తెలుగు మహాసభల్లో తెలంగాణ వైతాళికులకు సరైన గుర్తింపు వచ్చేలా ఏర్పాట్లు సాగాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి, అసెంబ్లీలో వైద్యశాఖపై జోరుగా సాగుతున్న ప్రశ్నోత్తరాల సమయం, /

08 జనవరి, 2012

చూసుకుందాం రండి...


చూసుకుందాం రండి...






టైగర్ ప్రాజెక్టును రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ ఆదివాసులు ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ ను ముట్టడించారు.  ప్రాజెక్టు వ్యతరేఖ నినాదాలతో ఆదిలాబాద్ కలెక్టరేట్  ను హోరెత్తించారు. బలవంతంగా మా మా భూమి నుంచి.. మా ఆత్మనుంచి మమ్మల్ని వేరు చేస్తే జోడేఘాట్ తరహాలో తిరగబడతమని గర్జించారు. టైగర్ ప్రాజెక్టు పేరుతో కవ్వాల్ అడవినుంచి తమను పంపించి అనాథాలను చేయాలని చూస్తే కొమరంభీం వారసత్వ సత్తాను చూపుతామని హెచ్చరించారు. తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం, బతుకుతున్న నేల కోసం ఎంతకైనా తెగిస్తామని... ఉన్న ఊరు-కన్నతల్లితో ఉన్న  అనుభంధాన్ని తెంచాలని చూస్తే యుద్ధమే అవుతుందని ఆదివాసులు తేల్చిచెప్పారు. టైగర్ ప్రాజెక్టు పేరుతో అభయారణ్యంలో 41 ఊర్లను ఖాళీ చేయాలని సర్కారు చేస్తున్న దుష్ట ప్రయత్నాలను తిప్పికొడతామని.. తమ బతుకులను ఆగం చేస్తే చూస్తూ ఊరుకోమని నిప్పులు చెరిగారు.  పోలీసులు మితిమీరి వ్యవహరిస్తున్నారని వారి వ్యవహార శైలి రౌడీలను తలపిస్తున్నదని గిరిజన నేతలు ఫైర్ అవుతున్నారు. ప్రాజెక్టు కోసం తమ  గూడెంలో  విష సర్పాలు వదులుతున్నారని, పులులను వదిలి భయపెట్టిస్తున్నారని ఆవేదన చెందుతున్నారు.  రాజ్యాంగం కల్పించిన గిరిజన చట్టాలను సర్కారే యధేచ్ఛగా ఉల్ల్లంఘిస్తున్నదని, గిరిజన నేతలు విమర్శిస్తున్నారు.  దేశంలో ఉన్న అభయారణ్యాల్లో  పులుల సంఖ్య తగ్గిపోతుంటే పట్టించుకోని అటవీశాఖ అధికారులు.. కొత్త ప్రాజెక్టును ఎట్ల కడతరని నిలదీస్తున్నరు. సర్కారు వైకరి మారకుంటే తాడోపేడో తేల్చుకునుడేనని ఆదివాసీలు ప్రకటించారు. సర్కారుకు వ్యతిరేఖంగా నినాదాలు చేస్తున్న ఆదివాసి కార్యకర్తలపై పోలీసులు జులుం చూపించిన్రు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత, ఎమ్మెల్యే జోగు రామన్న తదితర నేతలు పాల్గోని ఆదివాసుల పోరాటానికి పూర్తి మద్దతు ప్రకటించారు.

1 కామెంట్‌: