తెలుగు మహాసభల్లో తెలంగాణ వైతాళికులకు సరైన గుర్తింపు వచ్చేలా ఏర్పాట్లు సాగాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి, అసెంబ్లీలో వైద్యశాఖపై జోరుగా సాగుతున్న ప్రశ్నోత్తరాల సమయం, /

15 అక్టోబర్, 2011

మిస్టర్ ఛీప్ మినిస్టర్...!

మిస్టర్ ఛీప్ మినిస్టర్...!

ఒక ప్రశ్న ఉదయించింది

ఒక పిడకిలి పైకెగిసింది.
ఒక నినాదాం గర్జిస్తుంది.

కేసులు పెట్టుకోండి అంటూ...

తెగువ సవాళ్లు విసురుతుంది.

సర్కారు వల్లవుతుందా..?

దిక్కరించిన గొంతులను జైల్లో పెట్టడానికి..

నియంతవల్లవుతుందా..?

నింగికెగసిన చైతన్యాన్ని బంధించడానికి..

మోనార్కుల వల్లవుతుందా ?

మోసాలను కప్పిపుచ్చడానికి

నెవర్..

నిప్పులు కక్కె సూర్యున్ని పట్టుకోవడం

ఉస్పెనలా ఎగిసిపడుతున్న తెలంగాణ ఉద్యమాన్ని 

ఆపడం..

రెండోక్కటే.

ఆనాటి పగిడిద్దరాజు త్యాగం..

నేడు శ్రీకాంత చారి వీర మరణం..

చరిత్ర నుంచి చెరిపెయ్యగలరా..?

జైల్లో బంధీచేయ్యలరా..?

ఆకాంక్షల గొంతుకను
ఆత్మగౌరవ వీచికలను

సొప్ప బెండ్ల లాంటీ నీ సైన్యం..

పూచిక పుల్లలాంటి నీ సేనలు ఆపగలవా..?

బంధూకులను దనుమాడిన బందగీ వారసత్వం

గుత్పలు పట్టి తరిమిన సాకలి ఐలమ్మ సహసం

ఒడిషెలు పట్టి తరిమిన దొడ్డికొమురన్న పౌరుషం

విల్లంబులు ఎక్కుపెట్టిన కోమురం భీం రౌద్రం

వారసత్వమై రక్తం చుక్కచుక్క నిండిఉంటే

నీ కుట్రలు..

నీ కుతంత్రాలు..

నీ ఎత్తులు

నీ ఎస్మాలు..

నీ 177 జీవోలు

నీ అమ్మడాలు కొనడాలు..

అపగలవా మిస్టర్ ఛీఫ్ మినష్టర్...

అయ్యయ్యో ..

ఛీఫ్ కాదు కదా..

ఛీప్ మినిష్టర్....

టెల్ మీ..?
                                                                         -శ్రీపాద రమణ















8 కామెంట్‌లు:

  1. ఆపండి మీ హూంకరింపులు. సమ్మె అయిపోయింది. సీ యం ముందే గట్టి చర్యలు తీసుకొని ఉంటె ఎప్పుడొ మటాష్ అయ్యేది.

    ఆర్టిసి ని వదిలేసారేం బాబూ..తెలంగానా వచ్హెసిందా ?

    రిప్లయితొలగించండి
  2. టూ లేట్ భాయి! సమ్మె మొదలెట్టిన రోజు రాయలసిన టపా కదూ ఇది! స్కూళ్ళు, ఆర్టీసీ ప్రజాగ్రహంతో సమ్మె విరమించాయి నాయనయా! మిగతా వాళ్ళకు కూడా మరోనెల జీతాలు లేక పోతే వాళ్లే మూసుకుని ముందుకొస్తారు ఉద్యోగాలు చేయడానికి.

    సమ్మె ఫెయిలైపోయిందిలే గానీ గమ్మున కూకో!

    రిప్లయితొలగించండి
  3. అమ్ముడు పోయిన ఆర్.టి.సి,స్కూల్ టీచర్ యూనియన్ లీడర్లు, ఫేస్ సేవింగ్ కారణాలు వెతుక్కుంటున్న ఐకాసలు. :))))

    రిప్లయితొలగించండి
  4. Sarfaroshi ki tamanna ab hamare dil me hai, dekhna hai zor kitna bazua-e-qatil me hai.

    రిప్లయితొలగించండి