తెలుగు మహాసభల్లో తెలంగాణ వైతాళికులకు సరైన గుర్తింపు వచ్చేలా ఏర్పాట్లు సాగాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి, అసెంబ్లీలో వైద్యశాఖపై జోరుగా సాగుతున్న ప్రశ్నోత్తరాల సమయం, /

08 జనవరి, 2012


ఇదీ ఆసుపత్రే.. నమ్మాలి అంతే.






ఇది నల్లగొండ జిల్లా కేంద్రంలోని  కేంద్ర ప్రభుత్వ  ఆసుపత్రి   జిల్లా నలుముల ఉన్న పేద ప్రజలకు   కొంతలో కొంత మెరుగైన వైద్యం  అందించే ఏకైక ఆసుపత్రి..   పోయిన  సంవత్సరంలో మే నెలలో ఈ  ఆసుపత్రి స్దాయిని  250 పడకలనుంచి  400  పడకలకు పెంచుతున్నట్లు  స్వయాన ప్రభుత్వమే  నిర్ణయం తీసుకుంటూ  జీఓ లను   విడుదల చేసింది..  ప్రభుత్వం  జీఓ విడుదల చేసి  ఎనిమిది నెలలు కావస్తున్నా ఇప్పటి వరకూ ఒక్క పైసా  నిధులు విడుదల కాలేదు.. ఒక్క  అదనపు సిబ్బందిని గానీ , డాక్టర్లను , వసతులను కానీ ఏర్పాటు చేయలేదు. దీంతో   ఆసుపత్రికి  వచ్చే రోగులకు సరైన వైద్యం అందక  సౌకర్యాలు నేలపైనే పడుకుంటున్నరు. మాములు వాళ్ల సంగతి అలా ఉంచితే  ప్రసవం కోసం వచ్చే మహిళలు పడకలు లేక నేలపైనే పడుకుంటూ పడరాని పాట్లు పడుతున్నరు. పేరు గోప్ప ఊరు దిబ్బ అన్న చందంగా పేరుకేమో  పెద్దఆసుపత్రి వసతులేమో చిన్నసుపత్రి అన్నట్లు తయారైందని రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్కారు నిర్లక్ష్యంతో ఆసుపత్రికివచ్చిన  వైద్య సదుపాయాలు సౌకర్యాలు లేక   విలవిల లాడుతున్నమని ఆవేదన చెందుతున్నరు.

1 కామెంట్‌: