రైతులు ఆగ్రహిస్తే...?
మొన్న 32..
నిన్న 22..
నేడు 29..
రేపు....?
అవి తగ్గుతూ పెరుగుతున్న చలి ఉష్ణోగ్రతల
గణాంకాలు కాదు ..?
అవి దక్షిణఆఫ్రికా టెస్టులో భారత బాట్స్ మెన్
స్కోర్ వివరాలు కాదు..?
అవి ముంబై స్టాక్ ఎక్స్చేంజ్ లోని
షేర్ల హెచ్చు తగ్గులు కాదు..?
అవి ఆంద్ర ప్రదేశ్ లోని రైతు
మరణాల లెక్కలు ..
అవి ప్రభుత్వాలు చేస్తున్న
హత్యల పరంపరలు ..
అవి ఆత్మగౌరవం కోసం మరణ కొయ్య
ఎక్కేందుకు సిద్దపడ్డ మట్టి మనుషుల
ఆత్మగౌరవ సంకేతాలు..
సిగ్గు ఎగ్గు లేని పాలకుల
నిష్క్రియ పరత్వానికి ఆనవాళ్ళు ..
దీక్షల పేరుతో బొంకిన
రాజకీయ పార్టీల దింపుడుకళ్ళెం
ఆలోచనల లెక్కల శేషం ...
ఒక్క మరణం ఆగక ముందే
ఒక్క గుండెకు దైర్యం నిండక ముందే
ఒక్క ఎకరాకు నష్టపరిహారం దక్కకముందే ..
నిమ్మరసం మెక్కిన నాయకుల
కుళ్ళు ,కుతంత్రాల సశేషం అవి..
దిక్కుమాలిన రాజకీయాల వలలో
చిక్కిన బక్క పల్చని రైతు అవశేషం అవి..
నీతిని విస్మరించిన ప్రభుత్వ
దుర్నితికి తార్కాణం అవి..
ఆగ్రహం ఎరుగని అతీతులని..
ధర్నాలు చెయ్యని ధర్మత్ములని ..
పడికిలి బిగించి దున్నడం తప్ప
పిడిగుద్దులు గుడ్డని అనమకులని ..
చేతులు జోడించి అర్దించడం తప్ప
వేలెత్తి చూపి ఘెరావ్ లు
చేయలేని అచేతనులని తక్కువ చేసేరు..
మీ బ్యాలెట్ బాక్సులు ఖాళీ అవుతుంది .
మీ కెరీర్ అంత రివర్సావుతుంది ..
మీ ప్రభుత్వాలు ,పార్టీలు
పేక మేడల్ల కులీపోతాయీ..
రైతన్నల ఆగ్రహాల సునామిల్లో కొట్టుకుపోతారు
జాగ్రత్త ...
మీ
శ్రీపాద రమణ..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి