తెలుగు మహాసభల్లో తెలంగాణ వైతాళికులకు సరైన గుర్తింపు వచ్చేలా ఏర్పాట్లు సాగాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి, అసెంబ్లీలో వైద్యశాఖపై జోరుగా సాగుతున్న ప్రశ్నోత్తరాల సమయం, /

06 జనవరి, 2012

మీకు కళ్లున్నాయా.. మంత్రిగారు.

                                                       విరిగి పోయిన టేబుళ్లు....

                                                    మాసిపోయిన బోర్డులు...

                                                  రెక్కలు విరిగిన ఫ్యాన్లు..


కూలిపోయిన గోడలు..పాడువడ్డ పరిసరాలు..  విరిగిన కిటికీలు.. పలిగిన తలుపులు.. లేచిపోయిన రేకులు..రెక్కలు లేని ఫ్యాన్లు.. కాళ్లు ఊడి కిందపడిన బెంచీలు.. చెట్లు చెదారంతో నిండిపోయిన ఆవరణం.. బూతు బంగ్లాను తలపిస్తున్న ఈ భవనమే మంథని డిగ్రీ కాలేజీ. సాక్షత్తు మంత్రి శ్రీధర్ బాబు నియోజకవర్గ కేంద్రంలోని దుస్థితి ఇది.
30 యేండ్ల కింద వరద బాధితుల పునరావాసం కోసం కట్టిన భవనంలోనే డిగ్రీ కాలేజి ఏర్పాటు చేసి...అధికారులు చేతులు దులుపుకున్నారు. కాలేజి ఆవరణ అంతా చెత్తా చెదారంతో నిండి ఉంటుందని.. పాములు.. తేళ్లకు అవాసంగా మారిందని విద్యార్థులు ఆవేదన చెందుతున్నరు. ఎప్పుడు కూలుతుందో తెలియక పరేషాన్ అవుతున్నరు. ఇక వర్షకాలం వచ్చిందంటే కాలేజికి సెలవులు తప్ప మరో మార్గం లేదు.
అసలే సెలబస్ కాక టెన్షన్ పడ్తున్న తమకు కాలేజి వాతావరణం సహకరించడంలేదని విద్యార్ధులు దిగులు పడుతున్నరు. బిల్డింగ్ కట్టించకుండా తమ జీవితాలతో ఆటలాడుకోవద్దని వేడుకుంటున్నారు. మంత్రిగారి నిర్లక్ష్యం.. అధికారులు అలక్ష్యం విద్యార్ధులకు శాపంగా మారింది. చదవుకుందమన్న ఆశ.. కూలీపోతున్న కాలేజిలో పడి కాలిపోతుంది. పాడుబడ్డ బంగ్లాలో చదువుకోలేక విద్యార్థులు టెన్షన్ పడ్తున్నారు.
ఇక నోరు విప్పితే అభివృద్ధి అంటూ ఊదరగొట్టే మంత్రి శ్రీధర్ బాబు ఈ కాలేజీవైపు కన్నెత్తి చూడకపోవడంతో విద్యార్ధుల కన్నీరుమున్నీరవుతున్నారు.
నోట్: నాయకులను నమ్మితే మన బతుకులు మారవు.. మంథని డిగ్రీ కాలేజిని మార్చాలనే ఆలోచన ఎవరి మదినైన తడితే మాతో పంచుకోండి.

1 కామెంట్‌:

  1. చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉంది ఈ కాలేజి. అసలు మినిష్టర్ గారి సొంత నియోజక వర్గంలోనే ఇంత పాడుగా ఉంటే మిగత పరిస్థితి ఎలా ఉండాలి.. నిజంగా చాలా భాదేసింది.

    రిప్లయితొలగించండి