తెలుగు మహాసభల్లో తెలంగాణ వైతాళికులకు సరైన గుర్తింపు వచ్చేలా ఏర్పాట్లు సాగాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి, అసెంబ్లీలో వైద్యశాఖపై జోరుగా సాగుతున్న ప్రశ్నోత్తరాల సమయం, /

11 మార్చి, 2012

అతి అరుదైన సంపద అటవిపాలు..


అతి అరుదైన సంపద అటవిపాలు..





అక్కడి రాళ్లు ఓ చరిత్రకు పురుడు పోసినయి. ఆ కొండలు ఘనమైన వారసత్వ సంపదను  కడుపులో దాచుకున్నయి. ప్రపంచంలో ఎత్తైన హుస్సెన్ సాగర్ బుద్ధుడికి తనువునిచ్చిన శిలలు.. వాటితో పురుడు పోసుకున్న అపురూపమైన శివుని ప్రతిమలు, లింగాలు నేడు రాళ్లు రప్పలు, చెట్ల పొదల మాటున అనాధలుగా మిగిలినయి.

    అద్భతమైన పర్యాటక   క్షేత్రంగా అభివృద్ధి చెందే అన్ని అవకాశాలు ఉన్నా..పాలకుల నిర్లక్ష్యంతో బోసిపోతున్నాయి. అధికారులు ఇప్పటికైనా రాయగిరి కొండల చరిత్రపై అధ్యయనం చేసి  అక్కడి సంపదను రక్షించాలి.. పురావస్తు శాఖ అధికారులు పరిశోధన చేసి ఆలయానికి  సంబంధించిన ప్రతి విషయాన్ని అక్షరికరించాలి. పాలకులు నిద్రమత్తును వీడి అరుదైనా  విగ్రహాలకు ఆలయాన్ని నిర్మించి భవిష్యత్ తరాలకు అందించాలి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి