తెలుగు మహాసభల్లో తెలంగాణ వైతాళికులకు సరైన గుర్తింపు వచ్చేలా ఏర్పాట్లు సాగాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి, అసెంబ్లీలో వైద్యశాఖపై జోరుగా సాగుతున్న ప్రశ్నోత్తరాల సమయం, /

06 డిసెంబర్, 2011

వాచ్ డాగ్ సర్వే..


ప్రపంచంలో నిజాయితీ పరులైన ప్రజలు ఎక్కడున్నరో తెలుసా..? చేయితడపకుండ పనిముట్టని లంచగొండులెవరో తెలుసా.?  లంచగొండుల దేశాల్లో మన ప్లేసేంటో తెలుసా..?  అయితే ఓసారి జర్మన్ వాచ్ డాగ్ ఆర్గానైజేషన్ జరిపిన సర్వే చూడండి.
లంచం.. ఈ మాట వింటే చాలు జనం హడలెత్తిపోతున్నరు. జేబులు తడుముకొని పరేషాన్ అవున్నరు. అడిగినంత ఇచ్చుకోకుంటే పనులు జరగవని బెంగపెట్టుకుంటున్నరు. తిరిగి తిరిగి చెప్పులు అరిగిపోతయని ఖంగారుపడుతున్నరు.  అందుకే లంచగొండులు అడిగినంత ముట్టచెప్పి పనులు చేయించుకుంటున్నరు. అప్పో సప్పో చేసి కాలం వెల్లదీసుకుంటున్నరు. లంచగొండిల చేతికి చిక్కి విలవిల్లాడిపోతున్నరు. లంచం అన్ని దేశాల్లో ఉంది. అయితే లంచగొండుల్లో ఫస్ట్ ఎవరన్న సందేహం చాల మంది బుర్రలను తొలుస్తున్న టైంలో.. లంచగొండిలపై విస్తృతంగా సర్వే చేసిన జర్మన్ వాచ్ డాగ్ ఆర్గానైజేషన్..ప్రపంచంలో సోమాలియన్లు..నార్త్ కోరియన్లు భయంకరమైన లంచగొండులని తేల్చింది. అంతే కాదు ప్రపంచంలో లంచాలకు దూరంగా ఉండే కంట్రీ న్యూజిలాండ్ అని ర్యాంకింగ్ ఇచ్చింది.
లంచాలకు దూరంగా ఉండే జనాల్ని లెక్కలోకి తీసుకున్న వాచ్ డాగ్ సర్వే..  అతి తక్కువ లంచాలు తీసుకునే కంట్రీగా న్యూజిలాండ్ కు నంబర్ వన్ ప్లేస్ ఇచ్చేసింది. న్యూజిలాండ్ లో కరప్సన్ లీస్ట్ గా ఉందని.. అక్కడి ప్రజలు వృత్తి పట్ల నిబద్దతగా ఉంటారని.. అందుకే లంచాలు లెవ్వని చెప్పింది. ఉన్న అతి కొద్ది లంచగొండుల్లో బ్యాంకు అధికారులే ఎక్కువని రిపోర్ట్ ఇచ్చింది. న్యూజిలాండ్ లో అమలవుతున్న అవినీతి వ్యతిరేఖ చట్టాలు అక్కడి ప్రజల్లో చేతన్యాన్ని తీసుకొచ్చాయని వివరించారు.
ఇక లంచగొండి దేశాల్లో సోమాలియా, నార్త్ కోరియాలో సంయుక్తంగా  182 స్థానాన్ని పంచుకున్నాయి. ప్రతి పనికి ఓ రేటు ఫిక్స్ అయితే తప్ప పనులు కానీ కంట్రీలుగా ఈ రెండు దేశాలు లంచగొండి దేశాలు గా నిలచాయి. నిత్యం గొడవుల.. ఆకలి చావులు.. డ్రగ్స్ స్మగ్లింగ్ తో విలవిల్లాడుతున్న ఈ రెండు దేశాల్లో లంచం ఇస్తే తప్ప పనులు జరుగని దారుణ స్థితికి దిగజారిపోయినయి.
ఇక లంచాలు తక్కువ గా ఉన్న కంట్రీలో లిస్ట్ లో
1)న్యూజిలాండ్
2)డెన్మార్క్
3) ఫిన్ లాండ్
4) స్వీడన్
5) సింగపూర్
6) నార్వే
7) నెథార్ లాండ్
8) ఆస్ట్రేలియా
9) స్విజ్జర్ లాండ్
10) కెనాడా
టాప్ టెన్ ప్లేసుల్లో నిలవగా ...
అమెరికా 25 వ స్థానం
చైనా 75వ స్థానంతో తో సరిపెట్టుకున్నాయి.
ఇప్పటికే అవినీతి ఉద్యమాలతో ధూందుమారంగా ఉన్న మన దేశానికి 95 స్థానం దక్కింది. మరోవైపు పాకిస్థాన్ 134  స్థానంతో లంచగొండుల దేశంగా నిలిచింది.
వ్యవస్థ పట్ల పౌరునికి భాధ్యత లేనంత వరకు.. లంచాలను రూపుమాపడం సాధ్యం కాదని సర్వే తేల్చిచెప్పింది.

11 కామెంట్‌లు: