తెలుగు మహాసభల్లో తెలంగాణ వైతాళికులకు సరైన గుర్తింపు వచ్చేలా ఏర్పాట్లు సాగాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి, అసెంబ్లీలో వైద్యశాఖపై జోరుగా సాగుతున్న ప్రశ్నోత్తరాల సమయం, /

14 ఆగస్టు, 2011


స్వాతంత్ర్యామా...నీకు సలాం.

అహింసాయుత మార్గంలో పోరాడి దేశానికి స్వేచ్ఛా వాయులను పీల్చుకున్న దేశం భారతదేశం. అయితే కొన్ని అసాంఘిక శక్తులు ఈ స్వేచ్ఛా వాతావరణంలో భయోత్పాతాలను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ముంబాయి, హైదరాబాద్, బెంగుళూరు, అహ్మదాబాదు వరుస పేలుళ్లతో ప్రజలను భయబ్రంతులకు గురిచేస్తున్నారు. దేశంలో ఏక్కడో చోట పేళుల్లు జరుగుతూనే ఉన్నాయి.. అమాయకులు బలైపోతునే ఉన్నారు. పేరుకే స్వేచ్చయుతమైన దేశమైన ఎప్పుడు మనకు గుండే నిండా స్వేచ్చ లేదు. ప్రతి క్షణం, ప్రతి పౌరుడు అప్రమత్తంగా వ్యవహరించాల్సిన పరిస్థితి నేడు నెలకొన్నట్లుంది. స్వేచ్ఛా భారతంలో స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలను అత్యంత కట్టుదిట్టమైన భద్రతా చర్యల మధ్య జరుపుకోవాల్సిన దుస్థితి.
దేశం శాంతియుత వాతావరణంతోనూ, ధనధాన్యాలతో, సుఖసంతోషాలతో వర్థిల్లాలనీ ఈ 65వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా కోరుకుందాం.

తెల్లదొరల పాలనకు విముక్తి పలికిన కాలం..

సత్యగ్రహాలతో సత్యం గెలిచిన క్షణం..

వందల యేండ్ల బానిసత్వానికి విముక్తి కలిగిన తరణం.

మూడు రంగుల జెండా రెపరెపలాడిన సంధర్భం..

యావత్ దేశం మొత్తం సంబరాల్లో మునిగిన ఆనందలనిలయం..

స్వేచ్ఛవాయువులతో తేలియాడిన దేశం..

ఆగష్టు 15..

మీ అందరికి 65 వ స్వాతంత్ర్య దినోత్సవ శుభకాంక్షలు.

శ్రీపాద రమణ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి