తెలుగు మహాసభల్లో తెలంగాణ వైతాళికులకు సరైన గుర్తింపు వచ్చేలా ఏర్పాట్లు సాగాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి, అసెంబ్లీలో వైద్యశాఖపై జోరుగా సాగుతున్న ప్రశ్నోత్తరాల సమయం, /

30 జులై, 2019

త్రిపుల్ తలాక్ బిల్లుకు ఓకే చెప్పిన రాజ్యసభ

త్రిపుల్ తలాక్ బిల్లుకు ఓకే చెప్పిన రాజ్యసభ ముస్లీం కుటుంబాల్లోని అమ్మాయిలకు రక్షణ కల్పించేందుకు మోదీ ప్రభుత్వం గత కొన్నేళ్లుగా చేస్తున్న ప్రయత్నాలకు ఫలితం దక్కింది. 2017 లోనే సుప్రీం కొోర్ట్ త్రిపుల్ తలాక్ రాజ్యంగవిరుద్ధమని స్పష్టం చేసినా.. చట్టబద్దం చేయడంలో మన రాజకీయ వ్యవస్థ తన దౌర్భలత్వాన్ని చాటుకున్నది. సమాజానికి మంచి జరుగుతుందని తెలిసిన ఓటు బ్యాంకు రాజకీయాల కోసం పార్టీలన్నీ జట్లుగా విడిపోయి వికృత రాజకీయాలు చేసాయి. ప్రభుత్వం సైతం ప్రతిపక్షాల ఆరోపణలను, ఆక్షేపణలను, ఆలోచనలను విని చిన్న చిన్న సమస్యలను సరిదిద్దే ప్రయత్నం చేస్తే బావుండేది. కానీ అలా జరగకపోవడం వల్ల సమస్య ఇంత దూరం వచ్చింది. అంతేకాదు లోక్ సభలో ఆమోదం పొందిన బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందడం కోొసం దాదాపు ఆరునెలలకు పైగా సమయం తీసుకుంది. కానీ ఎట్టకేలకు 99 మంది ఆమోదం 84 మంది సభ్యుల వ్యతిరేఖత నడుమ మూజువాణి ఓటుతో త్రిపుల్ తలాక్ బిల్లు చట్టరూపం దాల్చింది. ఈ బిల్లు ఆమోదం పొందడమే ఆలస్యమే ముస్లీం మహిళలు ఆనందం వ్యక్తం చేశారు. స్వీట్లు పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి