తెలుగు మహాసభల్లో తెలంగాణ వైతాళికులకు సరైన గుర్తింపు వచ్చేలా ఏర్పాట్లు సాగాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి, అసెంబ్లీలో వైద్యశాఖపై జోరుగా సాగుతున్న ప్రశ్నోత్తరాల సమయం, /

24 ఆగస్టు, 2011

నిజాం అరాచకాలకు నిదర్శనం


నిజాం అరాచకాలకు అంతం పలికిన అద్వితీయ పోరు..

కత్తులు దూసిన కత్తులను తుత్తునియలు చేసిన్రు...

అరాచకాలను ఎదురొడ్డిన లోల్లి చేసిన్రు....

అణచివేతలపై భల్లున ఎగసిన్రు..

సిస్తుల జివోలను చిత్తుచేసిన్రు..

గుర్రపు డెక్కలతో నిజాం చేసిన కరతాల నృత్యాలను ఖతం చేసిన్రు..

రాజకార్ల .... రాంరాం చేసిన్రు..

అరాచాకలను అంతం చేసిన్రు.

మా భూమి మాదని నినాదించిన్రు..

మా పంటను మేమే కోసుకుంటమని సవాల్ చేసిన్రు..

దాడులకు పూనుకున్న నిజాం సైన్యంపై...

నిప్పుల వాన కురించిన్రు..

తెలంగాణ సాయుధ పోరుతో నిజాం తోక ముడిపించిన్రు..

అది తెలంగాణ సాయుధ పోరాటం..

ఆ పోరే నేటి ఉద్యమానికి ఊపిరి..

ఆ పోరే నేటి త్యాగాలను పూనాది...

ఆ పోరే నేటీ ఉద్యమకారుల నిస్వార్థ పోరుకు.. వారధి.

అందుకే నాడు.. తెల్లోల్లు

నిన్న రాజకార్లు...

నేడు ఆంద్రోళ్లు..

దుర్మార్ఘుల చెరలో పడి బంధీ అయిన తెలంగాణ పుణ్యభూమిని కాపాడుకుందాం..

పోరు చేసి అమరులైన వీరులను కంటికి రెప్పాల కాపాడుకుందాం..

మన తెలంగాణను మనం సాధించుకుందాం.

ఆనాటి నిజాం అరాచకాలను ప్రత్యక్ష సాక్ష్యమే పైన మీరు చూస్తున్న ఫోటో...

4 కామెంట్‌లు:

  1. గా ఫొటోల అరాచకం యాడుందిరబై నాకు తెల్వకడుగుత?

    రిప్లయితొలగించండి
  2. గిదే మల్ల, మొదటి సంది గిదే తంతు. గా కోడిగుడ్డుకి ఈకలు పీకినట్ల, ఏం లేనిదాన్లోంచి లెనిపోనివి ఊడబీకి మనకేదో అన్యాయం జరిగిపోయిందని చెప్తాన్రు. గసలైన దొంగల గురించి, ఇక్కడి మన డబ్బులు మింగేసే రాజకీయ నాయకుల గురించి, గీ బద్మాష్ ప్రొఫెసర్ల గురించీ ఒక్క ముక్క మాట్లాడరు. ఒక పక్క, వీల్లు మన జేబులు కొట్టేస్తానే, దూరపోడిని చూపించి వాడే దొంగ అంటాన్రు. మనల్ని ఢేడ్ దిమాక్ గాన్లని చేస్తాన్రు. గా నిజాం తర్వాత, మన శత్రువులు గా ఆంధ్రోల్లు కాదు. గిప్పుడు మన శత్రువులు మన రాజకీయ నాయకులే.

    రిప్లయితొలగించండి
  3. అరాచకమంటే కత్తులతోటి పొడిచినట్టు ఉండాలకావచ్చురాబై తమ్మునికి.. మనసు పెట్టి చూస్తే అన్ని కనిపిస్తాయి.. మీద మీద చూస్తే ఎం కనిపిస్తది. ఖాళీ నిజాం ఫోటో కనిపిస్తే చాలు అరాచకం ఎదురుగున్నట్టు ఉంటది. రజాకార్లతోటి ఫైట్ చేసిన మాలాంటోళ్లకు తెలుసు నిజాం ఏందో వాడి వాకాలత్ దారుల దుర్మార్గలేందో.. పసికూనలు మీకేం తెలుసురబై.. ఏదో నోటికచ్చినట్టు మాట్లడతరు. తమ్ముడు కరెక్టే రాసిండు. తమ్ముడు తన భావాలను రాసిండు తప్పెట్లైతది. మంచిని మంచి అనండి.. లేదంటే నోరుమూసుకొని కూర్చోండి .. నిజాంను హీరో అనేవాడు రక్షసునికి తమ్ముడులాంటోడని గుర్తుకు తెచ్చుకోండి. కాలువ మల్లయ్య కరీంనగర్ జిల్లా మల్యాల

    రిప్లయితొలగించండి