తెలుగు మహాసభల్లో తెలంగాణ వైతాళికులకు సరైన గుర్తింపు వచ్చేలా ఏర్పాట్లు సాగాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి, అసెంబ్లీలో వైద్యశాఖపై జోరుగా సాగుతున్న ప్రశ్నోత్తరాల సమయం, /

11 నవంబర్, 2011

నీ కోసం ....

 నవ్వులు పువ్వుల్లా విరబూయాలి...
కన్నులు చుక్కల్లా మెరువాలి...
పెదాలు మందాలరలై మురియాలి..
నిన్ను తాకే ప్రతి స్పర్శ...
తన అనుభూతిని మరచిపోవాలి..
నిన్ను మురిపించాలని వీచే చిరుగాలి..
తనే మైమరచిపోవాలి..
నిన్ను ఆనంద సాగరంలో ముంచెత్తాలని తపనపడే..
ఆలల సోయాగం...
నీ ఆత్మీయత ప్రవహనికి అచ్చెరువొందాలి..
నీ మనసును నిండాలని ఆరాటపడే వెన్నెల..
తనను తాను నిండిపోవాలి...
ఒక ఉషోదయానికి పరిచయం అక్కరలేదు..
ఒక ఊహకు చిరునామ అక్కరలేదు..
ఒక స్నేహనికి మాటలు అక్కరలేదు..
స్నేహం భాష లేని భావం..
స్నేహం తన..మన అన్న తేడాలేని త్యాగం..
స్నేహం నమ్మకాల నిలయం..
స్నేహం ఆత్మీయతల ఆలయం..
నచ్చితే ప్రాణం...
చెప్పడానికి మాటలు లేని బంధం...
నీ కోసం ....
నీ నేస్తం...

6 కామెంట్‌లు: