డమ్మి యూత్...
బ్లాక్ లో టికెట్స్ కొని సినిమా చూస్తరు... జెండావందనం రోజున ఎంటర్ టైన్ మెంట్ కు జై కొడతరు... ఇండియా పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అప్పుడే ఇండియా జీతేగా అంటరు.. కాలేజికి బంక్ లు కొట్టి అటెండెన్స్ ఫీజులు కట్టి పరీక్షలకు హాజరవుతారు... ఒకే బండిమీద ముగ్గురు నలుగురు కలిసి రయ్యిమని దూసుకుపోతరు. బస్ పాస్ నుంచి బోనోఫైడ్ వరకు అన్నీ కాసులు కొట్టి కాకపట్టి తీసుకుంటరు. రూల్స్ అన్ని ఫాల్స్ చేసే వీళ్లె ఇప్పుడు అన్న హజారే దీక్ష కు మద్దతు అంటున్నరు.. రోడ్డెక్కి అవినీతిపై పోరంటూ జాతీయ జెండా పట్టి ఫోజులు కొడుతున్నరు.
అవినీతిపై అన్నా హజారే పోరాటం మొదలపెట్టిన దగ్గరనుంచి నేటివరకు అన్నా పోరుకు మద్దతు పలికి హంగామా చేసింది యూత్ . అన్నాను అరెస్ట్ చేసిన నాటినుంచి ఏ రోడ్డు చూసిన జాతీయ జెండాలు పట్టుకొని నినాదాలు చేస్తున్న యూతే కనిపించారు. తలపై అన్నా అని హేర్ కటింగ్ చేయడం.. టీ షర్ట్ లపైన అన్నాకు మద్దతుగా కొటెషన్స్ నింపుకున్నరు. అన్నా మాస్కులు ధరించిన్రు. ఇక అమ్మాయిల హంగులు ఆర్భాటాలు అన్ని ఇన్నీ కావు... వొళ్ళంత కనిపించేలా వీపుపై అన్నా వి ఆర్ విత్ యూ అంటూ వళ్ళెమాలిన అభిమానాన్ని చాటుకున్నరు. ఇవే కాదు ఇంకా ఎన్నో వెరైటీ ప్రదర్శనలకు తమ టాలెంట్ అంతా ప్రదర్శిచారు. నిజమే ఈ పోరు అద్భుతం.. ఈ మద్దతు అసామాన్యం.. మరీ దేశంలో ఎక్కువగా అవినీతిని ప్రోత్సహిస్తున్నవారు ఎవరకు ? యూత్ కాదంటారా..? అట్లా చెప్పడం కరెక్టా..?
ఏ కాలేజి చూసిన పావుల పర్సెంట్ అటెండెన్స్ లేక పరేషాన్ అవుతున్నాయి. ఏ కంపేనీ చూసిన నాణ్యమైన నిపుణులు లేక వాంటేడ్ ప్రకటనలతో కండ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే నూటపదికోట్ల మంది జనం ఉన్నదేశానికి ఒలంపిక్స్ లో నూరు పతాకాలు లేక ప్రపంచం ముందు దేశం పరువు గంగలో కలిసిపోతున్న.. ఎవ్వరికి ఆలోచన ఉండదు.. ఇట్లా చెప్పుకుంటే పోతే మన యూత్ నిర్లక్ష్యం గురించి ఎంత చెప్పిన తక్కువే.
క్రేజీ హీరో సినిమా రిలీజ్ అయితే చాలు.. ఏ ఏజ్ యూత్ అయిన థియేటర్ ముందు కనిపించాల్సిందే... ఇందులో మన వాళ్లు చాల కమిటెడ్ గా ఉంటారు.. థియేటర్ లో అడుగుపెడితే ఎంత డబ్బులు ముట్టచెప్పైన సరే బ్లాక్ లో టికెట్ కొని సినిమా చూడాల్సిందే.. అంటే మనవాళ్లు లంచం ఇచ్చి సినిమా చూస్తున్నరు.. అంతేకాదు కాలేజికి బంక్ లు కొట్టి కామన్ సెన్స్ లేని పనులన్ని చేసి... తీరా అటెండెన్స్ ఫీజులు కట్టి నెక్స్ట్ ఇయర్ కి ప్రమోట్ అవుతున్నారు. అంతేకాదు దిక్కుమాలిన చదువులకు ఎట్లాగు ఉద్యోగం దొరకదని ముందే ఫిక్స్ అయి... కన్సల్టెన్సీలను ఆశ్రయిస్తున్నరు.. పదో ఇరవై వేలు ముట్టజెపి బ్యాక్ డోర్ లో ఉద్యోగాలు సంపాదించి అవినీతికి అడ్రస్ గా మారుతున్నరు.
ఓ వైపు అవినీతి పనులను చేస్తూనే ... మరోవైపు నీతికోసం కోతలు కోస్తున్నరు.తమకు తాము మెరుగైన సమాజం కోసం పోరాడుతున్న ఉద్యమకారుల్లగా ఫోజులు కొడుతున్నరు. అవినీతిని అంతం చేసేందుకు ఆకాశం నుంచి దిగిపడ్డ అద్భుతాల్లాగా యాక్టింగ్ చేస్తున్నరు. కనిపించిన రోడ్డునిండా జెండాలను పట్టుకొని వీరాపోరాటం చేస్తున్నట్టు యమ కట్టింగిస్తున్నరు. కార్లకు , బండ్లకు ఐ సపోర్ట్ అన్నా అంటూ పోస్టర్లు అతికించుకొని హల్చల్ చేస్తున్నరు. కొవ్వత్తులు చేతబట్టి దేశం కోసమే మేమన్నట్టు కోతలు కోస్తున్నరు.
యూత్ కి దేశంపైన ప్రేమ ఉంటే నోటుకు ఓటు కొంటున్న పార్టీల జెండాలు పట్టుకొని ఓట్లప్పుడు ఎందుకు పరుగులు తీస్తరు. సదవులు సంకనాకి పోతున్న సినిమాల చుట్టు , పార్కుల చుట్టు సిగరేట్లు కాలుస్తూ.. బీర్ బాటిళ్లు చేతబట్టి బార్ల ముందు బాతఖన్లు ఎందుకు కొడతరు. ఇండియా పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ వచ్చినప్పుడే ఇండియన్స్ మని ఎందుకు తెగ ప్రేమను చూపెడతరు. అన్నా హజారే దీక్షకు కూర్చునేంతవరకు జల్సాలు చేసి.. అన్నా దీక్షకు కూర్చోగానే ఎందుకు అవినీతిపై యుద్ధం అంటూ రోడ్లెక్కుతున్నరు. అంటే అన్నా హజారే దీక్ష చేసేంత వరకు దేశంలో అవినీతి యూత్ కంటికి కనిపించలేదా.. ఎక్కడ అవినీతి జరిగితే మాకేందుకు మనం సేఫ్ గా ఉంటే చాలనుకున్నరా..? ఈ ప్రశ్నకు జవాబు ఎవ్వరు చెప్పరు.
ఇక ఒలంపిక్స్ పుట్టినప్పటికెళ్ళి మన పతాకాల లిస్టు నిల్లు. టీం పోటీలైనా.. వ్యక్తిగత ఆటలైన మనోళ్లు క్వాలీఫై అవుడే గగనం. మన దేశంలో ఓ చిన్న స్టేటంత లేని దేశాలు.. వందల్లో పతకాలు పట్టుకుపోతుంటే మన దేశం మాత్రం లాస్ట్ నుంచి లీస్ట్ గున్న పతకాలను తెస్తూ.. ఇంకా ఎదగాలని స్టేట్ మెంట్లు ఇస్తూ కాలం వెల్లదీస్తున్నది. ఈ విషయాలేవి యువతకు పట్టవు. ఆదివారం.. హాలీడేలు వస్తే జాలీగా గడిపెస్తరు తప్ప దేశం గురించి ఆలోచించరు. కానీ అన్నా హజారే దీక్ష మొదలు పెట్టంగనే ఏదో కోంపలంటుకుపోతున్నయి.. ఎవరో గ్రహంతరవాసి ఆకాశం నుంచి వచ్చి దేశంలో అవినీతి వైరస్ ను వదిలిపోయినట్టు .. తామేదో దాన్ని అంతం చేసేందుకు కంకణం కట్టుకున్నట్టు బిల్డప్ ఇస్తున్నరు.
అసలు అన్నా హజారే లాంటి కురువృద్ధులు దేశానికి స్వాతంత్ర్యం రాలేదు.. ఇది రెండో స్వాతంత్ర్య పోరాటం అని ప్రకటించినప్పుడే మన యువతకు స్వార్థం తప్ప దేశం మీద ప్రేమ లేదని డిసైడ్ అయ్యింది. అన్నా 74 యేండ్ల వయసులో దీక్షలకు కోర్చోవలసిన పరిస్థితి వచ్చిందంటే అది ఖచ్చితంగా యువత తప్పే.. పాశ్చత్య దేశాల్లో ప్రతి ఉద్యమాన్ని యువతే నిర్మిస్తుంటే మన దేశంలో మాత్రం ఎవరో ఒకరు ఎపుడో అపుడు అంటూ ఎదురు చూస్తూ.. ఎవరో ఒకరు సృష్టించిన ఉద్యమాల్లో భాగస్వాములౌతున్నరు. ఇది మారనంత వరకు దేశంలో మార్పు కొరుకోవడం కొంగజపం లాంటిదే.
తప్పుల మీద తప్పుల చేస్తూ.. దేశం మారలనడం మాని యువత సన్మార్గంలో నడిచి దేశం ఎదుర్కోంటున్న సమస్యలపై ఉద్యమించాలని ప్రజలు కోరుకుంటున్నరు.
సన్మార్గంలో నడిచి రోజూ ఇబ్బందులు పడేకన్నా ఒక్కరోజు కొంచెం డిఫరెంటుగా సపోర్టుజేసి పాపులర్ అయి ఫోజులుకొట్టడం ఈజీ సోదరా. ఇహనఖ్ఖర్లేదులే ఆయన మానేసాడటగా రేపట్నుంచి మన అవినీతిబతుకులు మనం బతకొచ్చు. ఆ పోస్టర్లూ అవీ జాగ్రత్తగా దాచుంచుకుంటే రేపింకొరెవరైనా మళ్ళీజేసినప్పుడు "అన్నా" ప్లేసులో వాడిపేరురాసుకొని మళ్ళీ సపోర్టని రోడ్డెక్కొచ్చు.
రిప్లయితొలగించండిమరీ నశ్యం పీల్చే శంకరాభరణం శంకరశాస్త్రులంటి చాదస్త నిరాశావాదులకు దేశంలో కొదువేం లేదు గాని, వాళ్ళు ఎలా చేశారన్నది కాదు, ఉద్యమంలో పాల్గున్నారా లేదా అన్నది పాయింటు. స్వయంప్రకటిత మేధావులైన అరుంధతి రాయ్‌ల్లా దిక్కుమాలిన కూతలు కూసి, చీప్ పబ్లిసిటీ కోసం తగుదునమ్మా అని నోరైతే పారేసుకోలేదు కదా! ఇలా కాశ్మీర్ విషయంలో కారుకూతలు కూస్తే బొక్కలో తోస్తాం అనేసరికి కాళ్ళబేరానికి వచ్చి, క్షమాపణ చెప్పిన ధీరవనిత ఈ రాయి.
రిప్లయితొలగించండిభారత బృహస్పతి గారు, మరీ అలా డీలా పడకండి, ఎవరో ముసలాయన దేశ భవిష్యత్తు కోసం పోరాడుతారులేండి. అయిపోయిందిగా, ఇహ తమరు పండగ పిండివంటల గురించి ఆలోచించండిక.
తెలంగాణ యూత్ దిగజారుడుగా ప్రవర్తించి దౌర్జన్యాలు, రాళ్ళు వేయడం, విగ్రహాలు పడగొట్టడం లాంటివి చేశారు. మన్‌మోహన్ గడ్డంలోంచి ఒక్క వెంట్రుక పీక గలిగారా? కెసిఆరూ చేసిండు దీచ్చ, బిల్లు పెట్టిన్రా? దొబ్బితిన్న ఇడ్లీల బిల్లు, ఫ్లూయిడ్స్ బిల్లు వచ్చాయి గాని.
రిప్లయితొలగించండిDrVvln Sastry Uap Commandos,
రిప్లయితొలగించండిI feel that the correct title for your article is MISGUIDED YOUTH. DARI TAPPINA YUVATA. Not dummy youth. YADHA RAJA TADHA PRAJA, YOUTH NEEDS good guidance, good counselling, a person who can mantle that can really change the things. In the absence of such Change Leaders youth may get mis-guided. For that the responsibility is of The ELDERLY, not that of youth. However youth can self emulate a plan which is constructive for thsemselves when they dont get any right any guidance.
http://www.facebook.com/profile.php?id=100000894689250&sk=info
forwarded by rakthacharithra
good..it's right
రిప్లయితొలగించండిvasthavale chepparu.. kani vasthavalni oppukune charecter manavallaku undadu kada.
మీరే తిడతారు.. మీరే పొగుడుతారు అంతా మీ ఇష్టమేనా.. చేస్తే ఓవర్ చేస్తున్నరంటారు. చేయకపోతే యువకులా ముసలివాళ్ల అని కామెంట్లు చేస్తారు. ఫ్యాషన్లు చేస్తున్నారు. వీళ్లకు సోకులు తప్ప .. లోకం కష్టాలు తెలియవని హేళన చేస్తారు.. ఏమో అండీ అంతా మీ ఇష్టం.
రిప్లయితొలగించండిస్వాతి. హైదరాబాద్.