నా నేల..
గుండెలు తడి ఆరీ తల్లడిల్లుతున్నయి.
మట్టి వాసన కోసం..
మమకారం కోసం..
పల్లే పంచిన అనుభూతుల కోసం...
పల్లే ఇచ్చిన అప్యాయత కోసం..
పట్నం మోజులో పడి మరిచిన అనూరాగం కోసం..
పడి పడి పరుగులు పెడుతున్నయి.
కాంక్రీట్ కీకారాణ్యంలో..
కరుణ లేని..
మనుషుల నడుమ..
ప్రేమ లేని అనాగరికుల కడన..
ఉండనంటూ హృదయం..
ఉరుకులు మొదలు పెట్టింది.
రంగు రంగుల లైట్ల నడుమ..
రంగు నీళ్ల పొంగుల తోటి..
తళుకు బెళుకు తారల తోడ..
ప్లాస్టిక్ నవ్వుల మధ్య..
కల్లిబొల్లి మాటల చెరన..
నేనుండనంటూ ఒకటే గొడవ..
ఒకటే రభస..
పల్లేకు పోయి...
మన గల్లీకి పోయి..
ఆత్మీయత నడుమ..
కడుపు నిండా నవ్వుకొని..
కంటి నిండా నిద్రపోయి..
బతికినన్ని రోజులు తృప్తిగా
బతుకుదమని
ఒకటే లొల్లి ..
ఎం చెప్పను..?
నాకు గుర్తుకొస్తున్నాయి..
నా మునివేళ్ల నుంచి జారి
గిర్రున తిరగిన బొంగరం..
మా ఇంటి పెరటి చెట్టపైన
కోతి కొమ్మచ్చి ఆడిన జ్ఙాపకం..
మా పక్కింటి శీనుగాడితో
మామిడి పిక్కలాట ఆడిన సంబరం..
కుంటుడు బిచ్చలు..
దొంగ పోలీసు..
అబ్బడ దిబ్బడ..
బద్ది..బాల్
చిర్రగోనే..
చిక్కుడు పుల్లా..
ఎం చెప్పను..
చెఱువు చెంతన ఈత ఆటలు..
బడికాడి మైదనంలో కబడ్డీ ఆటలు
మా అక్కల బతుకమ్మ ఆటలు..
మా చెల్లెండ్ల బొడ్డెమ్మ ఆటలు..
అన్ని సినిమా తెర మీద నుంచి
జారుపోతున్న రీళ్లలాగా
అన్ని ఒక్కొక్కటిగా యాదికొచ్చి..
గుండేలు గుబేలుమంటున్నయి..
పూట గడువక..
తోడు తెలవక ..
కాంక్రీట్ జంగట్లో..
మర మనుషుల అంగట్లో.,.
మనసు చచ్చిన బొమ్మనై..
అమ్మకం వస్తువై..
నమ్మకం మరిచిన పస్తునై..
ఏందీ బతుకని..
అవ్వతోడు..
కన్నీళ్లు ఎక్కెక్కి వస్తున్నయి..
అమ్మలాంటి పల్లెను ఇడిచినందుకు..
కల్ముషం లేని మనుషులను మరిచినందుకు..
ప్రాణం లాంటి మట్టిని విడిచి నడిచినందుకు..
అబ్బా ఎం చెప్పాలే పల్లెకు..
అయామ్ సారీ అని చెప్పనా..
నన్ను క్షమించమని అడుగనా..
తప్పైంది అవ్వ అని గుండేకు అత్తుకోనా..
షానీగా చెప్పి ఇగ పరేషాన్ గాను..
సూటిగా ఒక్కటే చెప్త నా పల్లెకు..
అవ్వ నేన్ తప్పు చేసిన నిన్ను విడిచి...
నాది తప్పైతే కొట్టు తిట్టు నీ ఇష్టం..
ఇక నీ దగ్గరికే వస్తున్న..
Cheering work. Many will like it. Thanks.
రిప్లయితొలగించండిBeautiful compilation. Useful and relevant. Thanks.
రిప్లయితొలగించండిAdmirable work. Make another such like it. Thanks.
రిప్లయితొలగించండిwonderfull my dear ramana....
రిప్లయితొలగించండిnice job