చీకటిని చీల్చే వెలుగు రేఖ దీపావళీ.
మా అన్న కొడుకు రణధీర్ కి చీకటి అంటే అసలు భయమే లేదు. (ఎందుకంటే వాడి వయసు ఒకటిన్నర సంవత్సరాలే కదా) అందుకే వాడు రాత్రి పగలు తేడా లేకుండా హాయిగా తిరుగుతుంటాడు. అంతేకాదు కరెంట్ పోతే చాలు వాడు కబుర్లు చెప్పడం స్టార్ట్ చేస్తాడు. వాడికి చీకటి గురించి తెలియదు కదా.. అందులో ఎంత క్రౌర్యం ఉందో.. ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయో. అందుకే వాడు పగలు రాత్రి తేడా లేకుండా కాలాన్ని గడిపేస్తుంటాడు.
నిజంగా నాకు అనిపిస్తుంది. మనిషి తన ఉనికి తెలియని కాలంలో బతికినన్ని రోజులు భయం సంతోషం, చీకటి వెలుతురు తెలియకుండా బతుకుతారు. కానీ జ్ఞానం వచ్చిందని గొప్పగా చెప్పుకునే వయసుకు వచ్చెసరికి మనిషి ఎందుకు కృరంగా మరిపోతున్నాడు. సాటి మనిషిపై కోపం ద్వేషం, ఈర్షలతో ఎందుకు హడాలెత్తిపోతున్నాడు. ఒక మనిషిని నుంచి మరో మనిషి కాపాడుకోవాడనికి రక్షణ కావలసిన దుస్థితి మానవ జాతికి ఎందుకు వచ్చిందో మనిషి ఆలోచించుకోవలసిన సమయం ఆసన్నమైంది. వేదం మనుషులంతా సమానమని ఘోషిస్తుంటే అలాంటి వేదాలను చావు సిగ్నల్లుగా మార్చిన అజ్ఞానం మనల్ని ఎప్పుడు వీడుతుంది. కార్యేషుదాసీ, కరణేషు మంత్రి, బోర్జేషూ మాతా అని వర్ణించిన నీతిమాటలను పైపైకి పెరుగుతున్న అభయ కేసులు వెక్కిరిస్తా ఉంటే సమాజం వెయ్యి వొల్టుల వెలుగుల్లో వెలిగిపోతుందని సంబర పడదామా.. రక్షసులు చచ్చినా.. వారి జన్యువులను మోస్తున్న రాబందుల జాతి రాజ్యమేలుతుందని నమ్ముదామా..? ఆలోచిద్దాం.. ఈ దీపావళికి పవిత్ర స్నానాలతో మనలో దాగిన రక్షసత్వాన్ని బొందపెడదాం. దీపాలు వెలిగించి కన్నులను కమ్మెసిన అహాంకారపు చీకట్లను పారదోలుదాం.. నవ దీపావళీ రోజునాడు సాటి మనిషిని గౌరవించే.. ప్రేమించే గొప్ప మనుషులుగా మారుదాం. మా రణధీర్ లాగే జనమంతా చీకటి వెలుగులతో సంబంధం లేకుండా నిర్భయ భారతాన్ని నిర్మిద్దాం.
హ్యాప్పి దీపావళీ..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి