తెలుగు మహాసభల్లో తెలంగాణ వైతాళికులకు సరైన గుర్తింపు వచ్చేలా ఏర్పాట్లు సాగాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి, అసెంబ్లీలో వైద్యశాఖపై జోరుగా సాగుతున్న ప్రశ్నోత్తరాల సమయం, /

08 మే, 2014

తెలంగాణ‌లో రెండు పార్టీల న‌డుమ దోబుచులాడుతున్న విజ‌యం


   
     తెలంగాణ‌లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో విజ‌యం ఎవ‌రిని వ‌రిస్తుందో తెలియ‌క రాజ‌కీయ పార్టీలు స‌త‌మ‌త‌ముతున్నాయి. టీఆర్ ఎస్ పార్టీ నాయ‌కులు విజ‌యం సాధిస్తామ‌ని పైకి ధీమ‌గా చెబుతున్నా లోలోన మాత్రం విజ‌యంపై ఆందోళ‌న‌లో ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ చాప కింద నీరులా త‌న కార్య‌క్ర‌మాల‌ను త‌ను చేస్తూ త‌న మార్క్ పాలిటిక్స్‌కి తెర‌లేపుతుంది. ఇటు ప‌క్క ఎంఐఎం, అటు సీపీఐ పార్టీల‌తో చ‌ర్చ‌ల‌కు తెర‌లేపుతుంది. అందులో భాగంగానే టీపీసీసీ అధ్య‌క్షుడు పొన్నాల ల‌క్ష్మ‌య్య ఎక్కే గ‌డ‌ప దిగే గ‌డ‌ప ఎక్కుతూ రాబోయే తెలంగాణ రాష్ట్రంలో తొలి కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తెగ ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు.
    ఇక ఎంఐఎం నాయకులు కేసీఆర్ తో వెళితే లాభామా కాంగ్రెస్ తో ఉంటే లాభామా అని లెక్కలు వేసుకుంటున్నారు. సీపీఐ నారయణ నిమిషానికో మాట మాట్లాడుతున్నారు. తెలంగాణ తెచ్చింది కేసిఆర్ అంటూనే సోనియా చలువ వల్లే తెలంగాణ వచ్చింది కదా అంటూ రెండు నాల్కల ధోరణిని కనబరుస్తున్నారు.

ఇక తెలంగాణ ప్రజలపైనే పూర్తి భారం ఉంచిన కేసిఆర్ తప్పకుండా తమ ప్రభుత్వం ఏర్పడుతుందని అందులో కించత్ సందేహం లేదని ఘంటాపథంగా చెప్తున్నారు.
చూడాలి ఉద్యమనాయకుడు కేసిఆర్ నమ్మకం నిజమవుతుందా.. తెలంగాణను ఇచ్చింది మేమేనని ఢంక బజాయిస్తున్న కాంగ్రెస్ నెగ్గుతుందా.. తెలియాలంటే కొద్ది రోజులు వేచీ చూడాల్సిందే.. ఏదీ ఏమైన ఇప్పడు మనం సొంత రాష్ట్రంలో ఉన్నాం. రాష్ట్రాన్ని తెచ్చిన ఉద్యమనాయకుడు కేసిఆర్ ముఖ్యమంత్రి అయినా, తెలంగాణ ఇచ్చాం అనే కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినా.. అంతిమంగా తెలంగాణ మంచి జరిగితే స్వరాష్ట్రం కోసం ఉద్యమించిన ప్రజలంతా సంతోషిస్తారు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి