తెలుగు మహాసభల్లో తెలంగాణ వైతాళికులకు సరైన గుర్తింపు వచ్చేలా ఏర్పాట్లు సాగాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి, అసెంబ్లీలో వైద్యశాఖపై జోరుగా సాగుతున్న ప్రశ్నోత్తరాల సమయం, /

04 అక్టోబర్, 2011

కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్ విలీనమవుతుందా?
    కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్ విలీనమవుతుందంటూ టీడీపీ, సీమాంధ్ర నాయకులు విష ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్‌కు చెందిన నిజామాబాద్ ఎంపీ మధుయాష్కీగౌడ్ విమర్శించారు. ఉద్యమాన్ని దెబ్బకొ ఈ కుట్ర చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్ విలీనమవుతుందా? లేక పొత్తు పెట్టుకుంటామా? అన్నది రాష్ట్రం వచ్చిన తర్వాతి సంగతని చెప్పారు. ఇప్పుడు ఆ చర్చలు అనవసరమని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో మరో సమస్య ఉత్పన్నం కాకుండా చూసేందుకే తమ పార్టీ అధిష్ఠానం సంప్రతింపుల ప్రక్రియ కొనసాగిస్తున్నదని ఆయన చెప్పారు. ప్రధానంగా సీమాంవూధుల నుంచి ఎలాంటి వ్యతిరేకత వ్యక్తం కాకుండా ఉండేందుకు అన్ని పక్షాలతో సంప్రతింపుల ప్రక్రియను ముగించడానికి మరికొంత సమయం పడుతుందని ఆయన అన్నారు.

ఉద్రిక్తతల నడుమ పరిపూర్ణ నిర్ణయం సాధ్యం కాదు కనుక తెలంగాణ ఏర్పాటుకు కొంత సమయం పడుతుందని ఆయన విశ్లేషించారు. బుధవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్ విలీనమవుతుందంటూ టీడీపీ, సీమాంధ్ర నాయకులు తప్పుడు ప్రచారానికి దిగడం దారుణమని అన్నారు. ఉద్యమాన్ని దెబ్బకొట్టడానికే ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. రాష్ట్ర అవిర్భావానికి అడ్డమైతే ఉద్యమ పార్టీగా పుట్టిన టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేయడానికి తాము సిద్ధమని ఆ పార్టీ అధినేత కే చంద్రశేఖర్‌రావు గతంలోనే ప్రకటించారని యాష్కీ గుర్తు చేశారు. రాష్ట్రం ఏర్పాటు నిర్ణయం జరిగాక విలీనమా? లేక పొత్తా? లేక మరొకటా? అన్న విషయాలపై చర్చలుంటాయి తప్పితే ప్రస్తుత పరిస్థితుల్లో ఆ చర్చ అనవసరమని ఆయన స్పష్టం చేశారు.

తెలంగాణ సాధన కోసం అందరం కలిసి ప్రయత్నిస్తున్నాం తప్ప రాజకీయ అవసరాల కోసం కాదని యాష్కీ తేల్చి చెప్పారు. అందరం ఒక వేదికపై నుంచి పోరాడాల్సిన సమయంలో ఎవరికి వారుగా వ్యవహరించడం సరికాదని అభివూపాయపడ్డారు. ప్రధానంగా టీడీపీ నాయకులు ఒంటెత్తు పోకడలను పక్కన పెట్టి ఉద్యమంలో కలిసి రావాలని అన్నారు. తెలంగాణలోని పరిస్థితుల తీవ్రతను గుర్తించానని ప్రధాని పేర్కొనడం శుభ పరిణామమని మధు యాష్కీ అన్నారు. సీమాంవూధుల అనుమానాలు తొలగించడానికి ప్రధాని వద్ద తాము సంసిద్ధతను వ్యక్తం చేశామని తెలిపారు. దేశంలోని విదర్భ, బుందేల్‌ఖండ్ ఉద్యమాలతో తెలంగాణకు సంబంధం లేదన్న వాస్తవాన్ని ప్రధాని కూడా గుర్తించారని ఆయన చెప్పారు. తెలంగాణ ఉద్యమం ఎన్నో సంవత్సరాల ఉద్యమమని స్వయంగా ప్రధానే తమతో అన్నారని తెలిపారు. తెలంగాణపై నిర్ణయానికి ఇంకెంత సమయం పడుతుందని ప్రశ్నించగా, దసరా ముందే నిర్ణయం జరగాల్సి ఉన్నా కోర్ కమిటీ సభ్యులు ప్రణబ్, చిదంబరం అందుబాటులో లేనందున నిర్ణయం ఆలస్యమవుతుందని చెప్పారు.

దసరా తర్వాత కాంగ్రెస్ కోర్ కమిటీ సభ్యులు తెలంగాణ అంశంపై చర్చించే అవకాశం ఉందని తెలిపారు. ఆ నిర్ణయం తెలంగాణకు సానుకూలంగా ఉంటుందన్న ఆశాభావాన్ని ఆయన వెలిబుచ్చారు. త్వరలో అఖిలపక్షాన్ని పిలిచే అవకాశం ఉందని తెలిపారు. ఆదే సమయంలో ప్రభుత్వం యూపీఏ భాగస్వామ్య పక్షాలతో చర్చలు జరుపుతుందని అన్నారు. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా కొనసాగుతున్న కాలంలోనూ ముఖ్యమంత్రి పార్టీలతో సమస్య పరిష్కారానికి చర్చలు జరపకుండా ఇతరులపై ఆరోపణలు చేయడం దారుణమని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల మధ్య చిచ్చు పెట్టి ఉద్యమాన్ని తప్పు దోవపట్టించడానికి ఆయన తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్‌కు రాజ్యంగ పరంగా విస్తృత అధికారాలున్నందున రాజీనామాలు ఆయన విచక్షణపైనే ఆధారపడి ఉంటాయని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సభ్యులకు గానీ, న్యాయస్థానాలకు గానీ ఆయనను ప్రశ్నించే హక్కు లేదని తెలిపారు.

4 కామెంట్‌లు: