ప్రభుత్వాలు ఉన్నాయా ఈ దేశంలో..
(ఉంటే వీళ్లకు వైద్యం అందాలి కదా)
అంతరిక్షానికి అప్ అండ్ డౌన్ చేస్తున్న ఈ రోజుల్లోనూ మూడనమ్మకాలు రాజ్యమేలుతున్నయి. కడుపు నొప్పి వస్తే.. చెంబు వైద్యంపై ఆధారపడి జీవితాలను ఆగం చేసుకుంటున్నరు ఏజెన్సీ ఆదివాసులు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి మూడనమ్మకాలను నిర్ములిస్తున్నమంటున్న ఐటీడీఏ అధికారుల మాటలు.. పచ్చి అబద్దాలని నిరూపిస్తున్నది ఖమ్మం జిల్లా ఏజెన్సీ.
ఇంజక్షన్లు.. గ్లూకోజులు.. ఆపరేషన్లు.. ఎక్సరేలు.. స్కానింగ్ లు.. ఎంజీయోగ్రామ్ లు ఒక్కటేమిటి ఎన్నో అధునిక పరికరాలు.. అయినా రోగం తగ్గుతుందన్న గ్యారంటీ లేని రోజులివి. అట్లాంటిది ఓ చెంబు వైద్యంతో కడుపు నొప్పి తగ్గుతుందని నమ్ముతున్నరు అమాయక ఆదివాసులు. అలా నమ్మే ఒక్కొసారి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నరు.
ఖమ్మం జిల్లాలోని భద్రచలం ఏజెన్సీలోని చింతూరు మండలం సరివెల గ్రామంలో కడుపు నొప్పికి ఈ చెంబు వైద్యం ఫేమస్. గూడెంలో ఎవరికైనా కడుపు నొప్పి వచ్చిందంటే చాలు వెంటనే గ్రామంలో ఉన్న చెంబు డాక్టర్ దగ్గరికి పరుగులు పెడతరు. ఇక చెంబు వైద్యునితో చికిత్స తీసుకుంటరు. కడుపునొప్పి వచ్చిన రొగిని మంచంపై పడుకోబెడతరు. ఆవుపేడతో తయారు చేసిన పిడకను చేసి కడుపు నొప్పి వచ్చిన వ్యక్తి బొడ్డుపై పెడతరు. పిడకపై దీపం వెలిగించి దానిపై దీపం వెలిగిస్తరు. ఆ దీపంపై చెంబును బొర్లించి కొద్దిసేపు ఉంచుతురు. ఆ తర్వాత చెంబును తీస్తరు. దీపం వెలిగి ఉంటే కడుపు నొప్పి పోయిందని.. ఒక వేళ దీపం ఆరిపోతే.. దీపం వెలిగి ఉండే వరకు మళ్లి మళ్లి చేస్తరు.
ఇలాంటి నాటు వైద్యంతొ వందలమంది గిరిజనుల ప్రాణాలు గాలిలో కలిసిన పట్టించుకునే నాధుడే కరువయ్యిండు. ఆదివాసుల అభివృద్ధి కోసం కోట్ల రూపాయలు ఖర్చుచేస్తున్నమని చెబుతున్న ఐటీడీఏ మాటలు.. వట్టి ఫార్స్ అనేందుకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నది సరివెల్ల గ్రామం. గ్రామంలో డాక్టర్ లేకపోవడం.. అధికారులు మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేయకపోవడంతోనే తాము నాటు వైద్యాన్ని ఆశ్రస్తున్నమని గ్రామస్తులు చెబుతున్నరు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ గ్రామంలో వైద్యశాలను ఏర్పాటు చేయాలని ఆదివాసులు డిమాండ్ చేస్తున్నరు. సర్కారు నిర్లక్ష్యం, ఐటీడీఏ అధికారుల అలక్ష్యం అమాయకులైన అదివాసుల ప్రాణాలను తీస్తున్నది. మాట మాట్లడితే అభివృద్ధి అని చెప్పె సర్కారు.. ఈ గిరిజనులకు వైద్య సదుపాయాలు కల్పించాలని మేధావులు కోరుతున్నరు.
good article my dear bro... it's continue........
రిప్లయితొలగించండిweldon...Good Article
రిప్లయితొలగించండి