తెలుగు మహాసభల్లో తెలంగాణ వైతాళికులకు సరైన గుర్తింపు వచ్చేలా ఏర్పాట్లు సాగాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి, అసెంబ్లీలో వైద్యశాఖపై జోరుగా సాగుతున్న ప్రశ్నోత్తరాల సమయం, /

13 అక్టోబర్, 2012

తుగ్లక్ రాజకీయాలు...

                        
                              
             రాష్ట్రoలో చిత్ర విచిత్రమైన రాజకీయాలు నడుస్తున్నాయీ.. ఎవరు ప్రతిపక్షమో ఎవరు అధికార పక్షమో తెలియని అయోమయం రాష్ట్ర రాజకీయాల్లో నెలకొంది. ఒక వైపు చెంచల్ గూడ జైలును జగన్  వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం చేసాడని ప్రధాన ప్రతిపక్షంతో పాటు.. అధికార పక్షం లోని నేతలు ప్రభుత్వదినేతపై విమర్శలు ఎక్కుపెట్టిన స్పందించని ప్రభుత్వం.. కాంగ్రెస్ పార్టీ కోసం..అధినేత సోనియా కోసం జీవితాన్ని అంకితం చేస్తాననే పరమ  భక్తుడైన  శంకేర్ రావు ఇంటిపై పోలీసులను ఉసిగొల్పి వీరంగం సృష్టించడం సీ ఎం గారి పనేనని కాంగ్రెస్ శ్రేణులు అనుమానిస్తున్నాయీ. అంతే కాదు వేల కోట్లు మింగిన జగన్ను కంటికి రెప్పల కాపాడుతూ.. పార్టీ కోసం బతికే శంకేర్ రావు ను వేదించటం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
                రాజకీయమో..ప్రజల పట్ల ప్రేమో తెలియదు కానీ జగన్ అవినీతిని రాత్చాకీడ్చిన శంకేర్ రావు ఇంటిపై పోలీసు లు సోదాలు చేయడం మొదలు పెట్టిందో లేదో ఓ రాజకీయ పార్టీ అనుభంద పత్రిక , టీవీ ఇరగబడి ప్రచారం చేసాయీ.. గుండెలో ఉన్న అక్కసునంత  వెళ్ళగక్కింది. ప్రభుత్వం లోని సినీయర్ నేతను అవమానిస్తున్న కాంగ్రెస్ పార్టీ దుష్ట రాజకీయాలకు అద్దం  పట్టింది.
             శంకేర్ రావు తప్పు చేసాడా.. లేదా అన్నది కోర్ట్ తీర్పు చెబుతుంది.. ఒకవేళ తప్పని నిరూపణ అయితే నిస్సందేహంగా శంకేర్ రావు కు శిక్ష పడాల్సిందే.. కానీ కోర్ట్ విచారించామనగానే పోలీసులు సీనియర్ నేత.. ప్రభుత్వ ఎమ్.ఎల్.ఏ  అన్న సంస్కారం లేకుండా.. వీడి రౌడి ఇంట్లో సోదాలు చేసినట్టు సోదాలు చేయడం శోచనీయం.. ప్రభుత్వం లో అంతో ఇంతో ప్రజల పక్షాన మాట్లాడే అతి కొద్ది మంది నాయకుల్లో శంకేర్ రావు ఒకరు..అలంటి వారి పట్ల కాస్త గౌరవంగా వ్యవహరించడం మంచిది. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి