తెలుగు మహాసభల్లో తెలంగాణ వైతాళికులకు సరైన గుర్తింపు వచ్చేలా ఏర్పాట్లు సాగాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి, అసెంబ్లీలో వైద్యశాఖపై జోరుగా సాగుతున్న ప్రశ్నోత్తరాల సమయం, /

23 డిసెంబర్, 2010

అన్నం పెట్టె రైతన్న





అన్నం పెట్టె రైతన్న..!

అందరికి అన్నం పెట్టె రైతన్న బ్రతుకు అమావాస్య నాటివెన్నెలలమారిపోయింది .. తన స్వేదంతో .. శ్రమతో ..రాత్రనక ..పగలనక.. ఆరుగాలం కస్టపడి తన జీవితాల్ని ఫణంగా పెట్టి భూమాత వోదిలోంచి సిరులు సృష్టించే రైతన్న గుండెలు బీళ్ళు బడ్డ భూముల్ల.. నెర్రెలు బారిన నేలతల్లిలా .. పగిలి తనువు చలిస్తున్నాడు ,

ఇది ముమ్మాటికి దోపిడీ పాలకులు స్వయం క్రుతపరాధం ..ఇది ఖచ్చితంగా మానవత్వం విడిచి పాలించిన మరమనుషుల పాలనల పాప పరిహారం..ఇది నిఖచ్చిగా రైతన్న బ్రతుకులతో దశాబ్దాలుగా రాజకీయ నాయకులూ ఆడిన దొంగాతకు సజీవ సాక్షం.. నాయకులిప్పుడు మూల్యం చేల్లిస్తారా..? ఓట్ల కోసం దొంగ దీక్షలోతో మరోసారి రైతన్నను మోసం చేస్తారా..?

చుద్హం సిగ్గు లేని పాలకులు ఎం చేస్తారో ...? పరిక్షిద్ధం పాపాత్ముల డొంకతిరుగుడు విన్యాసాల్ని .. పసిగడడాం మాయదారి మోసగాళ్ళ మోసపు క్రీడలని ..

రైతులకు న్యాయం జరిగే వరకు ప్రభుత్వాల మనుగడ లేకుండా.. రైతుల పేరు చెప్పి రాజకీయ పబ్బం గడుపుకోవాలనే నాయకులకు పార్టీలకు .. రైతన్నల ఉసురు తాకి పోవాలని శపిస్తూ ... రైతన్న బ్రతుకు భావుండాలని ఆశిస్తూ..

మీ..

శ్రీపాద రమణ ...






1 కామెంట్‌: