భక్తజనంతో పులకించిపోతున్న మేడారం !
మేడారం జాతర దుమ్ము రేపుతుంది లక్షల మంది జనంతో కిటకిటలాడుతుంది. అమ్మలు గద్దెలకు రాకముందే భక్తజనంతో పోటెత్తడంతో అధికారులు ఏర్పాట్లలో తలమునకలై ఉన్నారు. ఇక జాతరలో మరోవిశేషమైన ఏర్పాటు హెలీప్యాడ్. ఆదివాసీల సంస్కృతీ సాంప్రదాయలకు వేదికైన మేడారం జాతర ఇప్పుడు ఆధునిక సాంకేతిక పరిజ్జానాన్ని కూడా ప్రతిబింబిస్తోంది. హెలీకాప్టర్ ప్రయాణాలు, సీసీ కెమెరాల నిఘా, వాకీటాకీల మాటలు, కంప్యూటర్ జాతకాలు, బ్యాట్రీ ఆఫ్ టాప్స్ స్నానాలు, సెల్ ఫోన్ల హంగామా జాతరంతా కనిపించనుంది. కోయగిరిజన ఆచారం దెబ్బతినకుండానే లెటెస్ట్ టెక్నాలజీ వాడటం మేడారం జాతర స్పెషల్.
దాదాపు మూడు జాతర క్రితం వరకు ఆధునిక సాంకేతిక పరిజ్జానం మేడారం జాతరలో పెద్దగా లేదు. ప్రస్తుతం సంప్రదాయ పద్దతిలోనే వచ్చి పూజలు నిర్వహించుకుని వెల్లేవారు. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. సమ్మక్క, సారలమ్మను గద్దెల వద్దకు తీసుకుని రావటం, వనప్రవేశం చేయించటం లాంటి ఆచార, వ్యవహారాలకు సంబందించిన పనుల్లో తప్ప మిగతా కార్యక్రమాలన్నింట్లోనూ కోత్తదనం ఉట్టిపడుతోంది. గతంలో మేడారం జాతరకు వివిధ ప్రాంతాలనుండి భక్తులు కాలి నడకన, ఎడ్ల బండ్ల ద్వారా వచ్చేవారు. 1996లో రాష్ట్ర ప్రభుత్వం జాతరను స్టేట్ ఫెస్టివల్ గా ప్రకటించిన తర్వాత రహదారుల నిర్మాణం ఎక్కువైంది. దీంతో భక్తులు వాహనాల ద్వారా జాతరకు రావటం ప్రారంభమైంది. ఇప్పుడు గత జాతర నుండి హెలికాప్టర్ సౌకర్యం కూడా ఏర్పడింది. ఈ సారి జాతరలో కూడా టర్బో ఏవియేషన్ అటు హైదరాబాద్ నుండి, ఇటు మామునూరు నుండి మేడారనికి హెలీకాప్టర్లు నడపటానికి సిద్దమౌతోంది. ఇక ఆర్టీసీ కూడా జాతర జాతరకు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తోంది. గత జాతరలో 2700 బస్సులు నడిపిన ఆర్టీసీ ఈసారి 3159 బస్సులు నడుపుతోంది. క్యూ లైన్లలో ఎక్కువ మంది భక్తులు వేచి ఉండకుండా ఒక్కొక్కరూ టికెట్లు తీసుకోవాల్సి రావటంతో ఇబ్బందులు ఏర్పడేవి. వాటిని నివారించేందుకు ఈ సారి ఆర్టీసీ టిక్కెట్ ఇష్యూయింగ్ మెషిన్లు, టిమ్స్ లను ఏర్పాటు చేస్తోంది. దీంతో భక్తులు ఒక్కరే ఎంతమందికైనా టిక్కెట్ తీసుకునే వెసులుబాటు కలుగుతుంది. జాతర కోసం మొదటిసారిగా ఆర్టీసీ హైదరాబాద్ నుండి కూడా నేరుగా జాతరకు సూపర్ లగ్జరీ బస్సులు నడపనుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి