ఎంత దారుణం...
అమ్మ ఒడిలో ఒదిగిపోవాల్సిన పసిపాపలు.. చెత్త కుప్పల్లో ప్రత్యక్షమవుతున్నారు. తల్లి ముద్దు.. మురిపాలతో తడిసిపోవాల్సిన బంగారుకొండలను.. కుక్కలు పీక్కుతింటున్నయి. కన్నవాళ్ల రాక్షసత్వానికి నిన్న ఒక్కరోజే ఇద్దరు పసివాళ్లు ప్రాణాలు విడిచిన్రు. మురికి గుంటల్లో పందులకు, కుక్కలకు ఆహారమైన్రు. గుండెలను కలిచివేసిన పాలబుగ్గల పసిపాపల మరణాలపై సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మొన్న విజయవాడలో ఓ పసిగుడ్డు మరణం..నిన్న ఢిల్లీ ఆసుపత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న పలక్ అనే పసిపాప ఘటన. ఈ రెండు మరవకముందే మరో రెండు ఘటనలు. అది రాజధాని నడిబొడ్డలో అయితే.. మరోటి ఆదిలాబాద్ జిల్లాలో జరిగింది.
p
ఈ పసిపాపను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు హైదరాబాద్ ఎల్బీనగర్ లోని చెరువు గట్టుపైన వదిలివెల్లిన్రు. గుక్కపట్టి ఏడ్చీన పాప చివరికి ఊపిరి విడించింది. అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి పసిపాపను చూసి విషయం స్థానికులకు చెరవేసిండు. దీంతో తండోపతండాలుగా వచ్చిన జనం.. హృదయవిదారకమైన సీన్ను చూసి కంటతడిపెట్టిన్రు. పసిపాపను వదిలివెళ్లిన మృగాలకు శాపనార్థాలు పెట్టిన్రు.
p
ఇక అదిలాబాద్ జిల్లాలోను ఇలాంటి సంఘటనే జరిగింది. అమ్మతనం మరిచిన ఓ రాక్షసి రోజుల పాపను చెత్తకుప్పలో విసిరేసింది. ప్రాణం పోయెంతవరకు ఏడ్చిన చనిపోయిన పసిపాపను కుక్కలు పిక్కుతిన్నాయి. విషయం తెలుసుకున్న స్థానికులు సంఘటన స్థలానికి చేరుకొని కుక్కలను తరిమేసిన్రు. పసిపాప సమాచారన్ని పోలీసులకు అందించ్చిన్రు. సంఘటన స్థలికి చేరుకున్న పోలీసులు పంచనామ చేసి పసిపాపను మున్సిపాలిటీ కి అప్పగించిన్రు. కంటికి రెప్పల చూసుకోవాల్సిన పసిపాపను..కుక్కలపాలు చేయడంపై ఆవేదనవ్యక్తం చేస్తున్నరు.
మానవత్వం మరిచి..కృరంగా వ్యవహరిస్తున్న రాక్షసులపై జనం మండిపడుతున్నరు. పిల్లలను సాదడం చేతకాకుంటే ఆనాధాశ్రమాలకు ఇవ్వాలిగాని ఇలా పొత్తిల్లలోనే చంపివేయడం దారుణమని ఫైర్ అవుతున్నరు. పసిపాపలను చంపుతున్న దుర్మార్గులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నరు. ఇలాంటి సంఘటనలు జరగకుండా సర్కారు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని సూచిస్తున్నరు.
ఆడుతు పాడుతూ ఎదగాల్సిన పసిపిల్లలను చంపడం పట్ల సామాజకివేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నరు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి