ఇదీ జీవితం..
పాలకుల నిర్లక్ష్యంతో పల్లెల్లో ఉపాధి కరువైంది.
దాని ప్రభావం బతుకుపై పడింది. ఫలితంగా
దుబాయి, సౌదీ, గల్ఫ్ ఫ్లైట్ ఎక్కక తప్పని పరిస్థితి .
దళారులను నమ్మి బతుకు బాట పట్టినా..
అక్కడ ఉపాధిదొరుకుతుందన్న గ్యారంటీ లేదు.
అక్కడ ఉపాధిదొరుకుతుందన్న గ్యారంటీ లేదు.
ప్రాణాలతో తిరిగి వస్తమన్న నమ్మకం లేదు.
అలా ఎంతో మంది జీవితాలు దళారుల దళాలి
మాటలకు బలైపోయినయి. అందుకే కరీంనగర్
బస్టాండ్ నుంచి మొదలైన కన్నీటి ధార…
సౌదీ ఎయిర్ పోర్ట్ లో దిగేంత వరకు ఆగదు.
అంతేనా.. అమ్మ వండిపెట్టిన బువ్వ యాది..
బస్టాండ్ల తాను ఏడస్తూ కొంగుతో కొడుకు కన్నీళ్లు
తూడుస్తున్న అమ్మమనాది..
గుండెలో బడిగంగ కొట్టినట్టు మొగుతుంటయి.
పొద్దున ఐదుగొట్టంగనే లేచినవురా రాజుగా..
అని నాయిన పిలిచినట్టు పిలుపులు వినిపిస్తయి.
దోస్త్ శినుగాడు మంచంలో పక్కన పడుకొని
సినిమాల గురించి మాట్లడుకున్న మాటలు
చెవుల నిండా వినిపిస్తుంటాయి.
కొడవలి, సద్దిమూట పట్టుకొని కైకిలు పోతున్నప్పుడు
మోగే చెల్లె కాలి గజ్జెల సౌండ్లు గల్లుమని
మోగినట్టనిపిస్తుంటయి. అన్న కొడుకు,
అక్క కొడుకొ బాబాయి, మావయ్య లే అని పిలిచిన
చిట్టి పిలుపులు జ్ఙాపకం పదే పదే గుర్తుకు
వస్తుంటది. దిగ్గున తెలివివచ్చి నిద్రల కెళ్లి లేస్తే
కొట్టుకొచ్చే ఇసుక రేణువులు, తినిపడెసిన పేపర్
ముక్కలు.. అంతే కాదు ఉటావ్..ఉటావ్ అంటు
పార్క్ వాచ్ మెన్ పిలుపులు తప్ప అంతా కలలో
మెదులుతుంటది.
ఇదంతా ఓ కథ మాత్రం కాదు కరీంనగర్ జిల్లా
నుంచి అరబ్ కంట్రీలకు ఉపాధి కోసం పోతున్న
పేదింటి బిడ్డల వేథ. సర్కారు నిర్లక్ష్యానికి నిలువెత్తు
నిదర్శనమైన గాథ. ఉన్న ఊరిలో ఉపాధి కరువై
పొట్ట చేత పట్టుకొని మెతుకు వేటలో ఎడారి దేశాలకు
వెళ్ళిన కరీంనగర్ జిల్లా వాసులు వివిధ కారణాలతో
అక్కడే మృత్యువాత పడుతుండగా, వారి మృతదేహాలను తెప్పించేందుకు కుటుంబ సభ్యులు అష్టాకష్టాలు
పడుతున్నారు. అక్కడ తప్పిపోయిన వారి సమాచారం
కోసం కొందరు, ఆర్థిక సాయం కోసం ఇంకొందరు
కలెక్టరేట్ చుట్టూ కాళ్ళరిగేలా తిరుగుతున్నా
పట్టించుకున్న వారే కరువయ్యారు. బాధితకుటుంబాలకు
బాసటగా నిలువాల్సిన NRI సెల్ ప్రేక్షక పాత్ర వహిస్తుంది.
భర్త శవం దుబాయ్ లో ఉంటే ఇక్కడ కర్మకాండలు
చేయలేని పరిస్థితి ఓ భార్యదైతే... తలకొరివి
పెడుతాడానుకున్న కొడుకుకే తలకొరివి పెట్టాల్సిన
దుస్థితి ఆ తల్లిదండ్రులది. ఇది తెలంగాణలో ఉపాధి
లేక ఎడారి దేశాల్లో అర్ధాంతరంగా తనువు చాలించిన వారి కుటుంబాల వేదన.గల్ఫ్ దేశాల్లో కరీంనగర్ జిల్లాకు చెందిన 15 మంది మృతదేహాలున్నట్లు గల్ఫ్ రిటర్నింగ్
మెంబర్స్ వెల్ఫేర్ అసోషియేషన్ అధ్యక్షుడు చాంద్ పాషా తెలిపా
very sad Nd Shame Government.:((((((
రిప్లయితొలగించండిపాపం.. అమ్మ నాన్నలను వదిలి వెళ్లి ఎన్ని కష్టాలు పడుతున్నారో..
రిప్లయితొలగించండి