తెలుగు మహాసభల్లో తెలంగాణ వైతాళికులకు సరైన గుర్తింపు వచ్చేలా ఏర్పాట్లు సాగాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి, అసెంబ్లీలో వైద్యశాఖపై జోరుగా సాగుతున్న ప్రశ్నోత్తరాల సమయం, /

22 ఫిబ్రవరి, 2012

తలపున కృష్ణమ్మ పారిన తలరాత మారడం లేదు.


తలపున కృష్ణమ్మ పారిన తలరాత మారడం లేదు.


      తలపున కృష్ణమ్మ పారుతున్న చెంబెడు నీళ్లు రావు.  కోట్ల రూపాయలతో సర్కారు ‌ప్రాజెక్టులు కట్టిన చుక్క నీళ్లు అందవు. గుక్కెడు నీటి కోసం కిలోమీటర్లు నడవకుంటే గొంతు తడవని పరిస్థితి. పదుల మీటర్లు బోర్లు వేసి.. భగీరథ ప్రయత్నం చేసిన తీరని నీటి కష్టాలు. పాలకుల నిర్లక్ష్యం.. కాలం మిగిల్చిన కరువుతో అల్లాడుతున్న నల్లగొండ జిల్లా గిరిజనుల తాగు సాగు నీటి వేతలు అన్ని ఇన్ని కావు. పథకాల పేర ఊదరగొట్టే పాలకులు గిరిజనులను పట్టించుకున్న పాపానపోవడంతో నానా అవస్థలు పడుతున్నరు. ఓట్లప్పుడు ఇంటింటికి నల్లా కనెక్షన్లు ఇస్తాం, తాగునీటి కష్టాలు తీరుస్తాం. ప్రాజెక్టులను కట్టి సాగు బాధలు ఉండవని అరచేతిలో స్వర్గం చూపించే నాయకులు.. ఇప్పుడు మాత్రం తాండాల దిక్కు చూసే ప్రయత్నం కూడ చేయడం లేదని గిరిజన మహిళలు ఆవేదన వ్యక్తంచేస్తున్నరు. నీళ్ల కోసం.. తమ పిల్లల చదువులు ఆగమైపోతున్నయని వారు దిగులుపుడుతున్నరు.  ఇప్పటికైనా  సర్కారు స్పందించి కష్టాలు తీర్చాలని వేడుకుంటున్నారు.  

1 కామెంట్‌: