తెలుగు మహాసభల్లో తెలంగాణ వైతాళికులకు సరైన గుర్తింపు వచ్చేలా ఏర్పాట్లు సాగాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి, అసెంబ్లీలో వైద్యశాఖపై జోరుగా సాగుతున్న ప్రశ్నోత్తరాల సమయం, /

07 డిసెంబర్, 2011


నాయకుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం బాబుల్ గావ్.





స్వాతంత్ర్యం సాధించి ఆరున్నర దశాబ్ధాలు గడుస్తున్న ఇప్పటికి దేశంలో చాల గ్రామాలకు కనీస సౌకర్యాలే లేవు. ఇలాంటి దౌర్భగ్యమైన స్థితిలో పడి కొట్టుమిట్టాడుతున్న ఓ కుగ్రామమే నిజామాబాద్ జిల్లా జుక్కల్ మండలం బాబుల్ గావ్. 1500 జనాభా కలిగిన ఈ గ్రామానికి ఇప్పటికి దారి లేదు.. కరెంట్ లేదు.. రక్షిత మంచినీరు లేవు.. రోగమోస్తే ఆదుకునేందుకు ఓ డాక్టర్ గానీ.. ఆసుపత్రిగానీ లేవ్వు.  ఉన్న చిన్నపాటి స్కూల్ కు టీచర్లు ఏ పదిరోజులకొసారిగాని రారు. సకల దారిద్ర్యాలు ఒకేచోట నివసిస్తే ఎలా ఉంటదో.. బాబుల్ గావ్ అచ్చం అలానే ఉంది. బాబుల్ గావ్ ప్రజల కష్టాలు అన్ని ఇన్ని కావు. రోగాల బారిన అనేక మంది చనిపోతున్న అధికారులు ఇప్పటికి స్పందించిన పాపన పోవడంలేదు. ఇక గ్రామాన్ని చుట్టుముట్టిన కౌలస్ వాగు దాటలంటే బ్రిడ్జి లేక అనేక మంది రోగులు కళ్లముందరే ప్రాణాలు విడుస్తున్నరు. ఎన్ని ప్రభుత్వాలు మారినా తమ బతుకులు మాత్రం మారటం లేదంటున్నరు బాబుల్ గావ్ గ్రామస్తులు.. సర్కారు అధికారుల తీరు పట్ల తీవ్ర మనోవేదనకు గురవుతన్నరు బాబుల్ గావ్ పల్లే జనం. అధికారులు.ప్రజాప్రతినిధులు
స్పందించి తమ గ్రామానికి బ్రిడ్జితో పాటు కనీస సౌకర్యాలు కల్పించాలని 
కోరుతున్నరు.

నోట్..


డియర్ ఫ్రెండ్స్.. నాయకులంతా విశ్వాసం.. అవిశ్వాసం అంటూ అసెంబ్లీలో 

ఒకరిని ఒకరు తిట్టుకుంటు టైంపాస్ చేస్తుంటే నిలదీయాల్సిన మనం.. ఎగ్జైట్ గా 

టీవి స్ర్కోలింగ్ లు బ్రెకింగ్ లు చూస్తుండబట్టే బాబుల్ గావ్ పరిస్థితి ఇలా 

తగులబడింది. గొంతున్నవారు కనీసం ప్రశ్నించే ప్రయత్నం చేయండి.. సోసల్ 

నెట్ వర్కింగ్ లో గంటలు గంటలు గడిపే సోదరసోదరిమణులు ఇలాంటి దీనమైన 

బ్రతుకుల గురించి విస్తృతంగా ప్రచారం చేయండి. చివరికి ఈ ప్రయత్నమైన 

బాబుల్ గావ్ ప్రజల బతుకుల్లో వెలుగులు నింపుతుందని ఆశగా ఎదిరిచూద్దాం.


16 కామెంట్‌లు:

  1. hello నా పేరు వేణు మీరు చాల నిజాలు చెప్పారు ఇవి నిజంగా ఆచరించాదగ్గవే నేను తప్పకుండ ఫాలో అవుతాను. నేను మీ బ్లాగ్ ను backlink ఇచుకుందాం అనుకుంటున్నాను. దయచేసి రిప్లై ఇవ్వండి.to venujustforu@gmail.com

    రిప్లయితొలగించండి
  2. @World Bookmarking Shop
    @ Great Article Submission

    http://youtu.be/iw19BJ2rm68

    Please forward the above link to your friends via facebook

    thanks
    ?!

    రిప్లయితొలగించండి
  3. Hai friend Nice work. I appreciate it. its should have useful to every one. Good Idea.All the beast Keep going...Iam realy very happy to do these things...Thanku...Dear...

    రిప్లయితొలగించండి