మార్గం -1
ఎప్పుడు ఇంగ్లీషు భాషలో ఒంటరి పదాలను చదవకూడదు.
జట్టుగా ఉన్న పదబంధాలను చదవాలి.
అంతేకాదు చిన్న పేరాగ్రాప్‌లను ఇష్టంగా చదవాలి.
ఒకటికి పదిసార్లు రాస్తూ చదవాలి.
మార్గం -2.
ఉచ్ఛరనే ఉత్తమ మార్గం -
అంటే చూసిన ప్రతి పదాన్ని ఉచ్ఛరించాలి.
కలిసిన ప్రతి మనిషితో ఇంగ్లీషులోనే మాట్లాడటానికి ప్రయత్నించాలి.
మార్గం-3.
వ్యాకరణం ద్వారా మాత్రమే ఇంగ్లీష్ వస్తుందనుకోవడం భ్రమ మాత్రమే -
తెలుగు మాట్లాడే ప్రజలందరికి సంధులు, సమాసాలు, రావు అంతేందుకు అ, ఆలు రాని వారు కూడా తెలుగును చక్కగా మాట్లాడతారు.
అంటే భాష మాట్లడటానికి వ్యాకరణానికి (గ్రామర్) సంబంధం లేదు.
అందుకే వ్యాకరణాన్ని పక్కన పెట్టి త్రికరణ శుద్ధితో ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేస్తే అదే వస్తుంది.
మార్గం - 4.
ఏ భాష మనకు మాట్లాడటం రావాలన్న ముందుగా ఆ భాషను మాట్లాడే వారి మాటలను వినాలి.
వినడం ద్వారా చాలా పదాలు మన మదిలో నిలిచిపోతాయి.
అందుకే ఇంటర్‌నెట్ వినియోగించేవారు యూట్యూబ్ వీడియోలను, లేని వారు టీవీ, రేడియోలను విరివిగా వినాలి.
మార్గం -5.
మొదట ఇంగ్లీషును అధ్యయనం చేసేందుకు చిన్న పిల్లల స్టోరీ పుస్తకాలను చదవాలి.
దొరికితే ఒకే కథ తెలుగులో, ఇంగ్లీషులో ఉంటే పదాల పొందికను త్వరగా అర్థం చేసుకోవచ్చు.
మార్గం -6.
మార్కెట్‌లో దొరికే ప్రశ్నల పుస్తకాలను కొని వాటికి జవాబులు నింపి సరిచూసుకోవాలి.
అవి అందుబాటులో లేని వారు టీవీ షోలలో అడిగే చిన్న ప్రశ్నలను రాసుకొని వాటికి జవాబు రాసే ప్రయత్నం చేయాలి.
ఈ మార్గలు సులువుగా ఇంగ్లీషు మాట్లాడేందుకు తోడ్పడతాయన్నది సత్యం. అందుకే వేలకు వేలు పోసి స్పోకెన్ ఇంగ్లీషు కోచింగ్‌లో జాయిన్ అవడం కన్నా ఇంటి దగ్గరే ఒక ఇంగ్లీషు దిన పత్రికను వేసుకొని చడవడం వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది. అన్నట్టు మాట్లాడం ద్వారా సులువుగా నేర్చుకోవచ్చన్న సంగతి మనం ఎరిగినదే కాబట్టి మాట్లాడ్డం ప్రారంభించండి. ఇంకెందుకు ఆలస్యం.
ఆల్ ది బెస్ట్.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి