నేతాజీని స్మరించేది ఇలాగేనా..?
నేతాజీ సుభాష్ చంద్రబోస్
( జననం : జనవరి 23 , 1897 .మరణం తెలియదు)
వీరుడికి మరణం లేదు అన్న మాట నేతాజీ సుభాష్ చంద్రబోస్ కి
అచ్చుగుద్దినట్టు సరిపోతుంది . ఉహ తెలిసినప్పటినుంచి నీతి నిజాయితితో
దేశం కోసం పోరాడిన అతి కొద్దిమంది ఉద్యమకారుల్లో సుభాష్ చంద్రబోస్
ప్రముకులు. ఒక్క ముక్కలో చెప్పాలంటే గాంధీజీ కన్నా మిన్న నేతాజీ. ఈ
దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు వదిలిపెట్టి వెళ్ళారంటే.. మనం అనుకుంటున్నట్టు
అహింస ఒక్కటే కాదు.. నేతాజీ ఆజాద్ హింద్ ఫౌజ్ కూడా కారణం. అంతే
కాదు స్వాతంత్ర్య పోరాటంలో గాంధీజీ బండుప్ర్రేతికి బాటాలేస్తే..నిస్వార్దంగా
పోరాడిన గొప్ప ఉద్యమకారుడు నేతాజీ. నేతాజీ గురించి చెబుతున్నానంటే
గాంధీజిని తక్కువ చేయడం కాదు.. నేతాజీ ఔన్నత్యాన్ని గుర్తించడమే అన్న
సంగతి విస్మరించకూడదు. ఇక బ్రిటిష్ వాళ్ళు నేతజిని ఇస్తామని హామీ
ఇస్తేనే స్వతంత్రం ఇస్తామని చెప్పారంటే నేతాజీ వాళ్ళ గుండెల్లో ఎలా
నిద్రపోయరో అర్ధం చేసుకోవలసిందే.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి