తెలుగు మహాసభల్లో తెలంగాణ వైతాళికులకు సరైన గుర్తింపు వచ్చేలా ఏర్పాట్లు సాగాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి, అసెంబ్లీలో వైద్యశాఖపై జోరుగా సాగుతున్న ప్రశ్నోత్తరాల సమయం, /

13 డిసెంబర్, 2011


మాంచి నటులు మన నాయకులు...కాదంటరా?







డిసెంబర్ 13 , 2001 భారత ఆత్మలాంటి పార్టమెంట్ పై జైష్ ఏ మహ్మద్ ఉగ్రవాదులు దాడిచేసారు. ఈ దాడిలో  ఐదుగురు ఢిల్లీ పోలీసు సిబ్బంది, ఒక సీఆర్‌పీఎఫ్ మహిళతో పాటు మొత్తం తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 12 మంది గాయపడిన విషయం తెలిసిందే.
ఈ ఘటన జరిగి నేటికి పదేళ్లు నిండిన సందర్భంగా పార్లమెంట్ ఉభయసభల సభ్యులు అమర వీరులకు నివాళులర్పించారు. నివాళులర్పించిన వారిలో అమరుల త్యాగాలను అవమానం చేసిన.. చేస్తున్నా.. సుప్రీం తీర్పును పెడచెవిన పెట్టిన..పెడుతున్నా సర్కారు పెద్దలు శ్రీమతి..తీవ్రవాదుల బహుమతి సోనియా గాంధీగారు. ప్రధాని.. అపప్రధాని మన్మోహన్ సింగ్.. ఆర్ధిక...అనర్ధాల మంత్రి ప్రణబ్ ముఖర్జీ.. చిక్కుల చిదంబరం.. చెంచాలు.. పేట్లు లాంటి పెద్దలందరు పాల్గోని.. మిమ్మల్ని మేమే చంపాము.. దయచేసి మమ్మల్ని క్షమించండి అని వేడుకున్నరు.
  అంతేనా ఫోటో గ్రాఫర్లు..లేరు కదా అని చూసుకొని చమక్కులు విసురుకున్నారు.. చిరున్వులు నవ్వుకున్నారు.. ప్రాణాల్ని మింగడంలో.. కక్కడంలో నిపుణురాలైన సోనియాజీ.. ఎవరినో మింగే పనిలో ఉండి కాస్తా ఆలస్యంగా వచ్చినంటున్నారు. మొత్తానికి తమ నకిలీ మానవత్వం ప్రదర్శించి మనలాంటి పిచ్చి జనంతో జేజేలు కొట్టించుకునేందుకు పెద్ద సమస్యలేకుండ సింగిల్ టేక్ లో కంప్లీట్ చేసుకొని.. జర్నలిస్టులను.. జనాన్ని ఔరా.. అనిపించారు. సిగ్గు......-.... లేవని చెప్పకనే ఎంతో చాకచక్యంగా చెప్పారు.
గమనిక:- అమరులకు నివాళులర్పిస్తున్నారు కదా.. అందుకే పార్లమెంట్ పై దాడి లో కీలక పాత్ర పోషించిన అఫ్జల్ గురుకు నెలకు కోటిన్నర దాక ఖర్చుపెట్టి ( ఒక జర్నలిస్ట్ సోదరుడు చెప్పిన మాట.. కొంచెం అటు ఇటుగా ఉండవచ్చు తప్పుగా అనుకోవద్దు.) పెంచి ఇంటి అల్లుడిలా.. బంగారు కొండలా.. ఇంత ఆరోగ్యం చెడిపోకుండా.. మనసుకు ఇబ్బంది కలగకుండా ..ప్రొటెక్షన్ తగ్గకుండా పసిపిల్లాడిలా చూసుకుంటున్నారు.
సోదరులారా.. ఓట్లేసినం.. సీట్లిచ్చినం.. వాళ్లు చేసే---- పనులు చూస్తే పిచ్చోళ్లలాగా ఉండాల్సిందే.. లేదంటే బతుకులను బర్ బాద్ చేస్తరు జాగ్రత్తా...



  



10 కామెంట్‌లు: