తెలుగు మహాసభల్లో తెలంగాణ వైతాళికులకు సరైన గుర్తింపు వచ్చేలా ఏర్పాట్లు సాగాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి, అసెంబ్లీలో వైద్యశాఖపై జోరుగా సాగుతున్న ప్రశ్నోత్తరాల సమయం, /

18 అక్టోబర్, 2012

దోచుకోవడం.. దాచుకోవడమే వారి పని..

      రవి అస్తమించని సామ్రాజ్యాన్ని నిర్మించినంత పని చేసిన బ్రిటీష్ వాళ్ళు.. ప్రపంచం లోని దాదాపు అన్ని దేశాల సంపదతో పాటు.. విజ్ఞాన సర్వస్వాన్ని దోచుకుపోయారు. అయితే బ్రిటీష్ పాలకుల బానిసత్వం లోని అన్ని దేశాలు.. స్వాతంత్ర్యాన్ని సాధించుకున్నాక .. తమ సాంస్కృతిక చిహ్నాలను తిరిగితెచ్చుకున్నాయి.అంతే కాదు తమ మేధో సంపత్తితో సృష్టించిన అనేక అద్భుతాల హక్కులను సాధించుకున్నాయి. కానీ విశాలమైన భారతావని మాత్రం ఆ పని చేయలేక పోతుంది. పాలకుల నిర్లక్ష్యం..పరిశోధకుల నిర్లిప్తత మన ఆవిష్కరణలకు ప్రమాడం లోకి నేట్టేస్తున్నాయి.
        నిన్న మొన్నటి వరకు.. పసుపు, వేపాకు, కుంకుమ పువ్వు, కరివేపాకును తామే కనుగొన్నామని తెల్లోల్లు అంతర్జాతీయ పేటెంట్ కోసం అప్లై చేసేదాకా కూడా మనవాళ్ళు ఆ సంపద తమదని పేటెంట్ తీసుకోక పోవడం నిజంగా సైంటిస్టుల తప్పిదమే. పరిశోధనల మీద వేల కోట్లు దారపోస్తున్న ఒక్క ఆవిష్కరణ కొత్తది లేకపోవడం కలవార పరిచే నిజం. 
       ఎందరో భారతీయ మేధావులు తమ అద్బుత మేధోశక్తితో  రాసిన అమూల్యమైన అనేక గ్రంధాలు విదేశీ లైబ్రరీలలో ములుగుతుండటం మన దౌర్భాగ్యమనే చెప్పక తప్పదు.




       ప్రభుత్వాలు ఇప్పటికైనా  నిద్రమత్తును వీడి అమూల్యమైన ఆ సంపదను తీసుకురావాలి. శాస్త్రవేత్తలు భారతీయ  వారసత్వ అద్బుతలకు పేటెంట్లు తీసుకునే కార్యక్రమాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్ళాలి. లేదంటే  ఇంగ్లీష్  వాళ్ళు మన ఉల్లిపాయ, కొత్తిమీర కూడా తమదేనని బోగస్ ప్రచారం చేస్తారు. బీ కేర్ ఫుల్..


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి