బడి పిల్లలపై పరీక్షలు పెను భారాన్ని మోపుతున్నాయి. తల్లితండ్రుల ఆలోచనలను క్యాష్ చేసుకునేందుకు విద్య సంస్థలు టాలెంట్ టెస్ట్ ల పేరుతో విద్యార్దులను తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నాయి. ఒకవైపు రోజు వారి విద్య విధానమే యాంత్రికమై ఆట పాటలు లేకే పసిమొగ్గలు తల్లడిల్లి పోతుంటే..ఈ టాలెంట్ టెస్ట్ లు చిన్నారుల పాలిట గుదిబండలుగా తయారయ్యాయి. అమ్మల ఆత్మీయ ఆలింగనం..నాన్నల అపురూపమైన స్పర్శలు కరువయ్యి చిన్నారులు హింసాత్మక ఆలోచనల వైపు మగ్గుతున్న విషయాలు కళ్ళ ముందు కనిపిస్తున్నా ఆ వైపుగా ఆలోచించే తీరిక ఎవరికీ కలగక పోవడం భాదకరమే.
చిన్నారుల పై విద్యా సంస్థలు మోపుతున్న టాలెంట్ టెస్ట్ ల ఒత్తిడిని నిలిపి వేయాలంటూ బాలల హక్కుల సంఘం ఆంధ్రప్రదేశ్ హై కోర్ట్ లో పిటీషన్ దాఖలు చేసింది. రియాలిటి షో లలో చిన్నారులను వేధించడం నేరమని తీర్పు ఇచ్చినట్టుగానే.. టాలెంట్ టెస్టులను నిషేదించాలని తీర్పునివ్వాలని మనస్పూర్తిగా కోరుకుందాం.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి