బాబువి లత్కోర్ రాజకీయాలు:కేసీఆర్
చంద్రబాబు
చంద్రబాబు
ఇంటి పేరు నమ్మక ద్రోహం,
ఒంటి పేరు నయవంచన,
అసలు పేరు కుంభకోణం
అని టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు మండిపడ్డారు.
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చేసే రాజకీయాలన్ని లత్కోర్‌వేనని టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు అన్నారు. ఐదారు రోజులుగా చంద్రబాబు తొట్టిగ్యాంగ్ కారు కూతలు కూస్తుందని మండిపడ్డారు. బాబు చరిత్ర ప్రపంచానికి తెలుసన్నారు. ఆయన అవినీతి, దుర్మార్గాలపై పుంకానుపుంఖాలుగా పుస్తకాలు వచ్చాయని చెప్పారు. . అడుగుదీసి అడుగెస్తే బాబుది బినామీ బతుకు అని దుయ్యబట్టారు. తాను హెరిటేజ్ కంపెనీ, కూరగాయాల కంపెనీ పెట్టుకోలేదని చెప్పారు. అక్రమ సొమ్ము సంపాదించుకునే అలవాటు మీకుందని చెప్పారు. తాను నమస్తే తెలంగాణ దిన పత్రికలో రూ.4 కోట్లు, టీ న్యూస్‌లో రూ. 55 లక్షలు పెట్టుబడులు పెట్టానని తెలిపారు. ఈ డబ్బంతా మాజీ ఎంపీ వినోద్ తమ్ముణ్ణి వద్ద అప్పు తీసుకున్నానని పేర్కొన్నారు. తాను పెట్టిందంతా వైట్ మనీ అని స్పష్టం చేశారు. నమస్తే తెలంగాణ ఎండీకి తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఆయనకు బయట వ్యాపారాలు ఉంటే మేం ఏం చేయాలని ప్రశ్నించారు. అది ఆయన వ్యక్తిగతమని చెప్పారు. బాబులా నల్లధనంతో పెట్టుబడులు పెట్టలేదని విమర్శించారు. తెలంగాణకు ఒక పత్రిక ఉండొద్దు, మీ బండారం బయటపడొద్దని కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీపై పరువు నష్టం దావా వేస్తామన్నారు. తనకు ఉన్నది 24 ఎకరాల భూమేనని, హైదరాబాద్, కరీంనగర్‌లో ఒక ఇళ్లు మాత్రమే ఉందని తెలిపారు. బినామీలు పెట్టుకోవాల్సిన అవసరం తనకు లేదన్నారు. తెలంగాణ టీడీపీ నేతలు ఆత్మలు అమ్ముకుని బాబు బూటు పాలీష్ చేస్తున్నారని ఆరోపించారు. యూపీఏలో మంత్రిగా ఉన్నప్పుడు పోలవరంపై సోనియాకు ఫిర్యాదు చేశానని స్పష్టం చేశారు. పోలవరంపై నిరంతరం కొట్లాడేది టీఆర్‌ఎస్ పార్టీ అని తెలిపారు. పోలవరంపై హై కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు వెళ్లాం అని తెలిపారు. టెండర్లు వేసే అలవాటు బాబుకు ఉందన్నారు. తన జీవితంలో ఇంతవరకు ఎలాంటి టెండర్లు వేయలేదని చెప్పారు. పోలవరంపై టీడీపీ వైఖరెంటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుది నకిలీ, వెకిలీ పాలన అని దుయ్యబట్టారు. మద్యం కుంభకోణంలో హై కోర్టుకు పోయి బాబు స్టే తెచ్చుకోలేదా అని ప్రశ్నించారు. బాబు ఫోటో పక్కల అన్నా హజారే ఫోటోను చూసి దయ్యాలు నవ్వుతాయన్నారు
Efficient job. Worthy of applause. Thanks.
రిప్లయితొలగించండిUnique idea. Make it persistent. Thanks.
రిప్లయితొలగించండిNice article. Unique thinking. Thanks.
రిప్లయితొలగించండి