పుస్తకమంటే ఎందుకు తల్లి నీకు అంత ప్రేమ ??
బుల్లెట్లు ఎదురోస్తున్నా అక్షరాలను ముద్దాడలనుకున్న..
నీ గుండె దిటవు ముందు..
బోసి నవ్వుల నీ అమాయకత్వం ముందు
కర్కశత్వం ఓడిపోయింది..
రాక్షసత్వం తోకముడిచింది తల్లీ .
నీకు దిగిన ఒక్కొక్క బుల్లెట్టు..
సూర్యుడి వలే...
తాలిబాన్ల చీకటి రాజ్యాలను చీల్చేస్తుంది..
అరాచక వ్యవస్థను అంతం చేస్తుంది..
ఒక్కదానివే అచేతనవస్థలో ఉన్నవని
దిగులు పడకు తల్లి..
నీకోసం కోట్లాది గొంతులు ప్రార్దిస్తున్నాయి..
నువ్వు చల్లగా ఉండాలని..
తల్లీ మాలాలా..!
నువ్వు ఆరిపోయే దీపానివి కాదు..
వెలుగులు పంచె రేపటి ఉషోదయనివి..
నీకోసం భూగోళమే ఒక్కటై ధ్వనిస్తుంటే
నీకెందుకు తల్లి బెంగ..
నువ్వు మళ్ళీ పుస్తకాల బ్యాగును భుజానికేసుకొని
నీకు నచ్చిన అక్షరాల ఆలయం లో
ఆటలాడుతూ..
అక్షరాలు వల్లెస్తూ..
రెక్కలు కట్టుకొని ఎగురుతావు..
ఇది సత్యం..
బాగా రాసారు.
రిప్లయితొలగించండిమొన్న దుర్మార్గులు దించిన బులెట్ ని గుండెలో దాచుకుని
గద్దర్ వేయి ఏనుగుల శక్తిని సంతరించుకున్నట్టు
తాలిబాన్ల బులెట్లని సిగలో ముడుచుకుని
వాళ్ళ తానాషాహిని తుదముట్టిం చేందుకు వేయి సివంగుల శక్తితో మలాలా తిరిగి రావాలి.
వివాలా మలాలా !
.
we help people to stay focused on thoughts and ideas that uplift and inspire them, that remind them to dream big and go for their dreams.
రిప్లయితొలగించండిChala Baga Rasaru Guru Garu.
రిప్లయితొలగించండి