తెలుగు మహాసభల్లో తెలంగాణ వైతాళికులకు సరైన గుర్తింపు వచ్చేలా ఏర్పాట్లు సాగాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి, అసెంబ్లీలో వైద్యశాఖపై జోరుగా సాగుతున్న ప్రశ్నోత్తరాల సమయం, /

30 అక్టోబర్, 2011

గెలుపును గుప్పిట పట్టు


గెలుపును గుప్పిట పట్టు!

మేఘాలు కమ్ముకొస్తున్నయని బెంగవద్దు


అలలు ఎగసిపడుతున్నయని భయం వద్దు..


హోరుగాలులు వీస్తున్నయని జంకు వద్దు..


పిడుగులు దడేలుమనిపిస్తున్నయని వణకు వద్దు..


వాటి పని అవి చేస్తున్నప్పుడు..

తిరగబడే నీ గుణాన్ని


తరిమికొట్టె నీ ధైర్యాన్ని

నువ్వెందుకు విస్మరిస్తావ్..


నువ్వె కదా పోరాడాల్సింది..

నువ్వె కదా విజేతగా నిలవాల్సింది..


నువ్వె కదా విజయ బావుటా ఎగరవేయాల్సింది..


ఎందుకు నీ కళ్లలో అపనమ్మకం?

ఇంకేందుకు ఆ గుండేలో సంశయం?

వేళ్లు బిగిసుకుపోయి పిడికిలవుతుంటే..


పాదాలు కదనానికి కాలుదువ్వుతుంటే..


కర్తవ్యాన్ని మరిచి..


చేయాల్సిన క్రియలు విడిచి..


ఎందుకు భయపడతావ్..?


గెలుపును ఒడిసిపట్టాలనే కదా..


నీ పోరాటం..


ఓటమి అంతు చూడలనే కదా

నీ ఆరాటం..

ఓటమి ఎదురైందని కుంగిపోతే..


ఎదురుదెబ్బ తగిలిందని కృషించిపోతే..


అడ్డంకులు ఎదురవుతున్నయని ఆగిపోతే..


నువ్వు విజయాన్ని శోధించే విద్యార్థివి ఎలా అవుతావు..


ఓటమిపై దండెత్తే వీరుడవు ఎలా అవుతావు..


రానీ ఎన్ని ఓటములు వస్తాయో..


తాకనీ ఎన్ని ఎదురుదెబ్బలు తగులుతాయో..


ఉలి చీల్చనని మొండికేస్తే శిల శిల్పం ఎలా 

అవుతుంది..


మొగ్గ విచ్చుకోనని తెగెస్తే పువ్వు ఎలా 

పరిమలిస్తుంది..


కష్టం లేకుండ సుఖం లేదు..


బాధ లేకుండ సంతోషం లేదు..


కన్నీళ్లు లేకుండ చిరునవ్వులు లేదు..


చెమట చుక్కలు రాల్చకుండ చరిత్ర లేదు..

తిరగబడి యుద్దం చేయకుండ స్వేచ్ఛా లేదు..


ఇన్ని సత్యాలు కళ్ల ముందు కదలాడుతుంటే..


ఎందుకు కుంగి పోతావు..


లే..


లే..


బిగించే పిడికిలి..


తెగించే తెగువను..


తట్టి లేపు..


ఓటమి అంతు చూసి


గెలుపును గుప్పిట పట్టు..


బెస్ట్ ఆఫ్ లక్.
                                                                                                                    

7 కామెంట్‌లు:

  1. చాలా స్పూర్తినిస్తోంది మీ కవిత. బాగుందండి.

    రిప్లయితొలగించండి