తెలుగు మహాసభల్లో తెలంగాణ వైతాళికులకు సరైన గుర్తింపు వచ్చేలా ఏర్పాట్లు సాగాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి, అసెంబ్లీలో వైద్యశాఖపై జోరుగా సాగుతున్న ప్రశ్నోత్తరాల సమయం, /

25 ఆగస్టు, 2011

అన్నాహజారే..


అన్నా పోరుకు కదులుతున్న సర్కారు పునాదులు..

అవినీతిపై అన్నా పూరించిన సమరశంకం..

ఆనాటి గాంధీజీ శాంత్రి మంత్రం..

ఆకాశానికి ఎగసిని అక్రమాలపై తంత్రం..

జన సామాన్యాన్ని పట్టిపీడిస్తున్న

లంచంపై యుద్ధనాదం..

సామాన్యుని కడుపుకోట్టి ..

స్వీస్ లో మూలుగుతున్న..

పెద్దోళ్ల దోపిడి సంపదపై పోరునాదం..

2జీలు , 3జీలను అడ్డుపెట్టి..

కోటాను కోట్లు మింగిని దొంగరాజాలా..

చోరకళపై ఉక్కుపాదం.

నాన్న పాలనను అడ్డుపెట్టుకొని రాజకీయాల్ని

రంకుచేసిన జగన్మోహనుల జల్సాలు..

బోంకునేర్చిన ఓదార్పు సల్సాలపై..

పిడికిలెత్తి పిడుగులు కురిపిస్తున్న అన్నావాదం.

దేశహితాన్ని ఫణంగా పెట్టి...

నోట్ల కట్టన సేదతీరుతున్న కేంద్రమంత్రుల..

ధనమోహంపై ఎక్కు పెట్టిన బాణం..

సీట్లో కూర్చోని అవినీతి క్రీడను

తిలకిస్తున్న ప్రధాని నిర్లక్ష్యంపై

బ్రహ్మస్త్రం..

దేశపౌరుల గుండెలను తాకిన ప్రేమస్త్రం..

ప్రజాహితం కోరిన పౌరిడి ఉగ్రరూపం..

సర్కారును కదిలిస్తున్న సామాన్యుని మరోరూపం..

కమాన్ అన్నా..

వీ ఆర్ విత్ యూ..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి