అంబెద్కర్.. నిత్యచైతన్యం!
గుణపాలు కూల్చలేవు చైతన్యాన్ని
కుట్రలు కదిలించలేవు..
త్యాగాల పునాదులను
కుతంత్రాలు పెకలించలేవు..
దళిత బహుజనుల ప్రతిరూపాన్ని
చీకట్లు కమ్ముకోలేవు వెలుగుల ప్రస్థానాన్ని
అదిరింపులు ఆపలేవు..
అకాశమంత ఆత్మభిమానాన్ని
బెదిరింపులు నిలువరించలేవు..
తెగించి కొట్లాడిన వీరుణ్ణి
పిడికిళ్లు బిగించిన చేతులవి..
అగ్రవర్ణల ఎత్తులపై పిడిగుద్దులు గుద్దిన ధైర్యమది..
ఒక్క విగ్రహం కూల్చితే..
చరిత్ర నుంచి చెరిగిపోవునా..?
ఒక్క చేయి విరగ్గొడితే..
అనంతమంత కీర్తి చెదిరిపోవునా..?
అసంతృప్తి కుక్కలు..
కలుపు మొక్కలు..
సమాజానికి అక్కరలేని చిల్లర వ్యక్తులు..
చేసే పిచ్చి పనులు..
అంబెద్కర్ కీర్తికి ఇసుమంతైనా భంగం కాదు..
అదీ అంబోతుల వెకిలి చేష్టలకు గురుతులు..
చాలా బావుంది మీ కవిత.. నిజంగా అంబెద్కర్ ను అవమానించడం అన్యాయం. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.
రిప్లయితొలగించండిTammudu kavitha chaala chaala baagundi ee vidanga kulam.matham mathulo nidristunna endaro neechulaku nuvvu raase prathi vaakyam kalluteripinchela undaalani aashistu
తొలగించండిG.Raju
M.A.,Ph.D
Osmania University