తెలుగు మహాసభల్లో తెలంగాణ వైతాళికులకు సరైన గుర్తింపు వచ్చేలా ఏర్పాట్లు సాగాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి, అసెంబ్లీలో వైద్యశాఖపై జోరుగా సాగుతున్న ప్రశ్నోత్తరాల సమయం, /

14 ఫిబ్రవరి, 2012

ఆదివాసులంటే అంత అలుసా..?


ఆదివాసులంటే అంత అలుసా..?






      మేడారం జాతరపై సర్కారుకు ఏం హక్కుంది? అసలు సమ్మక్క-సారలమ్మ జాతరకు ప్రభుత్వం ఏం చేసిందని? ఇంకా ఎన్నాళ్లు ఆదివాసులు పాలకుల పాదల కింద నలిగిపోవాలి? వంద కోట్ల బడ్జెట్ కేటాయిస్తే అన్ని హక్కులు పొడుచుకు వస్తాయా? అధికారం ఉంది కదా అని అన్నిట్ని గుప్పిట్లో పెట్టుకోవడం సమంజసమేనా? మేడారం జాతరకు సర్కారుకు సంబంధం ఎక్కడిది? సర్కారు సహాయం కావాలని ఆదివాసులు పాలకులను ఏనాడైనా అడిగారా? మాకు ఆదాయం కావాలని ఎవరితోనైనా చర్చలు జరిపారా? మరి ఎందుకు సర్కారు పెత్తనం చేస్తుంది. ఎందుకు మేడారం జాతర పూజారులను అడుక్కునే వారిగా మిగిల్చుతుంది? హుండీ ఆదాయం కోసం ఎందుకు దేబికరించే స్థితికి దిగజార్చింది? షాపుల టెండర్ల ద్వారా వచ్చిన కోట్లాది రూపాయలను ఏం చేస్తున్నారు? ఎందుకు ఆదివాసీ ఆత్మబంధులు ఇలవేల్పు గద్దెలపై పోలీసు బూట్లను ప్రవేశపెడుతుంది? ఎందుకు ఆదివాసీల గుండెలపై తుపాకులను ఎక్కుపెడుతుంది? ఎందుకు పరమ పవిత్రంగా భావించే సమ్మక్క-సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెల చుట్టు ఇనుపకంచెలు వేసి బంధిస్తుంది. అధికారం ఉన్నది ప్రజల మనోభావాలను చంపడానికేనా..? ప్రజల సెంటిమెంట్ల మీద స్వారీ చేయడానికేనా? ఎన్నని అడగాలి ఆదివాసిలు.. నోరు లేని అమాయకులు..?ఎం చెబుతుంది ఈ మానవత్వం లేని సర్కారు?
     పసుపు, కుంకుమా, ఇన్ని వెదురు బొంగులు..నేలతల్లి తనువుతో కట్టుకున్న గద్దెలు ఇవే మేడారం జాతర..కల్ముషం లేని మనుషులు, ఏ స్వార్థం లేని..ఏ కోరికలు లేని నిజమైన మట్టిమనుషుల జారత. తమను కంటికి రెప్పాల కాపాడుకునే0దుకు మానవ జన్మ ఎత్తిన సమ్మక్క తల్లిని కళ్లలో పోట్టుకని చూసుకోవడం తప్పా అక్కడి వారికి మరే ఆలోచన లేవు. వేసుకున్న పంటలు..పెంచుకున్న పిల్లలు..ఉంటున్న అడవి చల్లగా ఉండాలనే కోరికలు తప్పా మరేమి లేవు. అంతా ప్రేమల జరుపుకునే జాతర ఇంతా వ్యాపారికరణ జరగడం నిజంగా మనసును కలిచివేసేదే. ఓ వైపు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక ట్రాస్ట్ బోర్డ్ ద్వారా వెలిగిపోతుంటే.. కోట్ల రూపాయల ఆదాయం ఉన్న మేడారం జాతర సర్కారు నిధుల కోసం ఎందుకు ఎదురు చూడాలి. టెండర్ల ద్వారా వచ్చిన ఆదాయాన్ని మేడారం ట్రస్ట్ బోర్డుకు ఎందుకు ఇవ్వరు. ఎలాంటి నిర్మాణాలు లేకుండా.. ఆదివాసుల మనోభావాలకు ఆనుగుణంగా ఎందుకు అభివృద్ధిని చేయారు? జాతర వచ్చిందంటే ఆదివాసులను పూజలకు అమ్మవార్ల సేవలకు పరిమితం చేసి కోట్లాది రూపాయలు దండుకోవడం సర్కారుకు న్యాయమవుతుందా..? నిజంగా మాటలు రాకుంటే.. అమాయకంగా ఉంటే మనుషుల్ని ఇంతలా దోచుకుంటారా..ఎంత వరకు సమంజసం ఇది. 
      ఇక జాతర భద్రత పేరుతో సర్కారీ పోలీసులు చేస్తున్న  వెకిలి చేష్టలు ఆదివాసులను కలవరానికి గురిచేస్తున్నాయి. మా జాతరను..సంస్కృతిని మాకు దూరం చేస్తరేమోనని భయందోళనలకు గురిచేస్తుంది. మొన్నటి జాతరలో మావోయిస్టుల నిఘా కోసం కళాబృందాల ముసుగులో పోలీసులు చేసిన దుర్మార్గమైన ప్రయోగం అటవిబిడ్డల కళ్లకు నీళ్లు తెప్పించింది. కళ్లకు అద్దుకునే అమమ్మవారి వాకిట్లో ఖాకీల బూట్ల శబ్ధాలు వాళ్ల గుండెలను కలిచివేసాయి. అంతేకాదు.. ఇక సమ్మక్క జాతరకు వచ్చె భక్తులకు కల్పించాల్సిన ఏర్పాట్లు కల్పించకుండపోవడంపై వారు ఆవేదన చెందుతున్నరు. ఇదీ తల్లులను బదనాం చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆదివాసీలు. అంతేకాదు. రెండెండ్లు అమ్మవార్లను కంటికి రెప్పాలా చూసుకొనే తమకు 33 శాతం కేటాయించి..77 శాతం నిధులను సర్కారు ఖజానాకు తరలించడంపై వారు దిగులుపడుతున్నారు. తమకు 50 శాతం కేటాయించాలని పూజారులు డిమాండ్ చేస్తున్నారు. జాతర చుట్టపక్కల ప్రాంతాల్లో షాపుల కోసం కేటాయించిన భూముల్లో స్వ్కేర్ ఫీట్ కు నాలుగు వేల రూపాయలతో కోట్లాది రూపాయల ఆదాయం..షాపుల టెండర్ల ద్వారా వచ్చినా కోట్లాది రూపాయల ఆదాయాన్ని దక్కించికొని  పలికినా.. తమకు దక్కింది ఏం లేదని వారు బాధపడుతున్నరు.1968 కి ముందు జాతర ఆదాయం అంతా పూజారులకే చెందేది. దీంతో జాతర కు కావాల్సిన అన్ని ఏర్పాట్లను పూజారులు, ఆదివాసి పెద్దలు దగ్గరుండి చూసుకునే వారు. ఎక్కడ అమ్మలకు లోటు జరగకుండ..పద్దతి తప్పకుండ జాతరను జరుపుకునేవారు. కానీ లక్షల మంది జాతరకు వస్తుండటం.. ఆదాయం పరంగా ఉన్నతమైన జాతర కావడంతో సర్కారు మేడారం జాతరను దేవాదయ శాఖ ఆధీనంలోకి తీసుకున్నది. ఇక అప్పటి నుంచి ఆదివాసీలకు కష్టాలు మొదలై ఇప్పటికి వెంటాడుతున్నాయి. జాతర హుండీల ద్వారా వచ్చిన ఆదాయంలో 33 శాతం పూజారులకు కేటాయిస్తున్నది సర్కారు.2008 లో రెండు కోట్ల ఆదాయంరాగా.. 2010లో మూడున్నర కోట్ల ఆదాయం వచ్చినట్టు అంచనా. అమ్మవార్లను పూజించే 300 కుటుంబాలకు ఒక్కొక్కరికి లక్ష కూడ వచ్చిన దఖలాలు లేవు. రెండెళ్ళపాటు వ్యయప్రయాసాలకు ఓర్చి అమ్మవార్లను కంటికి రెప్పాల కాపాడుతున్న పూజారులకు పూట గడిచే పరిస్థితి లేకపోవడం దారుణమైన విషయం.
      సర్కారు ఇప్పటికైనా ఆలోచించాలి.. మేడారం జాతరను ఆదివాసులు జరుపుకునేల ట్రస్ట్ బోర్డుకు అధికారాలను కట్టెబెట్టాలి. ట్రస్ట్ బోర్డుకు సహకరం అందించే ఓ వ్యవస్ధల సర్కారు ఉండాలి. అమ్మవార్ల పూజారుల ఆదేశాలకు అనుగుణంగానే గద్దెల చుట్టు భద్రతను ఏర్పాటు చేయాలి. అందరిని సమానంగా చూసే అమ్మవార్ల దగ్గర వీఐపీ సంస్కృతిని రద్దు చేయాలి. అదివాసులను మేడారం జాతర అప్పుడే కాకుండా వీలుచిక్కినప్పుడల్లా అభివృద్ధి కార్యక్రమాలతో ఆర్ధిక, సామాజిక అభివృద్ధికి తోడ్పడాలి. జాతరపై వస్తున్న ఆదాయంలో 70 శాతం జాతర చారిత్రక పురోగతిపై ఖర్చు చేయాలి. సమ్మక్క-సారలమ్మ చరిత్రకు సంబంధించిన అధ్యయనాన్ని వేగిరం చేయాలి. సమ్మక్క పుట్టుకా..చరిత్రకు సంబంధించిన విషయాలను వెలుగులోకి తీసుకురావాలి. ఆదివాసీ పూజారులకు నెలభత్యం అందించాలి. జాతర దినసరి ఖర్చులకు నెలకు రెండు లక్షల రూపాయలు పూజారులకు అందించాలి. జాతర పరిసరాలు.. ఉనికి కోల్పోకుండ అభివృద్ది కార్యక్రమాలను చేయాలి. రోజురోజుకు తగ్గిపోతున్న అటవిసంపదను కాపాడాలి. జాతర తర్వాత భక్తుల వదిలివెళ్లిన వ్యర్థాలను అతితొందరగా తీసివేయాలి. మేడారం చుట్టుపక్కల ప్రజలకు ప్రతినెల సూపర్ స్పెషాలిటీస్థాయి వైద్య క్యాంపులను ఏర్పాటు చేయాలి. మేడారం జాతర చరిత్రను పుస్తకాల్లో పెట్టాలి. ఆదివాసులకు జాతర నిర్ణయాల్లో పూర్తిభాగస్వామ్యం కల్పించాలి. అప్పుడే సమ్మక్క తల్లి కరుణించేది. సారళమ్మ తల్లి దీవించి రాష్ర్టాన్ని సుభిక్షంగా ఉంచుతుంది. అమ్మను నమ్ముకొని ఉంటున్న ఆదివాసులను ఆగాం చేస్తే సర్కారు పుట్టిమునగక తప్పదు. 

                                                                                      

2 కామెంట్‌లు: