తెలుగు మహాసభల్లో తెలంగాణ వైతాళికులకు సరైన గుర్తింపు వచ్చేలా ఏర్పాట్లు సాగాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి, అసెంబ్లీలో వైద్యశాఖపై జోరుగా సాగుతున్న ప్రశ్నోత్తరాల సమయం, /

22 జనవరి, 2012

కడుపుకొడితే ఎవ్వడైనా ఒక్కటే..(తన్ని తరిమేయాల్సిందే)


కడుపుకొడితే ఎవ్వడైనా ఒక్కటే..(తన్ని  
తరిమేయాల్సిందే)



ఆదివాసీలు కదం తొక్కారు. ఖమ్మం జిల్లాను నినాదాలతో హోరెత్తించారు.  కొండకోనల నుంచి పట్టణంలో అడుగుపెట్టి హల్చల్ చేశారు. ఆత్మగౌరవ కోసం బాణాలు ఎక్కుపెట్టారు. వేటగాళ్ల దెబ్బ ఎట్లుంటదో ఖమ్మం జిల్లా దారులపై ప్రదర్శించిన్రు. అందరిని ఎస్టీల్లో కలిపి ఆదివాసులను ఆగం చేస్తే దుమ్ముదులుపుతమని తేల్చిచెప్పారు. యస్టీ జాబితా నుంచి లంబాడాలను తొలగించాలనే డిమాండ్ చేశారు. లేదంటే ఆదివాసీల తడాఖ చూపెడతమని హెచ్చరించారు. ఆదివాసీల ఆత్మగౌరవం పేరుతో భారీ బహిరంగ సభను  ఖమ్మం పట్టణంలో నిర్వహించారు. మా రాజ్యం మాకే కావాలంటు సర్కారుకు జలక్ ఇచ్చిన్రు. ఆదివాసీ ఆత్మగౌరవసభకు జిల్లా నలుమూలలనుంచి వేలాదిగా ఆదివాసీలు కదంతొక్కినరు.సాంప్రదాయ కొమ్ము నృత్యాలతో, బాణాలతో కనువిందు చేస్తూ సర్ధార్ పటేల్ స్టేడియం నుంచి పెవిలియన్ గ్రౌండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించినరు.
ఆదివాసీల వాదన.
  • ·         1950 నుంచి 1966 వరకు లంబాడాలు ఆంధ్రప్రదేశ్ లో ఓసి జాబితాలో ఉన్నరు.
  • ·         1966 జులై 29 న జీవో నెం 1880 ప్రకారం విద్యాపరంగా లంబాడాలను బిసి జాబితాలో చేర్చడం జరిగింది.
  • ·         1976..1977 లో గవర్నర్ ఆదేశాల ప్రకారం ఆర్టికల్ 309 ద్వారా విద్యాపరంగా యస్టీ జాబితాలో లంబాడాలను చేర్చినరు.
  • ·         ఒక తెగను యస్టీగా గుర్తించే అధికారం పార్లమెంట్ కు మాత్రమే ఉంది. కానీ రాజకీయ ప్రయోజనాల కోసమే లంబాడాలను యస్టీ జాబితాలో చేర్చి ఆదివాసీ కడుపు కొడుతున్నరని మండిపడుతున్నరు.
  • ·         లంబాడాలు యస్టీ కాదంటూ భారత ప్రభుత్వ ట్రైబల్ అప్పేర్స్ వారు నవంబర్ 14 2011 న గుర్తిస్తూ లిఖితపూర్వకంగా ఆదివాసీలకు చెప్పడం జరిగింది. దాని ఆదారంగా ఆదివాసీలు న్యాయపోరాటం చేస్తున్నరు.
లంబాడాలు పొట్టగొడుతున్నరని ఫైర్ అవుతున్న అడవిబిడ్డలు.
  • ·         ఖమ్మం జిల్లా 2008 ఏజెన్సీ డియస్సీ లో 1600 ఉద్యోగాలకు గాను 1100 ఉద్యోగాలు లంబాడాలు దక్కించుకున్నరు.
  • ·         2011 ఐటీడీఏ ప్రత్యేక డియస్సీ లో 100 ఉద్యోగాలకు గాను 86 ఉద్యోగాలు లంబాడాలు దక్కించుకున్నరు.
  • ·         అటవీభూములు ఆదివాసీలకంటే లంబాడాలే ఎక్కువ లబ్ధి పొందినరు. దాంతో అనేక రంగాల్లో ఆదివాసీ హక్కులను లంబాడాలే అనుభవిస్తున్నారు.

1 కామెంట్‌: