తెలుగు మహాసభల్లో తెలంగాణ వైతాళికులకు సరైన గుర్తింపు వచ్చేలా ఏర్పాట్లు సాగాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి, అసెంబ్లీలో వైద్యశాఖపై జోరుగా సాగుతున్న ప్రశ్నోత్తరాల సమయం, /

19 జనవరి, 2012

పాపం జూ.డా లు


డాక్టర్ల పరిస్థితి ఇలా ఉంటే రోగులకు సేవలెలా..?






     నిత్యం పేదల సేవలో మునిగిపోయే  వరంగల్ జూనియర్ డాక్టర్లు.. సర్కారు నిర్లక్ష్యం పుణ్యానా.. ఇలా రోడ్డెక్కి నిరసన తెలుపాల్సిన దుస్థితి దాపురించింది. లక్షల కోట్ల ప్రాజెక్టులు కట్టేందుకు లాగాయించి పరుగులు పట్టే సర్కారు పెద్దలు.. చదువుకుంటాం ఇన్ని స్కాలర్ షిప్ లు, ఫెల్లోషిప్ లు ఇవ్వమంటే నిర్లక్ష్యం చేయడంతో హాస్పటల్ లో రోగులకు సేవలు చేయాల్సిన డాక్టర్లు..రోడ్డుమీద ఉద్యమం చేస్తున్నారు. తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం నల్లడ్రస్సులు ధరించి నిరసన ప్రదర్శన చేస్తున్నారు. ప్రభుత్వానికి ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోవడం లేదని జూడాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్కారు మొండివైకరికి నిరసనగా నోటికి నల్ల గుడ్డలు కట్టుకుని మౌన ప్రదర్శన చేశారు.  కాకతీయ మెడికల్ కాలేజీ నుంచి ఎంజిఎం వరకు సాగిన ర్యాలీలో వందలాది మంది జూనియర్ డాక్టర్లు పాల్గొన్నారు. ఎయిమ్స్ తరహాలో తమకూ స్టయిఫండ్ చెల్లించాలని, ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా అన్ని వసతులు కల్పించాలని ప్లకార్డులు ప్రదర్శించారు. శిక్షణా కాలాన్ని కూడా సర్వీసులో భాగంగా పరిగణించాలని కోరారు. 

NOTE :  సర్కారు తక్షణం స్పందించి జూ.డా ల సమస్యలు పరిష్కరించకుంటే.. ఈ ప్రభావం పేద రోగుల వైద్యంపై పడే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా మొద్దనిద్రవీడి వైద్యవిద్యార్ధుల సమస్యలు పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి