నాగటి కర్రుకు ఎరుక
నానిన భూదేవి సంగతి..
మట్టిలో మునిగిన విత్తుకు ఎరుక
కురిసే వరణుడి ఒరవడి..
ఆకాశంకేసి ఎదుగుతున్న మొక్కకు ఎరుక
లేలేత కిరణాలను వెదజల్లుతున్న సూరీడి వాడీ..
మరి మేఘ మధనాలకు
రసాయన ప్రయోగాలకు
అందునా ప్రకృతి ఒడి
అది వీడని చిక్కుమడి.
###
ఆకాశంకేసీ చూడకు
భూమాతను చూసి బెదరకు
నెర్రెలుబారడం..
వరదలుపారడం
స్టెప్ బై స్టెప్
అతివృష్టిలు.. అనావృష్టిలు
ఎన్నటికైనా టఫ్.
కాలాన్ని ఆపడం
నాసా రాకెట్ వల్లవుతుందా..?
ఇస్రో సాటిలైట్ వల్లవుతుందా..?
చెప్పడం కాస్త కష్టం
అదంతా మిస్టరీ అని చెప్పడం ఇష్టం.
###
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి