మన దొరలు.. కోయదొరలు..
(కుర్రో..కుర్రుర్రు..)
కుర్రో కుర్రు అంటు మేడారంలో కోయదొరలు హల్చల్ చేస్తున్నరు.తమదైన శైలిలో డైలాగ్స్ చెబుతు జాతరలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నరు. అంతేకాదు భక్తుల జాతకాలను చెబుతు బిజీబిజీగా గడుపుతున్నరు. తలపై నెమలీకలు.. చేతులకు చెట్టువేళ్ల కడియాలతో.. మేడారం జాతరలో ధూంధాం చేస్తున్నరు కోయదొరలు
కొయదొర పలుకులు-1
కుర్రో కుర్రు.. కొండ దేవర పిలుపు.. సమ్మక్క పిలుపు సారవ్వ పిలుపు..
అబ్బబ్బ ఆదిశక్తి..పరా శక్తి కర్రుర్రుర్రు..
దేవర.. కొండ దేవర.. అమ్మవారి
పొలిమెరా కాసేటి పోతలింగుకు..
ద్సూ..స్
తస్సాదియ్యా...
కుర్రో.. కుర్రుర్రుర్రు..
కొండదేవరా పిలుపు.. సమ్మవ్వ పిలుపు.. సారవ్వ పిలుపు ఈ డైలాగులు మేడారం జాతరలో హవా చేస్తున్నయి. అబ్బబ్బ ఆదిశక్తి..పరా శక్తి కర్రుర్రుర్రు.. అంటూ కొండదొరలు పలుకుతున్న మాటలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నయి. పెదలపై మాటలు అల్లినట్టు.. వడివడిగా కొండదొరలు పలుకుతున్న పేరాడిలు చిన్నపిల్లల నాలుకలపై నానుతున్నయి.
కోయదొర పలుకులు-2.
బ్యారమడుగు..జంపన్న వాగు
జాలేరు బండ
మ్వో.. కొండదేవర కుర్రో కర్రుర్రు..
అమ్మవారు.. ఆదిశక్తి.. పరాశక్తి.. .జగన్మాత
అబ్బబ్బా..
అమ్మరావే.. కుర్రుర్రు..
ఇక జీన్స్,టీ షర్టులు కొత్తతరం ఫ్యాషన్లు తప్ప మరో రకం డ్రెస్సె తెలియని ఈ తరం జనరేషన్ కోయదొరల గెటప్ చూసి తెగ సంబరపడుతున్నరు. కోయదొరలతో జాతకాలు చెప్పించుకునేందుకు యమ ఇంట్రెస్ట్ చూపిస్తున్నరు. చేతికి చెట్టువేర్లను కడియాలు చేసుకొని.. చేతికి రంగురాళ్ల ఉంగరాలతో తలపై నెమలికలతో జానెడు గడ్డం..ఉన్న కోయదొరలు మేడారం జాతరకు కొత్తశోభను తీసుకొస్తున్నరు. అంతే కాదు మూలిక వైద్యంతో దీర్ఘకాలికంగా భాదపుడుతున్న రోగులకు కొండంత ధైర్యాన్నిస్తున్నరు.
కోయదొర పలుకులు-3
ఏడుపు.. నరదిష్టి.. నరకన్ను..
నరజబ్బులకు సన్యాసి క్రియల్..
ఇంటి పెందర.. ఇంటిలెక్కా.. బిజినెస్సు..
దందా.. వ్యాపెరాం..లెక్కా..లైనూ..
కాటకలవకుండా.. కట్టుపనిచేసే క్రియల్.
అమ్మా...
లాంటి డైలాగ్స్ తో భక్తుల్లో జాతర పట్ల కొత్త క్రేజ్ ను తీసుకొస్తున్నరు.
భక్తులను ఎంత అలరించిన తమకు రోజు కూలీకూడ గిట్టుబాటు కావడం లేదంటు వాపోతున్నరు కోయదొరలు.
entha bavundo.. enthaina mana samskruthi goppadanam adi..
రిప్లయితొలగించండిబాగుంది
రిప్లయితొలగించండి