తెలుగు మహాసభల్లో తెలంగాణ వైతాళికులకు సరైన గుర్తింపు వచ్చేలా ఏర్పాట్లు సాగాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి, అసెంబ్లీలో వైద్యశాఖపై జోరుగా సాగుతున్న ప్రశ్నోత్తరాల సమయం, /

28 జనవరి, 2012

ప్రభుత్వాలు మానవత్వం మరిస్తే..


ప్రభుత్వాలు మానవత్వం మరిస్తే..
  
(ప్రజలుతమనుతాముచంపుకోల్సిందే)



పుట్టిన ప్రతి మనిషి నిండు నూరేళ్ళు బతికుండాలని కోరుకుంటాడు. కానీ కరీంనగర్ జిల్లాలో కట్ల శ్రీనివాస్ మాత్రం తనకు కారుణ్య మరణాన్ని ప్రసాదించండంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాడు. చికిత్సలేని రోగంతో గత 22 సంవత్సరాలుగా అనుభవిస్తున్న నరకయాతన నుంచి తనకు విముక్తి ప్రసాదించాలని విజ్ఞప్తి చేస్తున్నాడు. కండరాల క్షీణతతో జీవచ్చవంలా మారి.. సర్కారు సహాయం లేక  MERCY KILLING కోరుతున్నడు 
 కరీంనగర్ లోని హౌజింగ్ బోర్డు కాలనీకి చెందిన శ్రీనివాస్ 1988లో డిగ్రీ చదువుతున్నప్పుడు కండరాల క్షీణత (మస్క్యూలర్ డిస్ట్రోఫి) వ్యాధి సోకింది. ఎన్ని ఆస్పత్రులు తిరిగిన ఫలితం లేదు. లక్షలు ఖర్చు చేసిన రోగం నయం కాలేదు. దీంతో అతను గత 22 సంవత్సరాలుగా మంచానికే పరిమితమై జీవచ్చవంలా బతుకుతున్నాడు. చేతుల్లో కొద్దిగా చలనం ఉన్న.. కాళ్ళు పూర్తిగా చచ్చుబడిపోయాయి. ప్రస్తుతం ఎవరి సహాయం లేకుండా కదలలేని స్థితిలో ఉన్న శ్రీనివాస్ కు తల్లిదండ్రులే సేవలు చేస్తున్నారు. చికిత్సలేని రోగంతో బాధపడుతున్న తాను చావడానికి సిద్దంగా ఉన్నానని.. ప్రభుత్వం కారుణ్య మరణం (MERCY KILLING) ప్రసాదించాలని శ్రీనివాస్ వేడుకుంటున్నాడు. తనలాగా ఇతరులు నరకయాతన పడకుండా తన శరీరాన్ని వైద్య పరీక్షల కోసం ఉపయోగించుకొని ఈ వ్యాధికి మందు కనుక్కోవాలని కోరుతున్నాడు. చూసారా చావులోను తన మానవత్వం చాటుకున్న శ్రీనివాస్ ను బతికించాల్సిన భాధ్యత సర్కారుది.. అంతకన్నా సమాజానిది.
ఇక కొడుకు వేదన చూసి చలించిపోతున్న దల్లిదండ్రులు మనసున్న దాతలేవరైనా తన బిడ్డను ఆదుకోమ్మని వేడుకుంటున్నారు.

NOTE: శ్రీనివాస్ కు వచ్చిన వ్యాధి మస్క్యూలర్ డిస్ట్రోఫి.. కండరాల క్షీణత ఇది ఒక ప్రాణాంతక వ్యాధి. ఈ వ్యాధి సోకితే కండరాలన్నీ శుష్కించి, చివరికి ప్రాణాలు కూడా హరిస్తాయి. ఇప్పటి వరకు ఈ వ్యాధిని సంపూర్ణంగా నయం చేసే చికిత్సను కనిపెట్టలేదు.

1 కామెంట్‌: