తెలుగు మహాసభల్లో తెలంగాణ వైతాళికులకు సరైన గుర్తింపు వచ్చేలా ఏర్పాట్లు సాగాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి, అసెంబ్లీలో వైద్యశాఖపై జోరుగా సాగుతున్న ప్రశ్నోత్తరాల సమయం, /

01 ఆగస్టు, 2011

కథ


అందరు బిచ్చగాళ్లే ......

ఓ సామ్రాజ్యంలో చక్రవర్తిగారి ఆస్థానంలోకి ఓ బిచ్చగాడు ప్రవేశిస్తాడు.. రాజుతో ఓ మాట చెప్పాలని విన్నవిస్తాడు..

బిచ్చగాడి వినతిని మన్నించిన మహరాజు..ఎంటని ప్రశ్నిస్తాడు మహారాజు..? రాజా.. అందరు బిచ్చగాళ్లే కానీ కొందరు అది గుర్తించడం లేదు అని విన్నవిస్తాడు.. మీరైన గుర్తించాలి అని చెప్తాడు.. ఒక్కడుగు ముందుకేసిన బిచ్చగాడు.. మీరుకూడ బిచ్చగాళ్లే కదా మహారాజా అని సెలవిస్తాడు..

ఏదో ఆపద ఉందని మాట్లడమని అవకాశం ఇస్తే నన్నె బిచ్చగాడని సంభోదిస్తావా.. అంటూ కోపోద్రిక్తుడైన చక్రవర్తి... వీడిని తీసుకెళ్లి చెరసాలలో బంధించండిరా అంటాడు... పక్కనున్న తెనాలి రామకృష్ణుడు ఫక్కున నవ్వుతు నిజం మాట్లాడితే మంచి శిక్ష వేశారు రాజుగారు అంటు పక్కనున్న ఆస్థాన కవితో చెమక్కులు విసురుతాడు.. ఆ మాట వెళ్లి చక్రవర్తిగారి చెవిని చేరుతుంది. రామకృష్ణులుగారు ఇందాక మా గురించి ఏదో అన్నరట కాదా అని ప్రశ్నిస్తాడు రామకృష్ణున్ని...

చక్రవర్తిగారు.. మీ గురించి నేను మాట్లడ్డమా.. అది తప్పుగా మాట్లడ్డమా.. మీ సోమ్ములు తింటు.. మీ నీడన బతుకుతు.. మీ ఆస్థాన కవిగా గౌరవం పొందుతూ మీమ్మల్ని ఎదురించి మాట్లడ్డమా.. అది అసత్యం చక్రవర్తిగారు అంటూ.. వెటకారంతో కూడిన స్వామిభక్తిని ప్రాదర్శిస్తాడు..

దీనికి కోపగించిన చక్రవర్తి.. మేము అబద్దమాడుతున్నామని మీరు మమ్మల్ని అనుమానిస్తున్నారా... అంటు చక్రవర్తి ఎదురు ప్రశ్నిస్తాడు? నాకు పూర్తి సమాచారం వచ్చింది కనుకే నిన్ను పిలిచి అడుగుతున్నాను.. చెప్పండి ఆ బిచ్చగాడిని చెరసాలలో బంధించడం తప్పా.. నన్ను బిచ్చగాడు అంటాడా.. లక్షలాది మందికి నా ధన్యాగారం నుండి ధనధర్మాలు చేసాను.. నా రాజ్యమంతా కరువుకాటకాలు వస్తే నా సొంత సోమ్మును ధనం చేసి ప్రజలను ఆదుకున్నాను నన్ను బిచ్చగాడు అంటుంటే..నా జీతం తీసుకుంటున్న మీరు... నా కీర్తికి భంగకలిగేలా నా ప్రభకు అవమానం కలిగేలా.. నిజం చెప్తే శిక్ష వేశడని ఇకిలింతలు ..సకిలింతలు చేస్తావా అంటూ కోపంతో తెనాలిని ప్రశ్నిస్తాడు రాజు..?

తదేకంగా రాజును చూసిన రామకృష్ణుడు.. ఆ బిచ్చగాడు చెప్పింది నిజమే కాదా మహారాజా అంటాడు..

పక్కనున్న ఆస్థాన కవులు.. సైన్యాధికారులు.. కోపంతో తెనాలిని వారిస్తారు.. కానీ తెనాలి రామకృష్ణుడు మాత్రం గాంభిర్యంగా..

మహారాజా మీరు ముమ్మాటికి బిచ్చగాళ్లే అంటాడు..

కోపోద్రిక్తుడైన మహారాజు ఒక్కసారి ఆగి ఏలాగా రామకృష్ణులవారు అంటు ప్రశ్నిస్తారు..

అప్పుడు రామకృష్ణులు .. అయ్యా మీరు పొద్దున లేస్తే శివుని పూజా చేస్తారు.. శివున్ని ఏం అడుగుతారు అని ప్రశ్నిస్తాడు ..

చక్రవర్తి..

నా రాజ్యం సుఖంగా ఉండాలి..నా కుటుంబం చల్లగా చూడాలి..కరువుకాటకాలు రాకుండా చూడాలి అని కోరుకుంటాను అని చక్రవర్తి చెప్పాడు.

చూసారా మహారాజా.. మీరు కూడ దేవున్ని అడుకుంటున్నారు కదా మహారాజా..

ఆ బిచ్చగాడు.. మనుషులను అడుకుంటాడు.. మీరు దేవున్ని అడుక్కుంటున్నారు అంతే అందరు బిచ్చగాళ్లే మీరు పెద్ద బిచ్చగాళ్లు .. ఆయన కడుపు కోసం ఆడుక్కునే చిన్నబిచ్చగాడు.. అంతే తేడా అంటు అందరు బిచ్చగాళ్లేనని వివరిస్తాడు..

రాజు కూడ ఇది నిజమేనని నమ్మి ఆ బిచ్చగాడికి చెరసాల నుంచి విముక్తి కల్పిస్తాడు..

ఈ కథ ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే పుదుచ్చేరిలో రీసెంట్ గా ఒక ఇన్సిడెంట్ జరిగింది. పుదుచ్చేరిలో ప్రముఖ తిరునళ్ళార్‌ శనీశ్వర భగవాన్‌ దేశాలయాకి సమీపంలోని వాణిజ్య సముదాయా నికి సంబంధించి వేలం పాట కార్యక్రమం శుక్రవారం పుదుచ్చేరిలోని తిరునళ్ళార్‌ పంచాయితీ కార్యాలయంలో జరుగుతున్న సమయంలో అరుదైన సంఘటన చోటుచేసుకుంది. వేలం పాట కార్యక్రమంలో పాల్గొన టానికి అక్కడ వుండే ముగ్గురు యాచకులు ప్రవేశించడంతో మిగతా బిడ్డర్లు ఆశ్చర్యానికి గురైయ్యారు. ఈ దేవాలయ వాణిజ్య సముదాయం, రాత్రి పూట తలదాసుకునే కేంద్రాల్లోనే ఈ ముగ్గురు యాచకులు గత దశాబ్దం నుంచి వుంటూ భక్తుల నుంచి ఆహారం, నగదును యాచిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ దేవాలయ ఆవరణ యాచకులకు ఎంతగానో ఉపయోగపడుతోంది. అయితే ఒక్కసారిగా ముగ్గురు యాచకులు తాము ఆహరం యాచించే పాత్రలు, సంచులతో పంచాయితీ కార్యాలయంలోకి ప్రవేశించారు. దాంతో అక్కడ వున్న ప్రతి ఒక్కరు ఆశ్చర్యానికి గురైయ్యారు. ఈ నేపథ్యంలో తమతో పాటు ఈ వేలం పాటకు యాచకులను అనుమతిస్తే తాము ఇక్కడ వుండబోమని మిగతా వారు అభ్యంత్రం వ్యక్తం చేశారు. అయితే తాము కూడా భారతీయులమేనని, ప్రతి ఒక్క పౌరుడికి బిడ్డింగ్‌లో పాల్గొనే హక్కు వుందని యాచకులు వాదించారు. ఈ వేలం పాటలో పాల్గొన్నాలంటే పది వేల రూపాయలు డిపాజిట్‌ చెల్లించాలని అధికారులు వారికి సూచించారు. అధికారుల సూచనలతో యాచకులు వెంటనే వారి సంచుల్లో వున్న నోట్ల కట్టలను తీసి డిపాజిట్‌గా చెల్లించారు.అనంతరం వారికి సంబంధించిన గుర్తింపు పత్రాలను చూపవలసిందిగా కమిషనర్‌ కోరారు. కానీ ఎటువంటి గుర్తింపు కార్డులు వారి వద్ద లేకపోవడంతో బిక్క మొహం పెట్టారు. గుర్తింపు పత్రాలు లేనదే వేలం పాటలో పాల్గొనే ఆర్హత లేదని కమిషనర్‌ తేల్చిచెప్పాడు. యాచకుల ఆశలకు విరుద్ధంగా జరగడంతో ఈ ప్రక్రియ పూర్తి అయిన తరువాత డిపాజిట్‌ తీసుకొని వెళ్ళతామని ముగ్గురు అక్కడే వుండటానికి పట్టుబట్టారు. అయితే వేలం పాట కార్యాక్రమానికి విఘాతం జరుగుతుందని భావించిన కమిషనర్‌ కొంత మంది వ్యక్తులతో యాచకులను బయటకు పంపించి వేశారు. కానీ కొంత మంది బెగ్గర్స్‌ బిడ్డర్స్‌గా మారడంతో ఈ వార్త సంచలనం కలిగించింది.

చూసారా..

అందరు వారిని బెగ్గర్స్ అంటున్నారు కానీ మనం కూడ బెగ్గర్స్ అని ఎవరు ఆలోచించడంలేదు. అందుకే వాళ్లు బెగ్గర్స్ నుంచి బిడ్డర్స్ గా మారుతున్నరు. మనలాంటి సమాజం వారిని అవమానించకూడదు.. యాచించడం మాని సమాజంలో కలుస్తాం అని చెప్పినప్పుడు వారి జీవితంలో వారు కోరుకున్న మార్పుకు సహకరించవలసింది మనసున్న సమాజమంతా అందరిని నాగరికులుగా మారాలంటే ముందు నాగరికులు ఆనగారికమైన ఆలోచననుంచి నాగరికమైన ఆలోచనలతో ముందుకు సాగాలి..

దటీజ్ మ్యాటర్.....శ్రీపాద రమణ.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి