తెలుగు మహాసభల్లో తెలంగాణ వైతాళికులకు సరైన గుర్తింపు వచ్చేలా ఏర్పాట్లు సాగాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి, అసెంబ్లీలో వైద్యశాఖపై జోరుగా సాగుతున్న ప్రశ్నోత్తరాల సమయం, /

27 జులై, 2012


బడి పిల్లలా  బలి పశువులా ..?
                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                            


                                         




                                             
                 భుజానికి బండెడు పుస్తకాలు.. మెదట్లో కొండంత టెన్షన్.. ఖైదీలను తరలించే వ్యాన్ లాంటి స్కూల్ వ్యాన్.. జైలులాంటి బడి... బెత్తంతో మాస్టారు.. హోమ్ వర్క్ పేరుతో అమ్మా నాన్నలు..  ఇది నేటి బడి పిల్ల దుస్థితి... అమ్మతో ఆడి  పాడుకోవాల్సిన టైములో పుస్తకాలతో కుస్తీలు పడుతున్నారు. బంగారం లాంటి బాల్యాన్ని బుగ్గిపాలు చేసుకుంటున్నారు. పిల్లాడికి బుడి బుడి అడుగులు వేసేప్పతినుంచే బడికి పంపాలన్నా తల్లిదండ్రుల విపరీత కొరికలవల్ల అమూల్యమైన బాల్యాన్ని పసిమొగ్గలు మిస్ అవుతున్నారని తేల్చి చెప్పింది ఆసోచాం సామజిక అబివృద్ది సర్వే.   పిల్లలు  రోజంతా పుస్తకాలు.. స్కూల్  తప్ప మరో దారి  తెలియని దయనీయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారని ఇది మారని పరిస్థితుల్లో.. రాబోయే తరాల్లో మనవ సంబందాల మనుగడ ప్రశ్నార్ధకం అవుతుందని కుండబద్దలు కొట్టింది..   
               అసోచం సర్వే  మన దేశంలో బడి పిల్లలు అనుభవిస్తున్న దుస్థితిని కళ్ళకు కట్టినట్టు వివరించింది.... తల్లి కడుపులో పిండంగా ఎదుగుతున్నప్పుడే తల్లితండ్రులు ఏ స్కూల్లో వేద్దామా అని ఆలోచిస్తున్న తీరును ఎత్తి చూపింది.. చదువంటే శిక్ష కాదు.. విజ్ఞానాన్ని పంచె ఇంద్రధనస్సాని తేల్చి చెప్పింది.
        తల్లితండ్రులు బీ కేర్ ఫుల్........... 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి