నిజం తెలిసింది.
( అమ్మ బాబోయ్ ఇంత దొంగ సొమ్మా..?)
సామాన్య ప్రజల సొమ్ములు మింగి స్విస్ లో దాచుకున్న నల్లకుబేరుల బాగోతం సీబీఐ బట్టబయలు చేసింది. దేశం యావత్తుకు కళ్లు బైర్లు కమ్మే నిప్పులాంటి నిజాలను వెల్లడించింది. భారతీయ నల్లధన దొంగలు 25 లక్షల కోట్లకు పైగా దొంగసొత్తునను విదేశాల్లో దాచుకున్నరని .. సీబీఐ డైరెక్టర్ ఏ.పి సింగ్ చెప్పారు. స్విస్ లో మూలుగుతున్న నోట్ల కట్టలన్నీ భారతీయుల బడా బాబులవేనని ఆయన తేల్చి చెప్పారు. మారిషస్, స్విట్జర్లాండ్ బ్యాంకులు నల్లధనం దాచుకోవటానికి సురక్షితమైనవిగా భారతీయులు భావిస్తున్నరని ఆయన తెలిపారు. అంతేకాదు దేశంలో 55 శాతం మంది మహానుభావులు అవినీతి పరులేనని సింగ్ జీ స్పష్టం చేశారు. ఇంత పెద్ద నిజం తెలిసినా.. ఆ నల్లధనాన్ని తిరిగి తెప్పించడం ఆషామాషీ వ్యవహారం కాకపోవటంతో ఇది కేవలం మీడియా వార్తగానే మిగిలిపోతుందంటున్నరు అవినీతిపై యుద్ధం చేస్తున్న ఉద్యమకారులు. దేశాన్ని పాలించే పాలకులకు చిత్తశుద్ధి ఉంటే ఆయా దేశాలకు చట్టపరంగా విజ్ఙప్తి చేసి.. దొంగ సొత్తును తెప్పించటం పెద్ద పనేకాదంటున్నరు కొందరు విశ్లేషకులు. సర్కారుకు చిత్తశుద్ధి లేదు కాబట్టి ఇది ముమ్మాటికి మీడియా వార్తేనంటున్నరు.
PRAJALA sommulni dochuku thintunnara.......... daongalu
రిప్లయితొలగించండి