్వాల్ని ఎన్నుకున్నందుకు పాపపరిహరమా..?
విముక్తి ఎప్పుడు -బ్రతుకులు విరబుసేదేప్పుడు..?
నరకం తప్పేదేప్పుడు -నవ్వులు విరబుసేదేప్పుడు...?
చావురాత మారేదెప్పుడు - జీవితాలు నిలిచేదెప్పుడు..?
విలువలు లేని మరమనుషుల పాలనా ముగిసి ..
మానవత్వం నిండిన రాజ్యం ఏర్పడలిని ఆశిస్తూ ....
నల్లగొండ చిరునవ్వుల కొండగా మారాలని ఆకాంక్షిద్దాం ...
మీ .
శ్రీపాద రమణ .
చాలా చాలా బాగుంది.
రిప్లయితొలగించండి