తెలుగు మహాసభల్లో తెలంగాణ వైతాళికులకు సరైన గుర్తింపు వచ్చేలా ఏర్పాట్లు సాగాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి, అసెంబ్లీలో వైద్యశాఖపై జోరుగా సాగుతున్న ప్రశ్నోత్తరాల సమయం, /

22 జనవరి, 2012

ఆదిలాబాద్ అడవుల్లో మరో శబరి


ఆదిలాబాద్ అడవుల్లో మరో శబరి.


అదిలాబాద్ అడవుల్లో నాగోబా జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. డప్పు చప్పుల్లు.. సాంప్రదాయ నృత్యాలతో ఆదివాసీలు నాగోబా జాతరకు తరలివస్తున్నరు. జాతర మొదలైన కొద్ది గంటల్లోనే వేలాది మంది భక్తులు పోటెత్తారు. గంగా జలాలతో మెస్రం వంశీయులు నాగోబాను అభిషేకించి జాతరను షురూ చేసిన్రు. చిమ్మచీకట్లో నాగోబా ఆలయ ప్రవేశం చేశాడు. వేలాది మంది ఆదివాసీల కొలుపులతో నాగోబా జాతర జోరుగా మొదలైంది. పుష్యమాస అమావాస్య ప్రారంభమైన తొలిగడియల్లోనే మెస్రం వంశీయులు జాతరను ప్రారంభించిన్రు. కాలినడకన పవిత్ర గంగా జలాలతో ఇంద్రవెల్లిలోని ఇంద్రాయిదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించిన్రు. ఈ పూజతో నాగోబా జాతర మొదలైంది.
నాగోబా .. గోండుల అతిపెద్ద జాతర కావడంతో మన రాష్ట్రం నుంచే కాక, మధ్యప్రదేశ్, మహారాష్ట్రల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. తమ ఇలవేల్పు  నాగోబాను దర్శించుకొని భక్తులు పులకించిపోతున్నరు. ఎడ్లబండ్లు.. కాలినడకన భక్తులు ఆలయానికి వస్తున్నారు. నాగోబా దైవనామస్మరణతో ఆలయపరిసరాలను హోరెత్తిస్తున్నరు.
జాతరను పురస్కరించుకొని ఆలయాన్ని విద్యుత్ వెలుగులతో అలంకరించిన్రు. కొత్త కుండల్లో తీసుకొచ్చిన పవిత్ర గంగా జలంతో ఆలయం చుట్టు గిరిజన మహిళలు అలుకేసిన్రు. కొబ్బరికాయలు కొట్టి నాగశేషుని కి పూజలు చేసిన్రు. ఆదివాసీల ఇలవెల్పు పడోయోర నాగశేషునికి 70 కిలోమీటర్లు నడిచివెళ్లి తలమడుగు గ్రామంలోని గోదారి నదిలో నుంచి తీసుకువచ్చిన గంగా జలంతో ప్రత్యేక పూజలు చేసిండ్రు. 

పచ్చని చెట్లు కొండకోనల మధ్య జాతర జోరుగా ప్రారంభమైంది. వేలాది 

మంది భక్తులు పడోయోర నాగశేషున్ని దర్శించుకొని 
 
పులకించిపోతున్నరు.


NOTE : జాతర అయితే స్టార్ట్ అయ్యింది కానీ అధికారులు ఏర్పాట్ల వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. భక్తుల కోసం కనీసం సౌకర్యాలు కల్పించలేదు. పేరుకైతే స్టేట్ ఫెస్టివల్ గా ప్రకటించినా నిధులను మాత్రం విడుదల చేయలేదు.

1 కామెంట్‌:

  1. చాలా బాగుంటుంది జాతర.. నేను ఒకసారి వెళ్లాను చాలా ప్రశాంతంగా కొత్తగా ఉంటుంది.

    రిప్లయితొలగించండి