తెలుగు మహాసభల్లో తెలంగాణ వైతాళికులకు సరైన గుర్తింపు వచ్చేలా ఏర్పాట్లు సాగాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి, అసెంబ్లీలో వైద్యశాఖపై జోరుగా సాగుతున్న ప్రశ్నోత్తరాల సమయం, /

14 జులై, 2011

ముంబాయి.


ముష్కరులకు మనసుండదు..

మనసున్న అది స్పందించదు..

తనకు తాను అర్థం తేలియనోడు..

తన హింస ద్వారా జాతి ఆధిపత్యాన్ని

చాటాలనుకనే వాళ్లు..

పిచ్చి పట్టిన సిద్దాంతాలను..

బాంబులతో రాద్దంతం చేసి..

రక్తం ఏరులై పారించి

మాంసం ముద్దల చెల్లాచెదురు చేసి..

రక్షసులకు..

తమకు ఏ తేడా లేదని నిరూపిస్తారు.

అదే పవిత్రమని ప్రగల్భాలు

పలుకుతారు..

పవిత్రమంటే

పరమ కిరాతకమా..?

పవిత్రయుద్ధం అంటే

అణ్యం పుణ్యం ఎరుగని జనాన్ని

దారుణంగా చంపడమా..?

ఛీ.

స్కూల్ కి వెళ్లి అల్లారుముద్దుగా ఆడుకోవల్సిన

ఓ పసిపాప..

శవలా గట్టలో శిథిలమై ఎందుకుండాలి..?

తెల్లవారితే తన ఫ్రెండ్స్ తో బర్త్ డే చేసుకునే..

ఓ యువకుడు..

అచేతనుడై ఎందుకు పడిపోవాలి..?

తన కుటుంబం కోసం

రేయింబవళ్లు పనిచేసి ఇంటికి వెళుతున్న..

ఓ పెద్దయాన శవమై ఎందుకు మిగలాలి..?

ఆ కుటుంబానికి అండగా ఏవరుండాలి..?

గుండెల్ని పిండెస్తున్న దారుణాలు

కుటుంబాల్ని చీల్చుతున్న ఘోరాలు..

ఇంకా ఎన్ని జరగాలి..

ఆ రాక్షసులు రక్త పిపాస ఎప్పుడు తీరాలి..

అట్లాంటి అల్లరి మూకలను

హీరోలుగా చిత్రంచే ఓ నీచపు సమాజమా..

ఓ దుర్మర్గాపు పాపాల భైరవులారా

మీ మనసుల్ని మార్చుకొండి..

ఇప్పుడు

మీరు చేస్తున్న ..

ఈ మారణహోమంలో

మీరు అచేతనంగా మిగిలిపోక తప్పుద..

హాహాకారాల నడుమ సహాయం

అర్ధించక తప్పదు..

మారండి..

మానసున్న మనుషులుగా..

మిగలండి..

మానవత్వం పంచే మహాత్ములుగా..

ఇది..

మనసున్న భారతీయులు ఆహ్వానం..

బాంబులు..

బ్లాస్టులను..

గుండే నిబ్బరంతో..

నిండు మనసుతో ఎదుర్కోని..

భారీయులంతా ఓక్కటని చాటిన ..

మీ అందరికి..

పేరు పేరున..

ధన్యవాదాలు..

మీ శ్రీపాద రమణ.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి